Upcoming smartphones in June : జూన్‌లో లాంచ్ అవుతున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
30 May 2023, 6:20 IST
- Upcoming smartphones in June : జూన్‌లో పలు ఆసక్తికర స్మార్ట్‌ఫోన్స్ లాంచ్కానున్నాయి. ఆ వివరాలు..
జూన్‌లో లాంచ్ అవుతున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
smartphones launch in June : మే నెలలో.. ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి పలు ఆకర్షణీయమైన మోడల్స్ అడుగుపెట్టాయి. ఇక జూన్‌లోనూ ఇది కొనసాగనుంది! స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న పలు ఆసక్తికర స్మార్ట్‌ఫోన్స్.. జూన్‌లో లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాలు..
రియల్మీ 11 ప్రో సిరీస్..
రియల్మ 11 ప్రో సిరీస్ జూన్‌లో 8న ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో రియల్మీ 11 ప్రో, 11 ప్రో ప్లస్ మోడల్స్ ఉండనున్నాయి.
ఈ రెండు గ్యాడ్జెట్స్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. వీటిల్లో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 13 వంటి ఫీచర్స్ ఉన్నాయి.
11 ప్రోలో 100ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకండరీ కెమెరా లెన్స్‌లు ఉండనున్నాయి. సెల్ఫీ కోసం 16ఎంపీ కెమెరా వస్తోంది. ఇక 11 ప్రో ప్లస్‌లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ మాక్రో లెన్స్‌లు వస్తున్నాయి. సెల్ఫీ కోసం 32ఎంపీ కెమెరా లభిస్తోంది.
ఐకూ నియో 7 ప్రో..
నియో 7 ప్రో మోడల్‌ను ఐకూ సంస్థ జూన్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే.. ఈ స్మార్ట్‌ఫోన్‌కు నియో 8 లేదా నియో 7 రేసింగ్ ఎడిషన్ అన్న పేరు పెట్టొచ్చు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1, 8జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 13, 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి ఫీచర్స్‌గా ఉండొచ్చు. ధర రూ. 30వేలు- రూ. 35వేల మధ్యలో ఉండొచ్చు.
ఇదీ చూడండి:- Tecno Camon 20 series : టెక్నో కామెన్ 20 సిరీస్ లాంచ్.. హైలైట్స్ ఇవే..!
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్54..
ఇండియాలో శామ్సంగ్ గెలాక్సీ సిరీస్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో గెలాక్సీ ఎఫ్54ను లాంచ్ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. జూన్‌లో ఇది లాంచ్ అవ్వొచ్చు. ఇందులో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7ఇంచ్ ఫుల్హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, ఎక్సినోస్ 1380 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 128జీబీ- 256జీబీ స్టోరేజ్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్వేర్ వంటివి ఉంటాయి. ధర రూ. 27వేల వరకు ఉండొచ్చు.
ఒప్పో రెనో 10 సిరీస్..
Upcoming smartphones in June : ఒప్పో రెనో 10 సిరీస్.. చైనాలో లాంచ్ అయ్యింది. ఇక జూన్ చివరి నాటికి ఇండియాలోకి అడుగుపెట్టనుంది! ఇందులో రెనో 10, 10 ప్రో, 10 ప్రో ప్లస్ వంటి స్మార్ట్‌ఫోన్స్ ఉండనున్నాయి. వీటిల్లో స్నాప్‌డ్రాగన్ 778జీ, స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్స్ ఉంటాయని తెలుస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ 3..
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్.. జూన్‌లో లాంచ్కానుంది. లాంచ్డేట్పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ జూన్‌లోనే దీని లాంచ్ ఉంటుందని తెలుస్తోంది. చైనాలోని ఏస్ 2వీని రిబ్రాండ్ చేసి ఇండియాలో నార్డ్ 3గా లాంచ్ చేస్తారని సమాచారం. దీని ధర రూ. 35వేల వరకు ఉండొచ్చు. ఇందులో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.74 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 64ఎంపీ ప్రైమరీ కెమెరా, డైమెన్సిటీ 9000 ఎస్ఓసీ, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉండొచ్చు.