తెలుగు న్యూస్  /  Business  /  Vivo V27 Pro 5g Sale Begins Check Offers Price Specifications Details In Telugu

Vivo V27 Pro Sale: వివో వీ27 ప్రో 5జీ సేల్‍కు వచ్చేసింది: ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల వివరాలివే

06 March 2023, 16:23 IST

    • Vivo V27 Pro Sale: వివో వీ27 ప్రో మొబైల్ సేల్ మొదలైంది. తొలి సేల్ సందర్భంగా బ్యాంక్ కార్డు ఆఫర్లు ఉన్నాయి. కర్వ్డ్ డిస్‍ప్లే, కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్‍తో ఈ ఫోన్ వస్తోంది.
Vivo V27 Pro Sale: వివో వీ27 ప్రో 5జీ సేల్‍కు వచ్చేసింది (Photo: Vivo)
Vivo V27 Pro Sale: వివో వీ27 ప్రో 5జీ సేల్‍కు వచ్చేసింది (Photo: Vivo)

Vivo V27 Pro Sale: వివో వీ27 ప్రో 5జీ సేల్‍కు వచ్చేసింది (Photo: Vivo)

Vivo V27 Pro Sale: వివో వీ27 ప్రో మొబైల్ తొలిసారి ఓపెన్ సేల్‍కు వచ్చింది. వివో వీ27 సిరీస్ (Vivo V27 Series) ఇటీవలే భారత్‍లో విడుదల కాగా.. నేడు వివో వీ27 ప్రో (Vivo V27 Pro) సేల్ మొదలైంది. 3డీ కర్వ్డ్ ఎడ్జ్ డిస్‍ప్లే, కలర్ ఛేంజింగ్ బ్యాక్ ప్యానెల్ ఈ ఫోన్‍కు ఆకర్షణగా ఉన్నాయి. మీడియాటెక్ డైమన్సిటీ 8200 ప్రాసెసర్, Sony IMX766V ప్రైమరీ కెమెరాతో వివో వీ27 ప్రో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫస్ట్ సేల్ సందర్భంగా కొన్ని బ్యాంక్ కార్డు ఆఫర్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటే అదనంగా రూ.3,000 వరకు తగ్గింపు పొందవచ్చు. వివో వీ27 ప్రో ధర, ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేయండి.

ట్రెండింగ్ వార్తలు

Gold rate today: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరల వివరాలు..

Stock market: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ 10 తప్పులు అస్సలు చేయకండి..

Day trading stocks: డే ట్రేడింగ్ కోసం ఆదానీ పవర్ సహా ఈ 3 స్టాక్స్ ను పరిశీలించండి

Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

వివో వీ27 ప్రో ధర, ఆఫర్లు, సేల్

Vivo V27 Pro Price, Sale: వివో వీ27 ప్రో మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ బేస్ వేరియంట్ ధర రూ.37,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.39,999, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.42,999గా ఉంది. మ్యాజిక్ బ్లూ, నోబుల్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తోంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, వివో వెబ్‍సైట్‍తో పాటు ఆఫ్‍లైన్ స్టోర్లలోనూ వివో వీ27 ప్రో సేల్‍కు వచ్చింది.

Vivo V27 Pro Offers: వివో వీ27 ప్రో మొబైల్‍ను ప్రస్తుతం హెచ్‍డీఎఫ్‍సీ, ఐసీఐసీఐ, కొటాక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.3,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్‍ను రూ.34,999కే దక్కించుకోవచ్చు.

వివో వీ27 ప్రో స్పెసిఫికేషన్లు

Vivo V27 Pro Specifications: 6.78 ఇంచుల ఫుల్ హెచ్‍డీ ప్లస్ కర్వ్డ్ ఎడ్జ్ అమోలెడ్ డిస్‍ప్లేను వివో వీ27 ప్రో 5జీ కలిగి ఉంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 8200 5జీ ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‍టచ్ ఓఎస్ 13తో వస్తోంది.

Vivo V27 Pro 5G: వివో వీ27 ప్రో ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‍(OIS)తో 50 మెగాపిక్సెల్ Sony IMX766V ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ ఫ్రంట్ కెమెరాను ఈ మొబైల్‍కు వివో ఇచ్చింది.

వివో వీ27 ప్రో మొబైల్‍లో 4,600mAh బ్యాటరీ ఉంది. 66 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ ఎల్‍ఈటీ, బ్లూటూత్, వైఫై, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. ఈ మొబైల్ మొత్తంగా 182 గ్రాముల బరువు ఉంటుంది. కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్‍ను కలిగి ఉంది.

మరోవైపు వివో వీ27 సేల్ ఈ నెల 23న మొదలవుతుంది.