Samsung Galaxy S21 FE: అత్యంత తక్కువ ధరకు సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్-big discount rolled out on samsung galaxy s21 fe on amazon check price now
Telugu News  /  Business  /  Big Discount Rolled Out On Samsung Galaxy S21 Fe On Amazon; Check Price Now
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Tech)

Samsung Galaxy S21 FE: అత్యంత తక్కువ ధరకు సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్

25 May 2023, 16:38 ISTHT Telugu Desk
25 May 2023, 16:38 IST

Samsung Galaxy S21 FE: సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ లో వచ్చిన ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ ఒకటి. ఇప్పుడు ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఆమెజాన్ లో అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది.

Amazon Blockbuster Value Days: ఆమెజాన్ (Amazon) లో ప్రస్తుతం బ్లాక్ బస్టర్ వ్యాల్యూ డేస్ సేల్ నడుస్తోంది. మే 26వ తేదీతో ఈ సేల్ ముగుస్తుంది. ఈ సేల్ లో వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఆకర్షణీయమైన డిస్కౌంట్లలో లభిస్తున్నాయి. సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE) కూడా ఈ సేల్ లో అత్యంత చవకగా లభిస్తోంది.

Samsung Galaxy S21 FE: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ

లాంచ్ అయిన నాటి నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ కు మంచి రివ్యూస్ వచ్చాయి. సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ మోడల్స్ లో సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ కూడా ఒకటి. ఇప్పుడు ఈ ఫోన్ ఆమెజాన్ బ్లాక్ బస్టర్ వ్యాల్యూ డేస్ సేల్ లో 56% డిస్కౌంట్ తో లభిస్తోంది. సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు ఆమెజాన్ బ్లాక్ బస్టర్ వ్యాల్యూ డేస్ సేల్ లో 56% డిస్కౌంట్ తో లభిస్తోంది.

Bank offers and exchange bonus: బ్యాంక్ కార్డ్స్ తో మరింత డిస్కౌంట్

లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ. 74999 కాగా, ఇప్పుడు ఈ ఫోన్ రూ. 32800 లకు లభిస్తుంది. అంతేకాకుండా, ఎక్స్ చేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే 10% లేదా గరిష్టంగా రూ. 1500 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, వర్కింగ్ కండిషన్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 22950 వరకు ఎక్స్ చేంజ్ బోనస్ పొందవచ్చు. అంటే, ఒకవేళ మీ పాత స్మార్ట్ ఫోన్ కు పూర్తి మొత్తమైన రూ. 22950 ఎక్స్ చేంజ్ గా లభిస్తే, సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ పొందడానికి మీరు కేవలం రూ. 8350 చెల్లిస్తే సరిపోతుంది.