Maruti Suzuki upcoming cars : ‘జిమ్నీ టు ఆల్ న్యూ డిజైర్’.. మారుతీ సుజుకీ లైనప్ అదిరిందిగా!
Maruti Suzuki upcoming cars : మారుతీ సుజుకీ రానున్న రెండేళ్లల్లో అనేక మోడల్స్‌ను లాంచ్ చేయనుంది. వీటిపై ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాము..
Maruti Suzuki upcoming cars : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ జోరు మీద ఉంది! తన పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు రానున్న రెండేళ్లల్లో ఎస్‌యూవీలతో పాటు వివిధ మోడల్స్‌ను లాంచ్ చేసేందుకు పక్కా ప్రణాళికను రచించింది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ లైనప్‌కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న డేటాపై ఓ లుక్కేద్దాము..
మారుతీ సుజుకీ జిమ్నీ..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇక వచ్చే నెలలో 5 డోర్ జిమ్నీని లాంచ్ చేయనుంది మారుతీ సుజుకీ. ఈ రెండు మోడల్స్‌ను 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. వీటికి మంచి బుకింగ్స్‌కు లభించాయి. రూ. 25వేల టోకెన్ అమౌంట్‌తో జిమ్నీని బుక్ చేసుకోవచ్చు.
Maruti Suzuki Jimny bookings : మారుతీ జిమ్నీ ఎస్‌యూవీలో జిటా, ఆల్ఫా వంటి రెండు వేరియంట్లు ఉన్నాయి. స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, రివర్స్ కెమెరా, కలర్ ఎంఐడీ డిస్ప్లేతో పాటు అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో 1.5లీటర్ కే15బీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 103 బీహెచ్పీ పవర్‌ను, 134 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మేన్యువల్/ 4 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇన్నోవా హైక్రాస్ తరహా ఎంపీవీ..
ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీని గతేడాది చివర్లో లాంచ్ చేసింది టయోటా సంస్థ. ఇక ఇప్పుడు హైక్రాస్ తరహా ఎంపీవీని మారుతీ సుజుకీ సైతం తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది రెండో భాగంలో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Maruti Suzuki fronx on road price : మారుతీ సుజుకీ ఎంపీవీలో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని తెలుస్తోంది. ఇది 174 హెచ్‌పీ పవర్‌ను, 205ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
టయోటా టీఎన్జీఏ-సీ ప్లాట్ఫార్మ్ మీద మారుతీ సుజుకీ ఈ ఎంపీవీని రూపొందిస్తుందని సమాచారం. 360 డిగ్రీ కెమెరా, 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, పవర్డ్ సెకెండ్ రో సీట్స్ విత్ ఓటామన్ ఫంక్షన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి ఫీచర్లుగా ఉండొచ్చు.
7 సీటర్ ఎస్యూవీ..
Maruti Suzuki new launches : టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్, మహీంద్రా ఎక్స్‌యూవీ700కు పోటీగా మారుతీ సుజుకీ ఓ కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తోందని తెలుస్తోంది. ఇదొక 7 సీటర్ ఎస్యూవీ అని సమాచారం. ఇందులో టయోటాకు చెందిన స్ట్రాంగ్ హైబ్రీడ్ ఇంజిన్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉండొచ్చు. ఈ ఎస్యూవీ.. గ్రాండ్ విటారాను పోలి ఉంటుందని తెలుస్తోంది.
న్యూ స్విఫ్ట్..
యూరోప్‌లో న్యూ జనరేషన్ స్విఫ్ట్‌ను సుజుకీ టెస్ట్ చేస్తోందని సమాచారం. 2023 రెండో భాగంలో ఇది అంతర్జాతీయంగా లాంచ్ అవ్వొచ్చు. మారుతీ నుంచి రానున్న కార్లలో.. ఈ 2024 మారుతీ స్విఫ్ట్ కోసం ఎదురుచూపులు ఎక్కువగానే ఉన్నాయి. కొత్త స్విఫ్ట్‌లో డిజైన్, కేబిన్‌తో పాటు కీలక మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది.
న్యూ డిజైర్..
Maruti Suzuki Swift Dzire : నెక్స్ట్ జనరేషన్ డిజైర్‌ను 2024లో లాంచ్ చేసేందుకు మారుతీ సుజుకీ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోందని తెలుస్తోంది. డిజైన్, ఇంటీరియర్, ఇంజిన్ పరంగా అనేక మార్పులు కనిపించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం