IBPS SO prelims results 2024: ఐబీపీఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్ 2024 ఫలితాలు వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..
04 December 2024, 20:49 IST
- IBPS SO prelims results 2024: ఐబీపీఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్ 2024 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఐబీపీఎస్ ఎస్ఓ ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఐబీపీఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్ 2024 ఫలితాలు వెల్లడి
IBPS SO prelims results 2024: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ప్రిలిమినరీ పరీక్ష 2024 ఫలితాలను బుధవారం విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in ద్వారా తమ రిజల్ట్ ను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఫలితాలను 2024 డిసెంబర్ 10 వరకు డౌన్లోడ్ చేసుకునే వీలుంటుందని ఐబీపీఎస్ తెలిపింది.
ఐబీపీఎస్ సో ప్రిలిమ్స్ ఫలితాలు 2024
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ (IBPS Specialist Officer) ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఐబీపీఎస్ ఎస్ఓ మెయిన్స్ 2024కు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ పరీక్ష డిసెంబర్ 14, 2024న జరిగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 896 స్కేల్ 1 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
- అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్: 346 ఖాళీలు
- హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్: 25 ఖాళీలు
- ఐటీ ఆఫీసర్: 170 ఖాళీలు
- లా ఆఫీసర్: 125 ఖాళీలు
- మార్కెటింగ్ ఆఫీసర్: 205 ఖాళీలు
- రాజ భాష అధికారి: 13 ఖాళీలు
విద్యార్హతలు, ఇతర వివరాలు..
ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆ పరీక్షలో అర్హత సాధించాలంటే ప్రతి విభాగంలో కనీస మార్కులతో పాటు, మొత్తంగా కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఖాళీల సంఖ్యను బట్టి మెయిన్స్ పరీక్ష (EXAMS) కు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందుకు గానూ, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కును నిర్ణయిస్తారు. ఆగస్టు 1, 2024 నాటికి కనీసం 20 ఏళ్లు నిండిన, 30 ఏళ్లు నిండని అభ్యర్థులు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంతేకాకుండా అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ లో పాల్గొనే బ్యాంకుల ప్రమాణాల ప్రకారం ఆరోగ్యకరమైన క్రెడిట్ హిస్టరీని నిర్వహించాల్సి ఉంటుంది.
ఐబిపిఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్ ఫలితాలు 2024
ఐబిపిఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్ ఫలితాలను చెక్ చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
- ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 'సీఆర్పీ- ఎస్పీఎల్-ఎస్ఐవీ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ స్టేటస్' అనే లింక్ పై క్లిక్ చేయండి.
- లాగిన్ చేయడానికి మీ వివరాలను నమోదు చేయండి. ఆ తరువాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
- స్క్రీన్ పై కనిపించే ఐబీపీఎస్ ఎస్ వో ప్రిలిమ్స్ (bank jobs) ఫలితాన్ని చెక్ చేసుకోండి.
- భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ఫలితాన్ని డౌన్ లోడ్ చేసి ప్రింట్ అవుట్ ఉంచుకోండి.
- దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.