తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota Rumion : టయోటా రూమియన్​ ఎంపీవీ.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే!

Toyota Rumion : టయోటా రూమియన్​ ