iQOO Z6 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. పెర్ఫార్మెన్స్‌లో సూపర్ ఫాస్ట్!-iqoo z6 and iqoo z6 pro smartphones launched in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   Iqoo Z6 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. పెర్ఫార్మెన్స్‌లో సూపర్ ఫాస్ట్!

iQOO Z6 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. పెర్ఫార్మెన్స్‌లో సూపర్ ఫాస్ట్!

HT Telugu Desk HT Telugu
Apr 27, 2022 09:25 PM IST

స్మార్ట్‌ఫోన్ తయారీదారు iQOO తమ బ్రాండ్ నుంచి iQOO Z6 అలాగే iQOO Z6 Pro అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఒకటి 4G ఫోన్ కాగా, మరొకటి 5G.

iQOO Z Series Phones
iQOO Z Series Phones

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు iQOO తమ బ్రాండ్ నుంచి Z సిరీస్‌లో మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో iQOO Z6 ప్రో అనేది 5G స్మార్ట్‌ఫోన్‌ కాగా, మరొకటి iQOO Z6 4G ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లు, 90Hz రిఫ్రెష్ రేట్ కామన్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారంగా ఈ రెండు ఫోన్‌లలో RAM మరింత విస్తరించుకోవచ్చు.

iQOO Z6 Pro 5G స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.44-అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్

ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్‌

6GB/8GB/12GB RAM, 128/256 GB ఇంటర్నల్ స్టోరేజ్

Funtouch OS 12 ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్

వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్ లెన్స్‌, 2MP సెన్సార్, ముందువైపు 16 MP సెల్ఫీ షూటర్

4700mAh బ్యాటరీ, 66W ఛార్జర్‌తో పాటు

వీటితో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, దిగువన హెడ్‌ఫోన్ జాక్ తదితర ఫీచర్లు కలిగి ఉంది.

6GB RAM +128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999/-

8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999/-

12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999/-

iQOO Z6 4G స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.44-అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్

ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌

4GB/6GB/8GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్

Funtouch OS 12 ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్

వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, 5 MP అల్ట్రా-వైడ్ లెన్స్‌, 2MP సెన్సార్, ముందువైపు 16 MP సెల్ఫీ షూటర్

5000mAh బ్యాటరీ, 44W ఛార్జర్‌తో పాటు

వీటితో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, దిగువన హెడ్‌ఫోన్ జాక్ తదితర ఫీచర్లు కలిగి ఉంది.

4GB RAM +128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,499/-

6GB RAM +128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999/-

8GB RAM +128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999/-

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్