2024 Maruti Suzuki Swift : సరికొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడు?
2024 Maruti Suzuki Swift : టెస్ట్ రన్ దశలో ఉన్న మారుతీ సుజుకీ స్విఫ్ట్ 2024 వర్షెన్.. తాజాగా ఇండియాలో దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వెహికిల్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
2024 Maruti Suzuki Swift : ఇండియాలో మారుతీ సుజుకీ స్విఫ్ట్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇక ఇప్పుడు.. నెక్ట్స్ జెనరేషన్ స్విఫ్ట్‌ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది సంస్థ. ఇటీవలే జరిగిన జపాన్ మొబిలిటీ షోలో ఈ మోడల్ని రివీల్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఇక ఇప్పుడు.. టెస్ట్ రన్ దశలో ఉన్న 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్.. ఇండియాలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ కారు విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
సరికొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్..
2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు. ప్రస్తుతం ఉన్న డిజైన్‌నే సంస్థ కొనసాగుతోంది. కాకపోతే.. బండికి కొన్ని అప్డేట్స్ చేసింది. కొత్త గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ షేప్ డీఆర్ఎల్స్తో కూడిన హెడ్‌లైట్స్ వంటివి వస్తున్నాయి. మొత్తం మీద చూస్తుంటే.. ఈ కొత్త స్విఫ్ట్.. మినీ కూపర్‌ను పోలి ఉన్నట్టు కనిపిస్తోంది.
New Suzuki Swift : ఈ కారులో కొత్త అలాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, ట్వీక్డ్ బంపర్ వంటివి వస్తున్నాయి. ఫలితంగా.. ఈ 2024 వర్షెన్ లుక్స్ మరింత మాడెర్న్గా, స్పోర్టీగా మారాయి.
ఇక ఈ వెహికిల్ ఇంటీరియర్ విషయానికొస్తే.. ఇందులో 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వయర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వయర్లెస్ ఫోన్ ఛ్ర్జర్ వంటివి వస్తాయని సమాచారం. టెస్టింగ్ దశలో ఉన్న మోడల్లో బ్లైండ్స్పాట్ మానిటరింగ్ వంటి ఏడీఏఎస్ ఫీచర్స్ కనిపించాయి.
ఇక ఈ కొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్‌లో సరికొత్త 1.2 లీటర్ జెడ్ సిరీస్, 3 సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడల్లో 4 సిలిండర్ ఇంజిన్ ఉంది. మేన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్స్ వస్తాయి.
ఈ కారు లాంచ్ ఎప్పుడు..?
Maruti Suzuki Swift on road price Hyderabad : మారుతీ సుజుకీ స్విఫ్ట్.. వచ్చే ఏడాది ఇండియాలో లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా మార్కెట్లో ఈ మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 5.99లక్షలుగా ఉంది. కొత్తగా లాంచ్ అయ్యే కారు ధర.. దీని కన్నా ఎక్కువే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక లాంచ్ తర్వాత.. ఈ సుజుకీ స్విఫ్ట్.. హ్యుందాయ్ గ్రాండ్ నియోస్, టాటా పంచ్ వంటి వెహికిల్స్‌తో ఇప్పటికే ఉన్న పోటీని మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి.
సరికొత్త మారుతీ సుజుకీ డిజైర్‌ని చూశారా?
సుజీకీ స్విఫ్ట్‌తో పాటు నెక్ట్స్ జెనరేషన్ డిజైర్‌ని కూడా మారుతీ సుజుకీ సంస్థ సిద్ధం చేస్తోంది. ఈ రెండు వెహికిల్స్ కూడా.. కొన్ని వారాల వ్యవధిలో లాంచ్ అవుతాయని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం