Maruti Suzuki Jimny: లాంచ్‍కు ముందే బుకింగ్‍ల్లో దూకుడు: జిమ్నీకి ఫుల్ డిమాండ్: వివరాలివే..
Maruti Suzuki Jimny: మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ బుకింగ్‍ల్లో అదరగొడుతోంది. ఈ ఆఫ్‍రోడ్ ఎస్‍యూవీ వివరాలివే.
Maruti Suzuki Jimny 5-door: మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీకి ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. లాంచ్‍కు ముందే ఇప్పటి వరకు ఈ ఆఫ్‍రోడ్ ఎస్‍యూవీ కోసం బుకింగ్స్ 23,500 దాటాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో-2023(Auto Expo-2023)లో ఈ ఫైవ్ డోర్ జిమ్నీని మారుతీ సుజుకీ ఆవిష్కరించింది. అప్పటి నుంచి బుకింగ్‍లు మొదలుపెట్టింది. ఇంత వరకు రూ.25వేలు చెల్లించి జిమ్నీని బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. అయితే బుకింగ్‍లు అనుకున్న దానికంటే ఎక్కువగా పెరుగుతుండటంతో ఈ మొత్తాన్ని పెంచేందుకు మారుతీ సుజుకీ నిర్ణయించుకుంది. మారుతీ సుజుకీ జిమ్నీ 5- డోర్ లాంచ్, అంచనా ధర సహా మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి.
లాంచ్, డెలివరీలు
Maruti Suzuki Jimny 5-door: మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీ ఏప్రిల్ ఆఖర్లో కానీ మే మొదట్లో కానీ ఇండియా మార్కెట్‍లో లాంచ్ కానుంది. బుకింగ్‍లు చేసుకున్న వారికి మే నెలాఖరు నుంచి డెలివరీలు మొదలవుతాయని అంచనాలు వెలువడుతున్నాయి. గురుగ్రామ్‍లోని మారుతీ సుజుకీ ప్లాంట్‍లో జిమ్నీ యూనిట్లు తయారవుతున్నాయి. నెలకు సుమారు 7,000 యూనిట్లను దేశీయ మార్కెట్‍లోకి మారుతీ సుజుకీ తీసుకొస్తుందని అంచనా.
మారుతీ సుజుకీ జిమ్నీ పర్ఫార్మెన్స్
Maruti Suzuki Jimny 5-door: 1.5-లీటర్ కే15బీ పెట్రోల్ ఇంజిన్‍ను మారుతీ సుజుకీ జిమ్నీ కలిగి ఉంటుంది. 105 hp గరిష్ట పవర్, 134 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్యూ కన్వర్టర్ ఆటోమేటిక్‍ను ఎంపిక చేసుకోవచ్చు. సుజుకీ ఆల్‍గ్రిప్ ప్రో 4WD సిస్టమ్‍ను ఈ జిమ్నీ 5-డోర్ కలిగి ఉంటుంది.
రెండు ట్రిమ్‍లలో మారుతీ సుజుకీ జిమ్నీ 5-జోర్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. జెటా, అల్ఫా ఉంటాయి. ఆటోమేటిక్, మాన్యువల్ సహా మొత్తంగా నాలుగు వేరియంట్లు రానున్నాయి.
మారుతీ సుజుకీ జిమ్నీ ఫీచర్లు
Maruti Suzuki Jimny 5-door: ఆటో హెడ్‍ల్యాంప్స్, 9.0 ఇంచుల స్మార్ట్ ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్, ఆర్కెమ్స్ ఆడియో సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, క్రూజ్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, హెడ్‍ల్యాంప్ వాషర్స్ సహా మరిన్ని ఫీచర్లను మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ కలిగి ఉంటుంది.
Maruti Suzuki Jimny 5-door: మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర భారత మార్కెట్‍లో సుమారు రూ.10లక్షల దరిదాపుల్లో ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. నెక్సా షోరూమ్‍ల ద్వారా జిమ్నీ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే నెక్సా షోరూమ్‍లలో ఈ జిమ్నీ ప్రదర్శనను ప్రారంభించింది మారుతీ సుజుకీ. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‍ల్లో క్రమంగా ఈ ఎస్‍యూవీని తరలిస్తోంది.
సంబంధిత కథనం