తెలుగు న్యూస్  /  career  /  Gic Recruitment 2024: జీఐసీ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం

GIC Recruitment 2024: జీఐసీ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం

Sudarshan V HT Telugu

04 December 2024, 15:50 IST

google News
  • GIC Recruitment 2024: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జీఐసీ అధికారిక వెబ్ సైట్ gicre.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

జీఐసీ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ
జీఐసీ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ

జీఐసీ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ

GIC Recruitment 2024: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 110 అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్ 1 ఆఫీసర్) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత ఉన్న గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు జీఐసీ అధికారిక వెబ్ సైట్ gicre.in ద్వారా ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 19.

జీఐసీ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ 2024: ముఖ్యమైన తేదీలు

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబర్ 4

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 19.

ఆన్ లైన్ పరీక్ష తేదీ: జనవరి 5, 2025

అడ్మిట్ కార్డులు: పరీక్షకు 7 రోజుల ముందు నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.

ఖాళీలు, విద్యార్హతలు

ఇందులో జనరల్ స్ట్రీమ్ లో 18 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లు, లీగల్ స్ట్రీమ్ లో 9 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లు, హెచ్ఆర్ కేటగిరీలో 6 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లు, ఇంజనీరింగ్ విభాగంలో 5 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లు, ఐటీ విభాగంలో 22 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లను ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే, ఆక్చువరి విభాగంలో 10, ఇన్సూరెన్స్ విభాగంలో 20, మెడికల్ స్ట్రీమ్ లో 2, ఫైనాన్స్ విభాగంలో 2 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్ లకు విభాగాల వారీగా విద్యార్హతలు, అనుభవం ఉండాలి. పూర్తి వివరాలను ఆసక్తి గల అభ్యర్థులు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ gicre.in లోని సమగ్ర నోటిఫికేషన్ ను పరిశీలించాలి. ఒక అభ్యర్థి ఒక స్ట్రీమ్ కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బహుళ దరఖాస్తుల విషయంలో, చివరి దరఖాస్తు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

తదుపరి వ్యాసం