Dinesh Karthik: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన దినేష్ కార్తీక్ - అన్ని సీజన్స్‌లో అడిన క్రికెటర్‌గా రికార్డ్ అతడిదే!
Dinesh Karthik: ఐపీఎల్‌కు దినేష్ కార్తిక్ గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ 2024 రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో బెంగళూరు ఓటమి అనంతరం కార్తిక్ ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. గార్డ్ ఆఫ్ హానర్ ద్వారా బెంగళూరు టీమ్ కార్తిక్‌కు వీడ్కోలు పలికింది.
Dinesh Karthik: టీమిండియా సీనియర్ ప్లేయర్, వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓడిపోయి ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు కార్తిక్.
కార్తీక్ ఎమోషనల్...
చివరి మ్యాచ్ ఆడిన కార్తిక్ ఆటకు వీడ్కోలు పలుకుతూ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లను అదిమిపెట్టుకుంటూ స్టేడియంలో మొత్తం కలియతిరిగుతూ ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. కార్తీక్‌కు బెంగళూరు ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు చెప్పారు. ఈ వెటరన్ ప్లేయర్‌ను గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించింది.
కార్తిక్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతోండగా అతడికి రెండు వైపుల బెంగళూరు ఆటగాళ్లు నిల్చొని చప్పట్లతో సాగనంపారు. కార్తిక్‌కు గార్డ్ ఆఫ్ హానర్‌తో ఆర్‌సీబీ ఆటగాళ్లు వీడ్కోలు పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకానొక దశలో కార్తిక్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అతడిని కోహ్లి హగ్ చేసుకొని ఓదార్చాడు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
4842 రన్స్...
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 257 మ్యాచ్‌లు ఆడిన దినేష్ కార్తిక్ 26.32 యావరేజ్‌తో 4842 రన్ప్ చేశాడు. ఐపీఎల్‌లో కార్తిక్ హయ్యెస్ట్ స్కోరు 97 రన్స్. ఐపీఎల్ కెరీర్‌లో 22 హాఫ్ సెంచరీలు చేశాడు కార్తిక్.
ఐపీఎల్‌లో కార్తీక్ రికార్డులు ఇవే...
పదిహేడు సీజన్స్‌లో...
ఐపీఎల్‌లో పదిహేడు సీజన్స్ ఆడాడు దినేష్ కార్తీక్. ఈ ఘనతను సాధించిన ఏడో ప్లేయర్‌గా నిలిచాడు. కార్తీక్‌తో పాటు ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహా మాత్రమే ఈ ఘనతను సాధించారు. 17 సీజన్స్‌లో కేవలం రెండు మ్యాచ్‌లకు దూరమమయ్యాడు.
ఆరు టీమ్‌లకు ప్రానినిథ్యం...
ఢిల్లీ డెర్‌డెవిల్స్ టీమ్ ద్వారా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ మొత్తం ఆరు టీమ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. ఢిల్లీతో పాటు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌ల తరఫున కార్తిక్ ఐపీఎల్ ఆడాడు.
రోహిత్ శర్మతో సమానంగా...
ఐపీల్‌లో కార్తిక్ 257 మ్యాచ్‌లు ఆడాడు. ధోనీ (264 మ్యాచ్‌లు) తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా రోహిత్ శర్మతో పాటు సెకండ్ ప్లేస్‌లో కార్తిక్ నిలిచాడు.
బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా వికెట్ కీపర్‌గా దినేష్ కార్తిక్ ఐపీఎల్‌లో పలు రికార్డులు నెలకొల్పాడు. ధోనీ తర్వాత అత్యధిక మందిని ఔట్ చేసిన కీపర్‌గా ఐపీఎల్‌లో కార్తిక్ నిలిచాడు. వికెట్ కీపింగ్‌లో ధోని 190 మందిని ఔట్ చేయగా...కార్తీక్ 174 మందిని ఔట్ చేశాడు. స్టంపింగ్స్‌లో ధోనీ (42 ) తర్వా కార్తిక్ (37 స్టంపిగ్స్)తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.
డెత్ ఓవర్స్‌లో...
ధోనీ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక రన్స్ చేసిన వికెట్ కీపర్ కూడా దినేష్ కార్తిక్ కావడం గమనార్హం. అంతే కాకుండా డెత్ ఓవర్స్‌లో అత్యధిక రన్స్ (1565 ) రన్స్ చేసిన మూడో క్రికెటర్‌గా దినేష్ కార్తిక్ నిలిచాడు.