Samsung Galaxy S21 FE 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 54,500 తగ్గింపు!
Samsung Galaxy S21 FE 5G price cut : శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి..
Samsung Galaxy S21 FE 5G : 'ప్రీమియం సెగ్మెంట్లోని స్మార్ట్ఫోన్లు.. చౌక ధరలో లభిస్తే ఎంత బాగుండు..' అని మీరు అనుకుంటున్నారా? మీ కల నెరవేరింది! శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్.. ధర భారీగా తగ్గింది. రూ. 75,500గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఒరిజినల్ ప్రైజ్.. వివిధ డిస్కౌంట్ల తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 20,499కే లభిస్తుండటం విశేషం. ఆ వివరాలు..
ట్రెండింగ్ వార్తలు
రూ. 54,500 తగ్గింపు..!
ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ప్రకారం.. శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ (స్టోరేజ్ వేరియంట్) ధర రూ. 74,999. ఇక్కడ రూ. 35,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఫలితంగా.. ధర రూ. 39,999కి దిగొచ్చింది. ఇక సిటి బ్యాంక్, కొటాక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యంక్‌ల క్రెడిట్/ డెబిట్ కార్డులు వాడితే.. రూ. 2000 ఆఫ్ లభిస్తోంది. అందువల్ల ధర రూ. 37,999కి దిగొచ్చింది.
అంతేకాకుండా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద.. ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీపై రూ. 17,500 ఆఫ్ లభిస్తోంది. మొత్తం మీద ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 20,499కి చేరింది. అంటే.. ఒరిజినల్ ప్రైజ్ కన్నా రూ. 54,500 తగ్గినట్టే!
శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫీచర్స్..
Samsung Galaxy S21 FE 5G features : శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీలో 6.4 ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. సెల్ఫీ కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా, రేర్‌లో ట్రిపుల్ కెమెరా(12ఎంపీ, 12ఎంపీ, 8ఎంపీ) సెటప్ ఉంది. ఈ ఫోన్లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్ ఉంది.
సంబంధిత కథనం