తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp New Feature : వాట్సాప్​లో కొత్త ప్రైవసీ ఫీచర్​.. ఇక ఎంత ప్రయత్నించినా ‘అది అవ్వదమ్మ..’

WhatsApp new feature : వాట్సాప్​లో కొత్త ప్రైవసీ ఫీచర్​.. ఇక ఎంత ప్రయత్నించినా ‘అది అవ్వదమ్మ..’

Sharath Chitturi HT Telugu

23 February 2024, 12:01 IST

  • WhatsApp latest privacy feature : యూజర్స్​ ప్రైవసీకి సంబంధించి.. ఓ కొత్త ఫీచర్​ని తీసుకొస్తోంది వాట్సాప్​. అది అందుబాటులోకి వస్తే.. ఇక ప్రొఫైల్​ ఫొటోలను స్క్రీన్​షాట్​ తీసుకోవడానికి ఉండదు!

వాట్సాప్​లో కొత్త ప్రైవసీ ఫీచర్​.. ఇక ఎంత ప్రయత్నించినా ‘అది అవ్వదమ్మ..’
వాట్సాప్​లో కొత్త ప్రైవసీ ఫీచర్​.. ఇక ఎంత ప్రయత్నించినా ‘అది అవ్వదమ్మ..’ (MINT_PRINT)

వాట్సాప్​లో కొత్త ప్రైవసీ ఫీచర్​.. ఇక ఎంత ప్రయత్నించినా ‘అది అవ్వదమ్మ..’

WhatsApp new feature : యూజర్స్​ని ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్​ని రిలీజ్​ చేస్తూ ఉంటుంది.. దిగ్గజ సామాజిక మాధ్యమం వాట్సాప్​. అంతేకాకుండా.. కస్టమర్ల ప్రైవసీకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో.. ఈ మెటా ఆధారిత వాట్సాప్​.. ఓ కొత్త ప్రైవసీ ఫీచర్​ని తీసుకురాబోతోందని సమాచారం. ఈ ఫీచర్​ ద్వారా.. యాప్​లోని ప్రొఫైల్​ ఫొటోలను ఇక స్క్రీన్​షాట్​ తీసుకోవడానికి ఉండదు!

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

వాట్సాప్​ కొత్త ప్రైవసీ ఫీచర్​..

వాట్సాప్​లో ప్రొఫైల్​ ఫొటో సేవింగ్​, డౌన్​లోడ్​ ఆప్షన్​ ఉండదు. ఇక ఇప్పుడు.. మరో అడుగు ముందుకేసి, ప్రొఫైల్​ ఫొటోలను స్క్రీన్​ షాట్​ కూడా తీసుకోనివ్వకుండా చూస్తోంది! ఈ ఫీచర్​.. వాట్సాప్​ బీటా వర్షెన్​లో ఇప్పటికే అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్​ పేరు ఇంకా రివీల్​ అవ్వలేదు కానీ.. ఎవరైనా స్క్రీన్​షాట్​ తీసేందుకు ప్రయత్నిస్తుంటే.. అది జరగకపోగా, ఓ వార్నింగ్​ మెసేజ్​ కనిపిస్తుందట! అనుమతి లేకుండా.. ప్రొఫైల్​ ఫొటోలను స్క్రీన్​షాట్​ తీసుకోనివ్వకుండా ఉండేందుకు ఈ ఫీచర్​ ఉపయోగపడుతుందని సోషల్​ మీడియా సైట్​ భావిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్​ అందుబాటులోకి వచ్చేందుకు కాస్త సమయం పడుతుందని తెలుస్తోంది.

WhatsApp latest privacy feature : ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొత్త ఫీచర్​ వచ్చినా, 100 పర్సెంట్​ సేఫ్​ అనుకోవడానికి లేదు. ప్రొఫైల్​ ఫొటోలను సేవ్​, డౌన్​లోడ్​ చేసుకోలేకపోవచ్చు, స్క్రీన్​షాట్​ తీసుకోలేకపోవచ్చు కానీ.. ఇతర ఫొన్​ నుంచి సంబంధిత ప్రొఫైల్​ ఫొటోను క్యాప్చర్​ చేసుకోవచ్చు!

అయితే.. వినియోగదారుల ప్రైవసీ కోసం వాట్సాప్​లో ఇప్పటికే కొన్ని ఫీచర్స్​ అందుబాటులో ఉన్నాయి. మన ప్రొఫైల్​ ఫొటోని ఎవరు చూడొచ్చు? ఎవరు చూడకూడదు? అనది మనమే మేనేజ్​ చేసుకోవచ్చు. ఇది.. ప్రైవసీ సెట్టింగ్స్​ మెన్యూలో ఉంటుంది.

వాట్సాప్​లో ‘ఫేవరెట్​ కాంటాక్ట్స్​’ ఫీచర్​..!

WhatsApp latest news : వాట్సాప్​.. ఓ కొత్త ఫీచర్​ని త్వరలోనే రిలీజ్​ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ ఫీచర్​ పేరు 'ఫేవరెట్​ కాంటాక్ట్స్​'. సాధారణంగా.. ఫోన్​ కాంటాక్ట్స్​లో ఫేవరెట్స్​, స్పీడ్​ డయల్స్​ వంటివి ఉంటాయి. అదే విధంగా.. ఈ కొత్త ఫీచర్​తో వాట్సాప్​లో కూడా మనం మన ఫేవరెట్​ కాంటాక్ట్స్​ లిస్ట్​ని తయారు చేసుకోవచ్చట. అయితే.. ఈ ఫీచర్​ ప్రస్తుతం డెవలప్​మెంట్​ స్టేజ్​లోనే ఉందని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం