Oppo Reno 9 series launch : ఒప్పో రెనో 9 సిరీస్​ లాంచ్​- ధర ఎంతంటే.!-oppo reno 9 reno 9 pro launched check price and specifications details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo Reno 9 Series Launch : ఒప్పో రెనో 9 సిరీస్​ లాంచ్​- ధర ఎంతంటే.!

Oppo Reno 9 series launch : ఒప్పో రెనో 9 సిరీస్​ లాంచ్​- ధర ఎంతంటే.!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 25, 2022 10:50 AM IST

Oppo Reno 9 series launch : ఒప్పో నుంచి మరో స్మార్ట్​ఫోన్​ సిరీస్​ లాంచ్​ అయ్యింది. రెనో 9, రెనో 9 ప్రో, రెనో 9 ప్రో ప్లస్​లను చైనాలో సంస్థ లాంచ్​ చేసింది. ఆ వివరాలు..

ఒప్పో రెనో 8
ఒప్పో రెనో 8

Oppo Reno 9 series launch : ఒప్పో రెనో 9 సిరీస్​.. చైనాలో లాంచ్​ అయ్యింది. ఒప్పో రెనో 8 సక్సెసర్​గా ఈ రెనో 9 సిరీస్​ నిలువనుంది. ఈ సిరీస్​లో.. రెనో 9, రెనో 9 ప్రో, రెనో 9 ప్రో ప్లస్​ పేర్లతో మూడు కొత్త స్మార్ట్​ఫోన్స్​ ఉన్నాయి.

రెనో 8తో పోల్చుకుంటే.. ఒప్పో రెనో 9 సిరీస్​ డిజైన్​ కొత్తగా ఉంది. అయితే.. రెనో 9 సిరీస్​లోని మూడు ఫోన్లు ఒకే విధంగా కనిపిస్తున్నాయి. కానీ స్పెసిఫికేషన్లలో మాత్రం స్వల్పంగా మార్పులు ఉన్నాయి.

ఒప్పో రెనో 9, రెనో 9 ప్రో స్పెసిఫికేషన్లు..

ఒప్పో రెనో 9, రెనో 9 ప్రోలకు ప్లాస్టిక్​ ఫ్రేమ్​ వచ్చింది. ఇవి 7.19ఎంఎం థిక్​నెస్​, 174గ్రాముల బరువుతో ఉన్నాయి. ఈ రెండింటికీ 6.7ఇంచ్​ సెంటర్​ పంచ్​ హోల్​ కర్వడ్​ అమోలెడ్​ డిస్​ప్లే(2412X1080 పిక్సెల్​, 349పీపీఐ, 120హెచ్​జెడ్​ రిఫ్రేష్​ రేట్​) ఉంది.

oppo reno 9 feature : రెనో 9లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 778జీ ఎస్​ఓఎస్​ ఉండగా.. రెనో 9 ప్రో మోడల్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 8100 మ్యాక్స్​ చిప్​సెట్​ ఉంది. రెనో 9 ప్రోలో మారిసిలికాన్​ ఎక్స్​ ఎన్​పీయూ ఇమేజ్​ ప్రాసెసింగ్​ సెటప్​ కూడా ఉంది. ఈ రెండూ కూడా.. ఎల్​పీడీడీఆర్​5 ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 3.1 స్టోరేజీ కలిగి ఉన్నాయి. రెండింట్లోనూ.. ఆండ్రాయిడ్​ ఆధారిత కలర్​ఓఎస్​ 13 ఉంది.

ఒప్పో రెనో 9, రెనో 9 ప్రోలో 32ఎంపీ ఆర్​జీబీడబ్ల్యూ ఆటోఫోకస్​ సెల్ఫీ కెమెరా ఉంది. కానీ రేర్​ కెమెరా సెటప్​ మాత్రం వేరు వేరుగా ఉంది. రెనో 9లో 64ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. కానీ ఒప్పో రెనో 9 ప్రోలో.. 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్​890 ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​ సెకండరీ కెమెరా సెన్సార్​లు ఉన్నాయి.

