Tecno Camon 20 series : టెక్నో కామెన్ 20 సిరీస్ లాంచ్.. హైలైట్స్ ఇవే..!
Tecno Camon 20 series launch : టెక్నో కామెన్ 20 సిరీస్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ హైలైట్స్ చూద్దాము..!
Tecno Camon 20 series launch : స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో.. కామెన్ 20 సిరీస్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో కామెన్ 20, 20 ప్రో 5జీ, 20 ప్రీమియర్ 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. వీటి ఫీచర్స్, ధరతో పాటు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
టెక్నో కామెన్ 20 సిరీస్ లాంచ్..
ఇండియాలో మార్కెట్ షేరు పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది టెక్నో. ఇందులో భాగంగానే.. ప్రీమియం సెగ్మెంట్‌తో పాటు ఇతర విభాగాల్లో ఆకర్షణీయమైన గ్యాడ్జెట్స్‌ను లాంచ్ చేస్తోంది. ఇక ఇప్పుడు కామెన్ 20 సిరీస్‌తో మిడ్ 4జీ, మిడ్ 5జీ సెగ్మెంట్స్‌ను టార్గెట్ చేసింది.
కామెన్ 20 సిరీస్‌లోని మూడు స్మార్ట్‌ఫోన్స్‌లో టాప్ సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్లు ఉంటాయి. వీటిలో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ప్రో మోడల్లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ ఉంటుంటే.. ఇతర డివైజ్‌లకు అది 60హెచ్జెడ్గా ఉంది.
టెక్నో కామెన్ 20 సిరీస్- ఫీచర్స్..
Tecno Camon 20 pro pic : కామెన్ 20లో 64ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్‌తో పాటు మరో కెమెరా లెన్స్ ఉంది. ఇక 20 ప్రో 5జీలో 64ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకండరీతో పాటు బొకేహ్ కెమెరా లెన్స్‌లు వస్తున్నాయి. 20 ప్రీమియం 5జీ వేరియంట్లో 50ఎంపీ ప్రైమరీ, 108ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ బొకేహ్ సెన్సార్లు వస్తున్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ మూడు గ్యాడ్జెట్స్లోనూ 32ఎంపీ కెమెరా లభిస్తుండటం విశేషం.
కామెన్ 20లో హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్ దీని సొంతం. ఇక 20 ప్రో, 20 ప్రీమియర్‌లో డైమెన్సిటీ 8050 ఎస్ఓసీ చిప్సెట్ ఉంటుంది. టెక్నో కామెన్ 20 ప్రోలో 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరజ్/ 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వస్తుండగా.. 20 ప్రీమియర్‌లో 8జీబీ ర్యామ్- 512 జీబీ స్టోరేజ్ లభిస్తోంది.
ఈ మూడు డివైజ్‌లలోనూ 5000ఎంఏహెచ్ బ్యాటరీ వస్తోంది. టెక్నో కామెన్ 20, 20 ప్రోకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుండగా.. 20 ప్రీమియర్‌కు అది 44వాట్గా ఉంది.
టెక్నో కామెన్ 20 సిరీస్- ధర..
Tecno Camon 20 premier 5G price : టెక్నో కామెన్ 20 ధర రూ. 14,999గా ఉంది. నేటి నుంచి ఇది అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక 20 ప్రో 5జీ ధరలు రూ. 19,999- రూ. 21,999గా ఉన్నాయి. ఇవి జూన్ రెండో వారంలో అందుబాటులోకి వస్తాయి. 20 ప్రీమియర్ 5జీ ధరతో పాటు ఇతర వివరాలు జూన్ 3 వారంలో సంస్థ ప్రకటించనుంది.
సంబంధిత కథనం