IND vs BAN Highlights: పాండ్య ఆల్‌రౌండ్ మెరుపులు - కుల్దీప్ స్పిన్ మాయ - వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా ఐదో విక్ట‌రీ-india vs bangladesh highlights t20 world cup 2024 super 8 hardik pandya kuldeep yadav ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Ban Highlights: పాండ్య ఆల్‌రౌండ్ మెరుపులు - కుల్దీప్ స్పిన్ మాయ - వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా ఐదో విక్ట‌రీ

IND vs BAN Highlights: పాండ్య ఆల్‌రౌండ్ మెరుపులు - కుల్దీప్ స్పిన్ మాయ - వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా ఐదో విక్ట‌రీ

Jun 23, 2024, 10:23 AM IST Nelki Naresh Kumar
Jun 23, 2024, 10:22 AM , IST

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఓట‌మే లేకుండా దూసుకుపోతోంది టీమిండియా. వ‌రుస‌గా ఐదో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. శ‌నివారం బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో  ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య మెరుపుల‌తో టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 196 ప‌రుగులు చేసింది. హార్దిక్ పాండ్య 27 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో యాభై ర‌న్స్ చేశాడు. 

(1 / 7)

ఈ మ్యాచ్‌లో  ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య మెరుపుల‌తో టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 196 ప‌రుగులు చేసింది. హార్దిక్ పాండ్య 27 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో యాభై ర‌న్స్ చేశాడు. (BCCI-X)

ఇండియా ఇన్నింగ్స్‌ను ఓపెన‌ర్లు  కోహ్లి, రోహిత్ ధాటిగా ఆరంభించారు. రోహిత్ 11 బాల్స్‌లో 23 ర‌న్స్ చేయ‌గా...కోహ్లి 28 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, ఓ ఫోర్‌తో 38 ర‌న్స్ తో అద‌ర‌గొట్టాడు. 

(2 / 7)

ఇండియా ఇన్నింగ్స్‌ను ఓపెన‌ర్లు  కోహ్లి, రోహిత్ ధాటిగా ఆరంభించారు. రోహిత్ 11 బాల్స్‌లో 23 ర‌న్స్ చేయ‌గా...కోహ్లి 28 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు, ఓ ఫోర్‌తో 38 ర‌న్స్ తో అద‌ర‌గొట్టాడు. (PTI)

మిడిల్ ఆర్డ‌ర్‌లో సూర్య‌కుమార్ విఫ‌లం కాగా... రిష‌బ్ పంత్ 24 బాల్స్‌లో 36, శివ‌మ్ దూబే 24 బాల్స్‌లో 34 ప‌రుగుల‌తో రాణించ‌డంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.

(3 / 7)

మిడిల్ ఆర్డ‌ర్‌లో సూర్య‌కుమార్ విఫ‌లం కాగా... రిష‌బ్ పంత్ 24 బాల్స్‌లో 36, శివ‌మ్ దూబే 24 బాల్స్‌లో 34 ప‌రుగుల‌తో రాణించ‌డంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.(PTI)

బ్యాటింగ్‌లో 50 ప‌రుగులు చేయ‌డ‌మే కాకుండా బౌలింగ్‌లో ఓ వికెట్ తీసిన హార్దిక్ పాండ్య‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. 

(4 / 7)

బ్యాటింగ్‌లో 50 ప‌రుగులు చేయ‌డ‌మే కాకుండా బౌలింగ్‌లో ఓ వికెట్ తీసిన హార్దిక్ పాండ్య‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. (ANI)

భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలో దిగిన బంగ్లాదేశ్ భార‌త బౌల‌ర్ల దెబ్బ‌కు 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 146 ప‌రుగుల మాత్ర‌మే చేసింది. 50 ప‌రుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓట‌మి పాలైంది. 

(5 / 7)

భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలో దిగిన బంగ్లాదేశ్ భార‌త బౌల‌ర్ల దెబ్బ‌కు 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 146 ప‌రుగుల మాత్ర‌మే చేసింది. 50 ప‌రుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓట‌మి పాలైంది. (BCCI-X)

బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్‌లో కెప్టెన్ షాంటో 40, తాంజిద్ హ‌స‌న్ 29 ర‌న్స్ చేశారు. చివ‌ర‌లో రిషాద్ మూడు సిక్సుల‌తో మెరుపులు మెరిపించిన అత‌డి పోరాటం స‌రిపోలేదు

(6 / 7)

బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్‌లో కెప్టెన్ షాంటో 40, తాంజిద్ హ‌స‌న్ 29 ర‌న్స్ చేశారు. చివ‌ర‌లో రిషాద్ మూడు సిక్సుల‌తో మెరుపులు మెరిపించిన అత‌డి పోరాటం స‌రిపోలేదు(BCCI - X)

టీమిండియా బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ మూడు, అర్ష‌దీప్ సింగ్‌, బుమ్రా త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు. హార్దిక్ పాండ్య‌కు ఓ వికెట్ ద‌క్కింది. 

(7 / 7)

టీమిండియా బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ మూడు, అర్ష‌దీప్ సింగ్‌, బుమ్రా త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు. హార్దిక్ పాండ్య‌కు ఓ వికెట్ ద‌క్కింది. (BCCI- X)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు