తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Metro Tickets In Whatsapp : ఇక వాట్సాప్​లోనే మెట్రో టికెట్స్​ కొనొచ్చు..

Metro tickets in WhatsApp : ఇక వాట్సాప్​లోనే మెట్రో టికెట్స్​ కొనొచ్చు..

Sharath Chitturi HT Telugu

26 January 2024, 11:34 IST

    • Chennai Metro tickets in WhatsApp : వాట్సాప్​లో మెట్రో టికెట్​ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది చెన్నై మెట్రో. ఎలా బుక్​ చేసుకోవాలో ఇక్కడ చూడండి..
ఇక వాట్సాప్​లోనే మెట్రో టికెట్స్​ కొనొచ్చు..
ఇక వాట్సాప్​లోనే మెట్రో టికెట్స్​ కొనొచ్చు..

ఇక వాట్సాప్​లోనే మెట్రో టికెట్స్​ కొనొచ్చు..

Metro tickets in WhatsApp : సరికొత్త టెక్నాలజీ ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తుండటంతో.. చాలా పనులు సులభమైపోతున్నాయి. ఇక ఇప్పుడు.. వాట్సాప్​లోనే మెట్రో టికెట్స్​ కొనే ఫీచర్​ వచ్చింది. వాట్సాప్​ ఆధారిత క్యూఆర్​ కోడ్​ టికెటింగ్​ సర్వీస్​ అందుబాటులోకి రావడంతో మెట్రో స్టేషన్స్​లో టోకెన్స్​ తీసుకునే పని తప్పుతుంది. అయితే.. ఈ సేవలు ప్రస్తుతం చెన్నై మెట్రోకే అందుబాటులోకి వచ్చాయి. కోయంబెడు, ఎయిర్​పోర్ట్​ మెట్రో స్టేషన్స్​లో వీటిని తొలుత ప్రవేశపెట్టారు. అనంతరం.. చెన్నైలోని 41 మెట్రో స్టేషన్స్​లో వాట్సాప్​ ఆధారిత క్యూఆర్​ కోడ్​ టికెటింగ్​ సిస్టెమ్​ యాక్టివేట్​ అయ్యింది. ప్రయాణికుల నుంచి దీనికి మంచి రెస్పాన్స్​ లభిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

వాట్సాప్​లో మెట్రో సేవలు..

వాట్సాప్​లో మెట్రో టికెట్ల్​ కోసం.. ముందు కౌంటర్​కి వెళ్లాలి. మీ ఫోన్​ నెంబర్​ ఇవ్వాలి. మీ గమ్యస్థానాన్ని చెప్పాలి. ఎన్ని టికెట్స్​ కావాలో చెప్పాలి. కంప్యూటర్​కి కనెక్ట్​ అయిన కీప్యాడ్​లో ఫోన్​ నెంబర్​ టైప్​ చేయాలి. ఓ క్యూఆర్​ కోడ్​.. మీ వాట్సాప్​ నెంబర్​కి వస్తుంది. అక్కడే.. పేమెంట్​ ఆప్షన్​ ఉంటుంది. క్యాష్​, కార్డ్​, యూపీఐ ద్వారా పేమెంట్​ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా సెక్యూర్​ కూడా! పైగా.. మొబైల్​ నెంబర్స్​ని సర్వర్​లో సేవ్​ చేసుకోమని చెన్నై మెట్రో చెబుతోంది. ఫలితంగా.. ప్యాసింజర్ల డేటా ప్రైవసీ

Chennai Metro tickets in WhatsApp : "తరచూ కాకుండా అప్పుడప్పుడు మెట్రోలో ప్రయాణించే వారికి ఈ వాట్సాప్​లో మెట్రో టికెట్​ సేవలు ఉపయోగపడతాయి," అని సీఎంఆర్​ఎల్​ ఎండీ ఎం.ఏ సిదిఖి అభిప్రాయపడ్డారు.

పేపర్​ వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హితంగా మెట్రోను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది చెన్నై మెట్రో. ఈ వాట్సాప్​ టికెటింగ్​ సర్వీస్​తో మరో ముందడుగు వేసినట్టు పేర్కొంది. వాట్సాప్​లో మెట్రో టికెట్​ సేవలతో.. ప్రతి నెల 4 టన్నుల పేపర్​ వాడకం తగ్గుతుందని చెప్పింది. ఖర్చులు కూడా దిగొస్తాయని స్పష్టం చేసింది.

వాస్తవానికి.. పేపర్​ క్యూఆర్​ టికెట్స్​ని చెన్నై మెట్రో దాదాపు రద్దు చేసింది. టోకెన్స్​ని కూడా అత్యవసరమైతే తప్ప ఇవ్వట్లేదు.

తదుపరి వ్యాసం