WhatsApp new feature : వాట్సాప్​లో కొత్త ఫీచర్​- ‘ఫేవరెట్ కాంటాక్ట్స్​​’తో ఆ పని మరింత ఈజీ!-tech news whatsapp to introduce new favourite contacts feature for quick calls and posts ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp New Feature : వాట్సాప్​లో కొత్త ఫీచర్​- ‘ఫేవరెట్ కాంటాక్ట్స్​​’తో ఆ పని మరింత ఈజీ!

WhatsApp new feature : వాట్సాప్​లో కొత్త ఫీచర్​- ‘ఫేవరెట్ కాంటాక్ట్స్​​’తో ఆ పని మరింత ఈజీ!

Sharath Chitturi HT Telugu
Feb 06, 2024 12:05 PM IST

WhatsApp favourite feature : వాట్సాప్​లో త్వరలోనే ఓ కొత్త ఫీచర్​ రాబోతోంది. దాని పేరు వాట్సాప్​ 'ఫేవరెట్​ కాంటాక్ట్స్​’. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వాట్సాప్​లో కొత్త ఫీచర్​- ‘ఫెవరెట్​’తో ఆ పని మరింత ఈజీ!
వాట్సాప్​లో కొత్త ఫీచర్​- ‘ఫెవరెట్​’తో ఆ పని మరింత ఈజీ! (REUTERS)

WhatsApp new features 2024 : యూజర్స్​కు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎక్స్​పీరియన్స్​ని ఇచ్చేందుకు నిత్యం కృషి చేసే దిగ్గజ సోషల్​ మీడియా సంస్థ వాట్సాప్​.. గతేడాది అనేక సరికొత్త ఫీచర్స్​ని లాంచ్​ చేసింది. వాటిల్లో 'ఛానెల్స్​' ఫీచర్​ ఒకటి. ఈ ఫీచర్​.. యూజర్స్​కి చాలా బాగా నచ్చింది. ఇక ఇప్పుడు.. 2024లో కూడా అనేక కొత్త ఫీచర్స్​ని తీసుకొచ్చేందుకు.. ఏర్పాట్లు చేసుకుంటోంది ఈ మెటా ఆధారిత వాట్సాప్​. ఇందులో భాగంగా.. ఓ కొత్త ఫీచర్​ని త్వరలోనే రిలీజ్​ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ ఫీచర్​ పేరు 'ఫేవరెట్​ కాంటాక్ట్స్​'. అది ఎలా పనిచేస్తుందంటే..

వాట్సాప్​లో ఫేవరెట్ కాంటాక్ట్స్​​​ ఫీచర్​..!

ఫేవరెట్​ కాంటాక్ట్స్​ ఫీచర్​కి అర్థం.. దాని పేరులోనే ఉంది. సాధారణంగా.. ఫోన్​ కాంటాక్ట్స్​లో ఫేవరెట్స్​, స్పీడ్​ డయల్స్​ వంటివి ఉంటాయి. అదే విధంగా.. ఈ కొత్త ఫీచర్​తో వాట్సాప్​లో కూడా మనం మన ఫేవరెట్​ కాంటాక్ట్స్​ లిస్ట్​ని తయారు చేసుకోవచ్చట. అయితే.. ఈ ఫీచర్​ ప్రస్తుతం డెవలప్​మెంట్​ స్టేజ్​లోనే ఉందని సమాచారం.

వాట్సాప్​ ఫేవరెట్​ కాంటాక్ట్స్​ ఫీచర్​తో యూజర్లు తమకు ఇష్టమైన వారికి.. వీడియో, ఆడియో కాల్స్​ని సులభంగా చేసుకోవచ్చు. దీనితో కాలింగ్​ ఎక్స్​పీరియన్స్​ మెరుగుపడుతుంది.

WhatsApp favourite feature : అయితే.. ఈ వాట్సాప్​ కొత్త ఫీచర్​లో యూజర్లు.. తమ ఫేవరెట్​ కాంటాక్ట్స్​ని ఎలా క్రియేట్​ చేసుకుంటారు? అన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ.. సంబంధిత కాంటాక్ట్​ని లాంగ్​ ప్రెస్​ చేస్తే, దాని పక్కన ఫేవరెట్​ ఆప్షన్​ రావొచ్చు అని టెక్​ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ ఫేవరెట్​ కాంటాక్ట్స్​ని ఎలా క్రియోట్​ చేసుకోవాలి అనేది వేచి చూడాలి.

ఈ వాట్సాప్​ ఫేవరెట్​ కాంటాక్ట్స్​ ఫీచర్​ యూజర్లకు బాగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా.. వందలాది కాంటాక్ట్స్​ ఉన్న వారు, తమకు ఇష్టమైన వారి నెంబర్లు ఇలా ఒక గ్రూప్​గా పెట్టుకుంటే, వెంటనే వీడియో, ఆడియో కాల్స్​ చేసేందుకు పని సులభమవుతుంది.

ఈ వాట్సాప్​ కొత్త ఫీచర్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎలా పని చేస్తుంది? అన్న వివరాలపై దిగ్గజ సోషల్​ మీడియా సంస్థ స్పందించాల్సి ఉంది. త్వరలోనే దీనిపై ఓ అప్డేట్​ వస్తుందని అంచనాలు ఉన్నాయి.

WhatsApp latest features in Telugu : మరోవైపు.. కమ్యూనిటీ యూజర్స్​కి 'పిన్న్​డ్​ ఈవెంట్స్​' ఫీచర్​ని తీసుకొచ్చేందుకు వాట్సాప్​ ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. ముఖ్యమైన ఈవెంట్స్​ని ఆ ఫీచర్​ ద్వారా మార్క్​ చేసుకోవచ్చని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం