తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo Y73t 5g । రూ. 15 వేల బడ్జెట్ ధరలోనే వివో నుంచి 5g కనెక్టివిటీ ఫోన్!

Vivo Y73t 5G । రూ. 15 వేల బడ్జెట్ ధరలోనే వివో నుంచి 5G కనెక్టివిటీ ఫోన్!

HT Telugu Desk HT Telugu

02 October 2022, 12:20 IST

    • ఇండియాలో ఇప్పుడు 5G కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. ఇకపై 5G గాడ్జెట్ల గిరాకీ పెరగనుంది. తాజాగా వివో కంపెనీ బడ్జెట్ ధరలో Vivo Y73t 5G స్మార్ట్‌ఫోన్‌ ను ఆవిష్కరించింది. మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
Vivo Y73t 5G
Vivo Y73t 5G

Vivo Y73t 5G

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తమ Y-సిరీస్‌లో మరొక స్మార్ట్‌ఫోన్‌ను చేర్చింది. తాజాగా Vivo Y73t పేరుతో 5G ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ Vivo Y73t 5G అనేది మిడ్-రేంజ్ ఫీచర్లతో వచ్చిన ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఇది వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. బేస్ మోడల్‌ రూ. 15 వేల ధరలో లభిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగిన డ్యుఎల్ కెమెరా సెటప్, వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే పెద్ద బ్యాటరీ, మెరుగైన స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంది. Vivo Y73t 5G మూడు కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. టాప్-స్పెక్ వేరియంట్ గరిష్టంగా 12GB RAM అలాగే 256GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని 1TB వరకు విస్తరించుకునేందుకు వీలుంది.

Vivo Y73t 5G ఫాగ్ బ్లూ, ఆటమ్న్, బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. ఈ ఫోన్ బరువు 201 గ్రాములు, మందం 9.17 మిమీ. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంది.

ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Vivo Y73t 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే

8GB/12 RAM, 128GB/ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్

వెనకవైపు 50MP+2MP డ్యుఎల్ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

6000 mAh బ్యాటరీ సామర్థ్యం, 44W ఛార్జర్

కనెక్టివిటీ ఫీచర్లు 5G, Wi-Fi , బ్లూటూత్, GPS/ GLONASS, USB టైప్-C, 3.5mm ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ మొదలైనవి ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. అక్కడ Vivo Y73t 5G స్మార్ట్‌ఫోన్‌ ధరలను పరిశీలిస్తే.. బేస్ మోడల్ 8GB + 128 GB ధర, CNY 1,399 (సుమారు రూ. 15,900). 8GB + 256GB వేరియంట్ ధర, CNY 1599 (సుమారు రూ. 18,000), టాప్-స్పెక్ మోడల్ 12GB RAM + 256GB ధర, ధర CNY 1799 (సుమారు రూ. 20,400). త్వరలోనే ఈ ఫోన్ మిగతా మార్కెట్లలోనూ అందుబాటులోకి రానుంది.మరో విషయం ఏమిటంటే ఈ హ్యాండ్ సెట్ ఇటీవల విడుదల చేసిన iQOO Z6xని పోలి ఉంది.

తదుపరి వ్యాసం