WhatsApp features : వాట్సాప్ కమ్యూనిటీస్- ఛానెల్.. ఈ ఫీచర్స్‌ని ఎలా వాడాలి?
WhatsApp features : వాట్సాప్‌లో కమ్యూనిటీస్ ఫీచర్ ఉంది. ఛానెల్ ఫీచర్ కూడా ఉంది. అసలు ఈ రెండింటినీ ఎలా ఉపయోగించుకోవాలి? ఇక్కడ తెలుసుకుందాము..
How to use WhatsApp communities feature : యూజర్లకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తూ ఉంటుంది సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్. ఈ క్రమంలోనే.. ఈ మెటా ఆధారిత సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తుంది. ఇక ఇప్పుడు.. వాట్సాప్ ఛానెల్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే కమ్యూనిటీస్ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే.. చాలా మందికి ఈ రెండింటిని ఎలా వాడాలో తెలియదు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాము..
కమ్యూనిటీస్ ఎలా పని చేస్తుందంటే..
ఈ కమ్యూనిటీస్ ఫీచర్‌ను గతేడాది నవంబర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. వాట్సాప్ గ్రూప్స్‌లో ఛాటింగ్‌ను ఇది సులభతరం చేస్తుంది. ఉదాహరణకు.. మీ స్కూల్ ఫ్రెండ్స్‌కి ఒక గ్రూప్ ఉంది. ఇంటర్, డిగ్రీ కాలేజ్‌లకు వేరువేరు గ్రూప్‌లు ఉన్నాయని అనుకుందాము. ఇలాంటి గ్రూప్‌లను ఒక్క చోటకు తీసుకురావచ్చు. అంటే.. వీటిని ఒక కమ్యూనిటీగా పెట్టుకోవచ్చు. ఇదే.. కమ్యూనిటీస్ ఫీచర్. సంబంధిత కమ్యూనిటీని ఓపెన్ చేసి.. ఆయా గ్రూప్స్‌లో ఛాట్ చేసుకోవచ్చు.
WhatsApp community feature : కమ్యూనిటీస్‌లో ఆల్‌రౌండ్ కన్వర్జెషన్స్ ఉంటాయి. అంటే.. కమ్యూనిటీలో ఏదైనా పోస్ట్, మెసేజ్ పెడితే.. అందులోని వారందరూ చూస్తారు. చూసి రిప్లై ఇవ్వొచ్చు.
కమ్యూనిటీస్ ఫీచర్‌ని ఇలా స్టార్ట్ చేసుకోండి..
స్టెప్ 1:- వాట్సాప్ ఇన్‌బాక్స్‌ను రైట్కి స్వైప్ చేయండి.
స్టెప్ 2:- కమ్యూనిటీస్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో 'స్టార్ట్ యువర్ కమ్యూనిటీ' అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:- ఫొటో, పేరు వంటివి టైప్ చేయాల్సి ఉంటుంది. టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే.. కమ్యూనిటీ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత అందులో మీరు కొత్త గ్రూప్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. లేదా పాత గ్రూప్‌లను యాడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ఛానెల్ ఎలా పనిచేస్తుందంటే..
How to use WhatsApp channels feature : వాట్సాప్‌లో ఛానెల్ ఫీచర్‌ను తీసుకురావాలని చాలా రోజులుగా కస్టమర్లు అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఛానెల్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది ఈ సామాజిక మాధ్యమ దిగ్గజం. తొలుత ఇది కొలంబియా, సింగపూర్ దేశాల్లోని యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
ఛానెల్ అనేది వన్ టు మెనీ బ్రాడ్కాస్ట్ టూల్! అంటే.. ఒక ఛానెల్‌ను క్రియేట్ చేస్తే.. ఆ ఛానెల్‌కు మీరు అడ్మిన్ అవుతారు. అందులో ఇతరులు జాయిన్ అవ్వొచ్చు. మీరు పెట్టే అప్డేట్స్ను, పోల్స్‌ను వాళ్లు చూడగలరు. కానీ రిప్లైలు ఇవ్వలేరు. టెలిగ్రామ్‌లో ఈ ఫీచర్‌ను చాలా మంది ఇప్పటికే వాడుతున్నారు.
ఛానెల్ కంట్రోల్ మొత్తం అడ్మిన్స్ దగ్గరే ఉంటుంది. ఏదైనా అందులో షేర్ చేసుకోవచ్చు.
ఛానెల్లో అడ్మిన్ కాంటాక్ట్ నెంబర్, ప్రొఫైల్ ఫొటో వంటివి ఫాలోవర్స్‌కు కనిపించదు. అదే విధంగా.. ఫాలోవర్స్ వివరాలు అడ్మిన్‌కు కనిపించవు.
మీ ఛానెల్‌ను ఇలా స్టార్ట్ చేయండి..
WhatsApp channel feature : స్టెప్ 1:- ఛానెల్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. అప్డేట్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 2:- అనంతరం ఛానెల్ పేరు పక్కన ఉన్న '+' సింబల్ మీద క్లిక్ చేయండి. లేదా ఇన్వైట్ లింక్‌తో జాయిన్ అవ్వొచ్చు.
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనిటీస్‌లో కన్వర్జేషన్లు అలాగే ఉంటాయి. కానీ ఛానెల్స్‌లో మాత్రం 30 రోజుల తర్వాత మాయమైపోతాయి. కమ్యూనిటీస్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. కానీ ఛానెల్స్‌కు ఇది రాదు.
సంబంధిత కథనం