తెలుగు న్యూస్ / ఫోటో /
Maruti Suzuki Swift: సరికొత్త లుక్స్ అండ్ ఫీచర్స్ తో మారుతి సుజుకీ స్విఫ్ట్ లేటెస్ట్ మోడల్
New Maruti Suzuki Swift: ఇండియన్ మార్కెట్ కోసం సరికొత్త స్విఫ్ట్ (Maruti Suzuki Swift) ను మారుతి సుజుకీ లాంచ్ చేసింది. ఈ హ్యాచ్ బ్యాక్ (hatchback) ను అడ్వాన్స్డ్ ఫీచర్స్, స్టన్నింగ్ లుక్స్ తో తీర్చిదిద్దింది. ఇంజన్ లోనూ మార్పులు చేసింది.
(1 / 6)
జపాన్ ఆటో దిగ్గజం సుజుకి మోటార్ ఈ వారం ప్రారంభంలో జరిగిన జపాన్ ఆటో షోలో భారతదేశంలో మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటైన రాబోయే స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆవిష్కరించింది. ఇది 4వ జనరేషన్ స్విఫ్ట్. భారత మార్కెట్లోకి ఈ హ్యాచ్ బ్యాక్ ను ఈ సంవత్సరం చివరలో విడుదల చేయనున్నారు.
(2 / 6)
జపాన్ ఆటో షోలో ప్రదర్శించిన స్విఫ్ట్ మోడల్ ప్రస్తుతానికి కాన్సెప్ట్ రూపంలో ఉందని, త్వరలో ప్రొడక్షన్ కు వెళ్తుందని సుజుకి తెలిపింది. ఈ మోడల్ బేసిక్ డిజైన్ లో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ హెడ్‌లైట్‌లు మరియు బంపర్‌ల వంటి వాటిని మరింత స్పోర్టివ్‌గా మార్చింది. ఆటో షో లో చూపిన మోడల్ బ్లూ అండ్ బ్లాక్ డ్యుయల్ టోన్ కలర్ లో ఉంది.
(3 / 6)
ఈ మోడల్ లో వెనుక డోర్ హ్యాండిల్స్ ప్లేస్ ను మార్చింది. ఈ మోడల్ లో విండో కింద మరింత సౌకర్యవంతమైన ప్రదేశంలోకి బ్యాక్ డోర్ హ్యాండిల్స్ ను మార్చారు.
(4 / 6)
మొదట ఈ హ్యాచ్ బ్యాక్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చింది. లేటెస్ట్ వర్షన్ లోనూ అదే ఇంజన్ ను కొనసాగించే అవకాశం ఉంది. ఇది 88.76 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేయగలదు. గ్లోబల్ మార్కెట్ల కోసం, సుజుకి ఒక కొత్త K12 సిరీస్ ఇంజన్‌ని అలాగే హ్యాచ్‌బ్యాక్‌కు ADAS ఫీచర్లను జోడించాలని యోచిస్తోంది. కొత్త స్విఫ్ట్ దాని ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడానికి హైబ్రిడ్ ఆప్షన్ ను ఎంచుకునే అవకాశముంది.
(5 / 6)
కొత్త స్విఫ్ట్ అప్‌డేటెడ్ క్యాబిన్‌తో రానుంది. ఇది డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, ఫ్రీ-స్టాండింగ్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్ల కోసం ఈ హ్యాచ్‌బ్యాక్‌కు ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను ఏర్పాటు చేయవచ్చు. ఇందులో 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది.
(6 / 6)
గ్లోబల్ మార్కెట్లలో విక్రయించే స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ కోసం సుజుకి 1.4-లీటర్ బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించాలని భావిస్తోంది. ఇది ప్రస్తుతం ఇండియాలో స్విఫ్ట్ ల్లో వాడుతున్న ఇంజన్ కన్నా శక్తివంతమైనది. ఇది 127 bhp శక్తిని, 235 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేయగలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో గరిష్టంగా 200 kmph వేగంతో దూసుకుపోతుంది. ఇది కేవలం 9 సెకన్లలో జీరో నుండి 100 కిమీ వేగాన్ని కూడా అందుకోగలదు.
ఇతర గ్యాలరీలు