Specialist Officers: సెంట్రల్ బ్యాంకులో ఐటీ స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు… 253 ఖాళీలు, దరఖాస్తు చేయండి ఇలా…-it specialist officer jobs in the central bank 253 vacancies ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Specialist Officers: సెంట్రల్ బ్యాంకులో ఐటీ స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు… 253 ఖాళీలు, దరఖాస్తు చేయండి ఇలా…

Specialist Officers: సెంట్రల్ బ్యాంకులో ఐటీ స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు… 253 ఖాళీలు, దరఖాస్తు చేయండి ఇలా…

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 20, 2024 10:31 AM IST

Specialist Officers: సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 253 పోస్టులను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీనియర్ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌ 4లో చీఫ్‌ మేనేజర్లను తాజా నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు.

సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Specialist Officers: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. మొత్తం 253 పోస్టులను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సీనియర్ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌ 4లో చీఫ్‌ మేనేజర్లను తాజా నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. డిసెంబర్ 21వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. డిసెంబర్ 14వ తేదీన ఆన్‌ లైన్ పరీక్ష నిర్వహిస్తారు.జనవరి 2వ వారంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

సెంట్రల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఈ లింకును అనుసరించండి.

https://www.centralbankofindia.co.in/en/recruitments

కేంద్ర ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 4500కు పైగా బ్రాంచిలతో ఏటా రూ.6400కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సెంట్రల్ బ్యాంకులో ప్రస్తుతం 33వేల మంది ుద్యోగులు ఉన్నాయి. తాజాగా చీఫ్ జనరల్ మేనేజర్‌ హోదా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.గ్రేడ్‌ 4 సీనియర్ మేనేజర్‌ స్థాయి ఉద్యోగాలతో పాటు, గ్రేడ్‌ 3లో సీనియర్‌ మేనేజర్‌, మిడిల్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రేడ్ 2 మేనేజర్లు అసిసెంట్ మేనేజర్ ఉద్యోగాలను స్పెషలిస్ట్‌ ఆఫీసర్లుగా భర్తీ చేస్తారు.

  • స్కేల్‌ 4 చీఫ్‌ మేనేజర్‌ ఉద్యోగాల్లో ఐటీ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు 10ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ 1, ఓబీసీ 2 ఈడబ్ల్యుఎస్‌ 1, జనరల్ 6 ఖాళీలు ఉన్నాయి.
  • స్కేల్ 3 సీనియర్ మేనేజర్ ఉఎద్యోగాల్లో ఐటీ స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టుల్లో 8ఎస్సీ రిజర్వుడు, 4 ఎస్టీ, 15 ఓబీసీ, 5ఈడబ్ల్యుఎస్‌, 24 జనరల్ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 56 పోస్టులు స్కేల్ 3 క్యాటగిరీలో ఉన్నాయి.
  • స్కేల్ 2 మేనేజర్ విభాగంలో ఎస్సీ క్యాటగిరీలో 24, ఎస్టీ 12, ఓబీసీ 44, ఈడబ్ల్యుఎస్‌ 16, జనరల్ 66 సహా మొత్తం 166 పోస్టులు ఉన్నాయి.
  • స్కేల్ 1, అసిస్టెంట్ మేనేజర్లలో 4 ఎస్సీ, 2 ఎస్టీ, 7 ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ 3, జనరల్ 9 సహా మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 253 ఉద్యోగాల్లో వికలాంగుల రిజర్వేషన్లు వర్తింప చేస్తారు.

సెంట్రల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఈ లింకును అనుసరించండి.

https://www.centralbankofindia.co.in/en/recruitments

అర్హతలు...

దరఖాస్తుదారులు జావా డెవపరల్లు, కోబాల్‌, డాట్‌ నెట్‌, సర్వర్ అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క‌ అడ్మినిస్ట్రేటర్, డాటా బేస్ మేనేజ్‌మెంట్‌, డాటా అనలిటిక్స్‌, జనరల్ ఏఐ ఎక్స్‌పర్ట్‌, ఐటీ సెక్యూరిటీ, ఐటీ సపోర్ట్‌, ఐటీ ఆర్కిటెక్ట్‌, యాప్ డెవలప్‌మెంట్‌, మార్‌టెక్‌ వంటి విభాగాల్లో అనుభవం ఉండాలి. విభాగాల వారీగా ఖాళీలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయా పోస్టులకు అనుగుణంగా విధులను నోటిఫికేషన్‌లో వివరించారు.

ఇప్పటికే సెంట్రల్ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులు తాజా నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఖాళీలను బట్టి అర్హతల ఆదారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు, అనుభవం వివరాలను పోస్టుల వారీగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఈ లింకును ఫాలో అవ్వండి..

https://ibpsonline.ibps.in/cbimoct24/

వయోపరిమితి, అనుభవం...

స్కేల్‌ 4 ఉద్యోగాలకు 34ఏళ్ల నుంచి 40ఏళ్ల వయసుతో కనీసం 8 ఏళ్ళ అనుభవం ఉండాలి. స్కేల్‌ 3 పోస్టులకు 30-38ఏళ్ల వయసు ఆరేళ్ల అనుభవం ఉండాలి. స్కేల్ 2 ఉద్యోగాలకు 27-33 ఏళ్ల వయసు 4ఏళ్ల అనుభవం ఉండాలి. స్కేల్ 1 పోస్టులకు 23-27ఏళ్లు అనుభవం రెండేళ్ల అనుభవం ఉండాలి.

అన్ని పోస్టులు ముంబై, నవీ ముంబై, హైదరాబాద్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. బ్యాంకు అవసరాలకు అనుగుణంగా 24 గంటలు అందుబాటులో ఉండేలా, ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధపడి ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్ల సడలింపు ఇస్తారు. ఓబీసీలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు, 1984అల్లర్ల బాధితులకు 5ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 5ఏళ్లు సడలింపు వయోపరిమితిలో ఇస్తారు.

దరఖాస్తు చేయడానికి ఈ లింకును ఫాలో అవ్వండి..

https://ibpsonline.ibps.in/cbimoct24/

వేతనం...

స్కేల్‌ 4 మేనేజర్లకు ఏటా 35.27లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. స్కేల్ 3 మేనేజర్లకు రూ.29.17లక్షలు, స్కేల్ 2 మేనేజర్లకు రూ.23.54 లక్షలు, స్కేల్ మేనేజర్లకు రూ.19.38లక్షల వేతనం లభిస్తుంది. అన్ని ఉద్యోగాలు ముంబై, హైదరాబాద్‌లలో మాత్రమే పోస్టింగ్ వర్తిస్తుంది.

ఆన్‌లైన్ పరీక్ష...

పరీక్ష కేంద్రాలు దేశ వ్యాప్తంగా 15 కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో మాత్రమే ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.

సెంట్రల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఈ లింకును అనుసరించండి.

https://www.centralbankofindia.co.in/en/recruitments

Whats_app_banner