తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Buy Or Sell: వైశాలి పరేఖ్ నేటి స్టాక్ సిఫారసులు ఇవే..

Buy or sell: వైశాలి పరేఖ్ నేటి స్టాక్ సిఫారసులు ఇవే..

HT Telugu Desk HT Telugu

07 November 2022, 6:58 IST

    • Intraday stocks for today: సోమవారం స్టాక్ మార్కెట్లలో ఇంట్రా డే కొనుగోళ్లకు వైశాలి పరేఖ్ సూచించిన స్టాక్స్ ఇవే
వైశాలి పరేఖ్ నేటి స్టాక్ సిఫారసుల్లో టాటా మోటార్స్, టాటా స్టీల్
వైశాలి పరేఖ్ నేటి స్టాక్ సిఫారసుల్లో టాటా మోటార్స్, టాటా స్టీల్ (AFP)

వైశాలి పరేఖ్ నేటి స్టాక్ సిఫారసుల్లో టాటా మోటార్స్, టాటా స్టీల్

Buy or sell stocks for today: అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ చైనా నుంచి సానుకూల వార్తలు రావడంతో శుక్రవారం స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 64 పాయింట్లు బలపడి 18,117 పాయింట్లు, సెన్సెక్స్ 113 పాయింట్లు బలపడి 60,950 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 39 పాయింట్లు పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Bajaj Pulsar NS400Z: 2024 పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను లాంచ్ చేసిన బజాజ్; ధర కూడా తక్కువే..

‘‘ఆపిల్ వాచ్ 7 నా ప్రాణాలను కాపాడింది’’: ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు థాంక్స్ చెప్పిన ఢిల్లీ యువతి

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Cibil score : జీవితంలో ఎప్పుడూ లోన్​ తీసుకోకపోయినా.. సిబిల్​ స్కోర్​పై ఎఫెక్ట్​ పడుతుందా?

Intraday trading strategies for stock market today: నేటి ట్రేడింగ్ వ్యూహం

నేడు ఇంట్రా డే ట్రేడింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చిస్తూ ప్రభుదాస్ లీలాధర్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలీ పరేఖ్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతాయని, సోమవారం లాభాల పరంపర కొనసాగుతుందని విశ్లేషించారు. ఇంట్రాడేలో కొనుగోలు చేసేందుకు వైశాలి పరేఖ్ రెండు స్టాక్స్‌ను రెకమెండ్ చేశారు. టాాటా మోటార్స్, టాటా స్టీల్ వీటిలో ఉన్నాయి.

సోమవారం నాటి సెషన్‌లో డే ట్రేడింగ్ వ్యూహంపై వైశాలి పరేఖ్ మాట్లాడుతూ ‘నిఫ్టీ 18 వేల జోన్‌లో ఉంది. శుక్రవారం చివరి గంటల్లో మూమెంటమ్ పెరిగి 18,100 స్థాయికి చేరుకుంది. సెంటిమెంట్ పెరిగి రానున్న రోజుల్లో నిఫ్టీ మరింతగా బలపడతుందని అంచనా వేస్తున్నాం..’ అని పేర్కొన్నారు.

బ్యాంక్ నిఫ్టీ చాలా సానుకూలంగా ఉందని, నిఫ్టీ ఇండెక్స్ కంటే మెరుగ్గా కదులుతుందని ప్రభుదాస్ లీలాధర్ రీసెర్చ్ సంస్థ అంచనా వేస్తోంది. 40,800 పాయింట్ల స్థాయి వద్ద మద్దతు ఉంటుందని విశ్లేషించింది. నిఫ్టీ ఇండెక్స్‌కు 18 వేల పాయింట్ల వద్ద మద్దతు, 18,250 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఉంటుందని అంచనా వేశారు. బ్యాంక్ నిఫ్టీ 40,800 నుంచి 41,800 మధ్య కదలాడుతుందని చెప్పారు.

Vaishali Parekh's stock recommendations: వైశాలి పరేఖ్ స్టాక్ సిఫారసులు

ఇంట్రా డే స్టాక్స్ గురించి అడిగినప్పుడు ప్రభుదాస్ లీలాధర్ రీసెర్చ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ టాటా మోటార్స్, టాటా స్టీల్ రెకెమెండ్ చేశారు.

1] టాటా మోటార్స్ (Tata Motors): కొనుగోలు రూ. 425, లక్ష్యం రూ. 444, స్టాప్ లాస్ రూ. 418;

2] టాటా స్టీల్ (Tata Steel): కొనుగోలు రూ. 104, లక్ష్యం రూ. 109, స్టాప్ లాస్ 102.

Disclaimer: ఇక్కడ చర్చించిన అభిప్రాయాలు, సిఫారసులు వ్యక్తిగత లేదా బ్రోకింగ్ కంపెనీలవి. హెచ్‌టీవి కావు.