Oppo Reno 9 pro feature : రెనో 9, రెనో 9 ప్రోలో డ్యూయెల్​ సిమ్​, 5జీ, వైఫై 6, బ్లూటూత్​ 5.3, జీఎన్​ఎస్​ఎస్​, ఎన్​ఎఫ్​ఎస్​, యూఎస్​బీ టైప్​-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇన్​ డిస్​ప్లే ఫింగర్​ ప్రింట్​ సెన్సార్​, గ్రఫైట్​ కూలింగ్​ సిస్టెమ్​, ఇన్ఫ్రారెడ్​ సెన్సార్​లు కూడా ఉన్నాయి.

ఇక ఈ రెండు మోడల్స్​లోనూ 4,500ఎంఏహెచ్​ బ్యాటరీ సెటప్​ ఉంది. 67డబ్ల్యూ ఫాస్ట్​ వయర్డ్​ ఛార్జింగ్​ వెసులుబాటు ఉంది.

ఒప్పో రెనో 9 ప్రో ప్లస్​ స్పెసిఫికేషన్స్​..

ఇందులో 6.7ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంది. స్క్రీన్​కి కర్వీ ఎడ్జ్​ కూడా ఉంది. సెంటర్​లో పంచ్​ హోల్​ ఉంటుంది.

ఇక రెనో 9 ప్రో ప్లస్​లో 32ఎంపీ సెల్ఫీ కెమెరా, రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో మారిసిలికాన్​ చిప్​ ఉంటుంది. స్నాప్​డ్రాగన్​ 8 ప్లస్​ జెన్​ 1 చిప్​సెట్​ దీని సొంతం. దీనికి 4,700ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. 80డబ్ల్యూ వయర్డ్​ ఛార్జింగ్​, 50డబ్ల్యూ వయర్​లెస్​ ఛార్జింగ్​ వెసులుబాటు ఉంది.

ధరలు..

ఒప్పో రెనో 9..

  • Oppo Reno 9 price : 8జీబీ+ 265జీబీ - 2,499 యెన్​ (సుమారు రూ. 29వేలు)
  • 12జీబీ+ 256జీబీ- 2,699 యెన్​ (సుమారు రూ. 31 వేలు)
  • 12జీబీ+ 512జీబీ- 2,999 యెన్​ (సుమారు రూ. 34,500)

ఒప్పో రెనో 9 ప్రో..

  • 16జీబీ+ 256జీబీ- 3,499 యెన్​ (సుమారు రూ. 40వేలు)
  • 16జీబీ+ 512జీబీ- 3,799 యెన్​ (సుమారు రూ. 453,500)

ఒప్పో రెనో 9 ప్రో ప్లస్​..

  • Oppo Reno 9 pro plus price : 16జీబీ+ 256జీబీ- 3,999 యెన్​ (సుమారు రూ. 46వేలు)
  • 16జీబీ+ 512జీబీ- 4,399 యెన్​ (సుమారు రూ. 50వేలు)

ఒప్పో రెనో 9, రెనో 9 ప్రో ఫోన్​లు మూన్​ బ్లాక్​, టుమారో గోల్డ్​ వంటి రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే.. రెనో 9లో పూర్తి రెడ్​ కలర్​ ఆప్షన్​ కూడా ఉంది. కాగా.. రెనో 9 ప్రో ప్లస్​ డివైజ్​ మాత్రం.. గోల్డ్​, గ్రీన్​, బ్లాక్​ రంగుల్లో అందుబాటులో ఉండనుంది.

Oppo Reno 9 full details : ఈ ఒప్పో రెనో 9 సిరీస్​.. చైనాలో డిసెంబర్​ 2న సేల్​కు వెళ్లనుంది. ఇండియాలో లాంచ్​ ఎప్పుడుంటుంది అనేది ఇంకా తెలియరాలేదు. కానీ.. గత స్మార్ట్​ఫోన్స్​ని పరిశీలిస్తే.. చైనాలో లాంచ్​ అయిన కొన్ని వారలకే అవి అంతర్జాతీయ మార్కెట్​లోకి అడుగుపెట్టాయి.

Whats_app_banner

సంబంధిత కథనం