Maruti Suzuki Dzire : సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్.. సూపర్ ఫీచర్స్‌తో!
Maruti Suzuki Dzire : మారుతీ సుజుకీ డిజైర్ నెక్ట్స్ జెనరేషన్ మోడల్ సిద్ధమవుతోంది. కొత్త ఫీచర్స్‌తో ఈ మోడల్ రాబోతోందట! ఆ వివరాలు..
Maruti Suzuki Dzire : నెక్ట్స్ జెనరేషన్ మారుతీ సుజుకీ డిజైర్‌ని సంస్థ సిద్ధం చేస్తోంది. ఈ మోడల్.. 2024లో ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందని సమాచారం. ఈ కారు సరికొత్తగా ఉండనుందని, అనేక కొత్త ఫీచర్స్ ఇందులో కనిపిస్తాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మారుతీ సుజుకీ డిజైర్..
పలు నివేదికల ప్రకారం.. 2024 మారుతీ సుజుకీ డిజైర్ 9 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ ఉండనుంది. వయర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బిల్ట్-ఇన్ నేవిగేషన్‌తో పాటు ఇతర కూల్ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. వెహికిల్ ఇన్ఫర్మేషన్, డాష్ బోర్డ్ కమెరా కంపాటబులిటీ వంటివి ఉండొచ్చు. ప్రీ-ఇన్స్టాల్డ్ వెథర్, న్యూస్, మ్యూజిక్ యాప్స్ వంటివి ఇందులో ఉండనున్నాయి.
2024 Maruti Suzuki Dzire : ఇక ఈ కొత్త మారుతీ సుజుకీ డిజైర్ ఇంటీరియర్ విషయానికొస్తే.. డాష్‌బోర్డ్ చాలా కొత్తగా ఉంటుందట. ఫౌక్స్ వుడ్ ఫినిషింగ్ లభిస్తుందని సమచారం. క్లైమేట్ కంట్రోల్ సిస్టెమ్ని టాగిల్ స్విఛెస్తో అప్డేట్ చేయనుంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఇందుకోసం డెడికేటెడ్ డిస్ప్లేలు ఉంటాయట. మారుతీ సుజుకీ బలేనో, బ్రెజాలో ఇవి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చూడండి:- Big discounts on Mahindra SUVs: మహింద్ర ఎస్ యూ వీలపై భారీ డిస్కౌంట్స్; 3.5 లక్షల వరకు..
ఇక నెక్ట్స్ జెనరేషన్ డిజైర్‌లో 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇది 100 హెచ్‌పీ పవర్‌ని, 150 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. సీవీటీ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ కూడా లభించొచ్చు.
Maruti Suzuki Dzire on road price Hyderabad : ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ మోడల్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాడ్ మానిటర్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, 360 డిగ్రీ వ్యూ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి.
ఈ మోడల్ ఇతర ఫీచర్స్పై ప్రస్తుతం క్లారిటీ లేదు. సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. లాంచ్ డేట్‌ని కూడా సంస్థ అప్డేట్ చేయాల్సి ఉంది.
Maruti Suzuki Dzire price Hyderabad : అయితే.. నెక్ట్స్ జెనరేషన్ స్విఫ్ట్‌ని కూడా మారుతీ సుజుకీ సంస్థ సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. స్విఫ్ట్- డిజైర్ ఫీచర్స్ ఒకే విధంగా ఉండొచ్చని, ఈ రెండూ కూడా.. కొన్ని వారాల వ్యవధిలోనే లాంచ్ అవ్వొచ్చని టాక్ నడుస్తోంది.
సంబంధిత కథనం