Day Trading Stocks for Today: ట్రేడర్స్ అలర్ట్.. నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ ఇవే: మారుతీ సుజుకీతో పాటు మరో ఎనిమిది
Day Trading Stocks for Today: నిపుణుల సూచనల ప్రకారం, డే ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్ లిస్ట్ ఇది. స్టాక్ మార్కెట్లు నేడు ఎలా ఓపెన్ అవొచ్చంటే..
Day Trading Guide: అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు ఉన్నా.. బుధవారం సెషన్‍లో భారత మార్కెట్లు లాభపడ్డాయి. ఎస్ఎస్ఈ నిఫ్టీ 44.35 పాయింట్లు పెరిగి 17,813.60 వద్ద సెషన్‍ను ముగించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 169.87 పాయింట్ల బలపడి 60,300.58 వద్దకు చేరింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా 151 పాయింట్లు ఎగిసి 42,829.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీ ఎక్కువగా లాభపడింది. మరోవైపు, నేడు (ఏప్రిల్ 27, గురువారం) స్టాక్ మార్కెట్లు ఎలా మొదలయ్యే అవకాశం ఉంది, నిఫ్టీకి ముఖ్యమైన లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Day Trading Guide: ఎస్‍జీఎక్స్ నిఫ్టీ ప్రకారం చూసుకుంటే, దేశీయ స్టాక్ మార్కెట్ నేడు కూడా ఫ్లాట్ నుంచి స్వల్ప నష్టాలతోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 34.5 పాయింట్లు నష్టంతో ఉంది.
నిఫ్టీకి ముఖ్యమైన లెవెల్స్
Day Trading Guide: నిఫ్టీ ఒకవేళ కిందికి వెళితే 17,700 లెవెల్స్ వద్ద తక్షణ సపోర్ట్ ఉందని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెచర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి పేర్కొన్నారు. “మార్కెట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్‍గానే కొనసాగుతోంది. ముఖ్యమైన రెసిస్టెన్స్ లెవెల్ అయిన 17,863 వద్దకు నిఫ్టీ సమీపిస్తోంది. ఈ గరిష్ట స్థాయిలో నిఫ్టీ కాస్త తచ్చాడే అవకాశం ఉంది. ఆ లెవెల్‍ను దాటి బలం కనబరిస్తే, షార్ట్ టర్మ్ లో మరింత అప్‍సైడ్ మూవ్ అవుతుంది. నిఫ్టీ పడితే తక్షణ సపోర్టు 17,700 లెవెల్స్ వద్ద ఉంది” అని నాగరాజ్ శెట్టి విశ్లేషించారు.
Stocks to Buy Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే
టీవీఎస్ మోటార్స్: బై అట్ రూ.1,125, టార్గెట్: రూ.1,160, స్టాప్ లాస్: రూ.1,110
సీఎస్‍బీ బ్యాంక్: బై అట్ రూ.292, టార్గెట్: రూ.305, స్టాప్ లాస్: రూ.287
హెచ్‍యూఎల్: బై అట్ రూ.2,510, టార్గెట్: రూ.2,585, స్టాప్ లాస్: రూ.2,470
గ్రాసిమ్ ఇండస్ట్రిస్: బై అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.1,730 నుంచి రూ.1,750, స్టాప్ లాస్: రూ.1,670
ఇండిగో: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.2,060 నుంచి రూ.2,075, స్టాప్ లాస్: రూ.1,980
పవర్‌గ్రిడ్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.248, స్టాప్ లాస్: రూ.232
బీపీసీఎల్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.358, స్టాప్ లాస్: రూ.342
మారుతీ సుజుకీ: బై అట్ రూ.8,485, టార్గెట్: రూ.8,600, స్టాప్ లాస్: రూ.8,380
టీసీఎస్: బై అట్ రూ.3,200, టార్గెట్: రూ.3,260, స్టాప్ లాస్: రూ.3,145