NABARD Recruitment: నాబార్డ్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్-nabard grade a recruitment 2024 apply for 102 assistant manager posts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nabard Recruitment: నాబార్డ్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

NABARD Recruitment: నాబార్డ్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Jul 27, 2024 09:23 PM IST

NABARD Recruitment: గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నాబార్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నాబార్డ్ అధికారిక వెబ్ సైట్ nabard.org ద్వారా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నాబార్డ్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
నాబార్డ్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

NABARD Recruitment: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నాబార్డ్ అధికారిక వెబ్సైట్ nabard.org ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 102 పోస్టులను భర్తీ చేయనున్నారు.

లాస్ట్ డేట్ ఆగస్ట్ 15

నాబార్డ్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 జూలై 27న ప్రారంభమై ఆగస్టు 15న ముగుస్తుంది. ఫేజ్-1 ప్రిలిమినరీ పరీక్షను 2024 సెప్టెంబర్ 1న నిర్వహిస్తారు.

ఖాళీల వివరాలు

  • అసిస్టెంట్ మేనేజర్ (ఆర్ డీబీఎస్): 100 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజర్ (రాజ భాష): 2 పోస్టులు

నాబార్డ్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కేటగిరీ వారీగా విద్యార్హతలను వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. నాబార్డ్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు జూలై 1, 2024 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే, వారు 02-07-1994 నుంచి 01-07-2003 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం

ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ అనే నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో 200 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. దీని సమయ వ్యవధి 210 నిమిషాలు. సైకోమెట్రిక్ పరీక్ష ఎంసీక్యూ ఆధారితంగా ఉంటుంది. సమయ వ్యవధి 90 నిమిషాలు. ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ 1, 2, 3) కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవడానికి నాబార్డు వెబ్ సైట్ ను రెగ్యులర్ గా చూస్తుండాలి. కాల్ లెటర్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈమెయిల్ /ఎస్ ఎంఎస్ ద్వారా కూడా సమాచారం పంపుతారు.

దరఖాస్తు ఫీజు

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.150, ఇతరులకు రూ.700+రూ.150. అంటే, మొత్తంగా రూ.850. ఈ రుసుము రీఫండ్ చేయబడదు. దీనిని ఆన్ లైన్ లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు/ఇన్ఫర్మేషన్ ఛార్జీల చెల్లింపు కోసం బ్యాంకు లావాదేవీ ఛార్జీలను అభ్యర్థి భరించాల్సి ఉంటుంది.

Whats_app_banner