తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Upcoming Cars : మారుతీ సుజుకీ తొలి ఈవీపై కీలక అప్డేట్​..!

Maruti Suzuki upcoming cars : మారుతీ సుజుకీ తొలి ఈవీపై కీలక అప్డేట్​..!

Sharath Chitturi HT Telugu

08 December 2023, 12:57 IST

google News
    • Maruti Suzuki upcoming cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ ప్రొడక్షన్​పై కీలక అప్డేట్​ ఇచ్చింది సంస్థ. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మారుతీ సుజుకీ తొలి ఈవీపై కీలక అప్డేట్​..
మారుతీ సుజుకీ తొలి ఈవీపై కీలక అప్డేట్​..

మారుతీ సుజుకీ తొలి ఈవీపై కీలక అప్డేట్​..

Maruti Suzuki EVX electric vehicle : 2024 కోసం మారుతీ సుజుకీ సంస్థ గట్టిగానే ప్లాన్​ చేస్తోంది. మరీ ముఖ్యంగా సంస్థ నుంచి తొలి ఎలక్ట్రిక్​ వెహికిల్​.. వచ్చే ఏడాదిలో లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈవీతో పాటు పలు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లు కూడా రాబోతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ ఈవీఎక్స్​..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​​లో ఈవీ సెగ్మెంట్​ దూసుకెళుతోంది. దాదాపు అన్ని సంస్థలు పోటీపడి మరీ వాహనలను వదులుతున్నాయి. కానీ.. దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీకి మాత్రం.. ఈ సెగ్మెంట్​లో ఇంకా ఒక్క ఎలక్ట్రిక్​ వెహికిల్​ కూడా లేదు! ఈ లోటు భర్తీ చేస్తూ.. మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ని పరిచయం చేసింది సంస్థ. ఈ ఈవీఎక్స్​ ఎస్​యూవీ ప్రొడక్షన్​ని.. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ప్రారంభించనున్నట్టు తాజాగా వెల్లడించింది.

Maruti Suzuki EVX electric SUV : ఈ ఈవీఎక్స్​ ఎస్​యూవీ.. గుజరాత్​ హన్సల్​పూర్​లోని సుజుకీ మోటార్​ గుజరాత్​ లిమిటెడ్​ ప్లాంట్​లో తయారవ్వనుంది. ఇది.. మారుతీ సుజుకీ సబ్సిడరీ. 2017 నుంచి ఈ ప్లాంట్​ పనిచేస్తోంది. కాగా.. ఈవీ ప్రొడక్షన్​ కోసం ప్లాంట్​లో భారీ మార్పులు చేసింది సంస్థ.

మారుతీ సుజుకీ ఈవీఎక్స్​లో 60కేడబ్ల్యూహెచ్​ లిథియం ఐయాన్​ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 550 కి.మీల దూరం ప్రయాణించవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ మోడల్​ డిజైన్​ చాలా ఫ్యూచరిస్టిక్​గా ఉండటంతో.. కస్టమర్ల నుంచి మంచి డిమాండ్​ కనిపిస్తుందని సంస్థ భావిస్తోంది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్​..

2024 Maruti Suzuki swift : స్విఫ్ట్​ హ్యాచ్​బ్యాక్​ సరికొత్త మోడల్​ని జపాన్​లో ఇటీవలే లాంచ్​ చేసింది సుజుకీ సంస్థ. ఇదే వర్షెన్​.. వచ్చే ఏడాది ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. కాకపోతే.. ఇండియన్​ స్టాండర్డ్స్​కి తగ్గట్టు.. ఈ మోడల్​లో కొన్ని మార్పులు కనింపించొచ్చు.

2024 మారుతీ సుజుకీలో 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. మైల్డ్​ హైబ్రీడ్​ వేరియంట్​ కూడా ఉండొచ్చు. పూర్తి వివరాలపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​..

Maruti Suzuki Dzire facelift : మారుతీ సుజుకీకి బెస్ట్​ సెల్లింగ్​ హ్యాచ్​బ్యాక్​గా ఉన్న​ డిజైర్​కి ఫేస్​లిఫ్ట్​ సిద్ధమవుతోంది. 2024లోనే ఇది లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. 9ఏళ్ల ముందు తొలిసారిగా ఈ మోడల్​ లాంచ్​ అవ్వగా.. ఇప్పటివరకు ఒక్క ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ కూడా బయటకు రాలేదు. కానీ మార్కెట్​లో ఈ డిజైర్​కు గట్టిపోటీనిస్తున్న ఇతర వాహనాలకు మంచి అప్డేట్స్​ లభించాయి. దీనిని గ్రహించిన మారుతీ సుజుతీ.. డిజైర్​ ఫేస్​లిఫ్ట్​ని కూడా ప్లాన్​ చేస్తోంది.

తదుపరి వ్యాసం