Hyundai Creta facelift : లాంచ్‌కు సిద్ధంగా హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్?
05 December 2023, 13:40 IST
- Hyundai Creta facelift : హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్.. లాంచ్‌కు సిద్ధమవుతోంది. వచ్చే నెలలోనే ఇది లాంచ్ అవుతుందని సమాచారం. వివరాల్లోకి వెళితే..
లాంచ్‌కు సిద్ధంగా హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్?
Hyundai Creta facelift launch date : హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ కొసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. హ్యుందాయ్ సంస్థ ఓ ప్రకటన చేసింది. 2024 జనవరి 16న ఓ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈవెంట్ నిర్వహణకు గల కారణాన్ని చెప్పలేదు కానీ.. ఇందులో క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని సంస్థ లాంచ్ చేస్తుందని, ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్..
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ టెస్ట్ డ్రైవ్.. ఇప్పటికే చాలాసార్లు జరిగింది. ఆ సమయంలో తీసిన ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వాటితో కొన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి.
Hyundai Creta facelift launch : సరికొత్త హ్యుందాయ్ క్రేటా డిజైన్‌లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఫ్రెంట్ గ్రిల్‌ని రీడిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా.. ఫ్రెంట్- రేర్ బంపర్స్, టెయిల్‌ల్యాంప్స్, అలాయ్ వీల్స్ కొత్తగా ఉండొచ్చు.
ఇక క్రేటా ఫేస్‌లిఫ్ట్‌లో డాష్‌బోర్డ్, ఏసీ వెంట్స్ డిజైన్ వంటివి కొత్తగా ఉండనున్నాయి. డ్యూయెల్ 10.25 ఇంచ్ స్క్రీన్స్ రాబోతున్నాయి.
కొత్త క్రేటాలో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. అడాస్‌తో పాటు 360 డిగ్రీ వ్యూ కెమెరా ఫీచర్ ఇందులో ఉండనుంది. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్- అసిస్టెన్స్, రేర్ క్రాస్ ట్రాఫిక్ కొలిషన్ వార్నింగ్- అసిస్టెన్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ వంటివి అడాస్‌లో భాగంగా ఉండనున్నాయి.
హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ ధర ఎంత ఉండొచ్చు..?
Hyundai Creta facelift 2024 : ఆల్ న్యూ హ్యుందాయ్ క్రేటా ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10.87లక్షలుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది.
ఇక లాంచ్ తర్వాత.. ఈ హ్యుందాయ్ క్రేటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, ఎంజీ ఆస్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, హోండా ఎలివేట్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, స్కోడా కుషాక్, వోక్స్వ్యాగన్ టైగన్ వంటి బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.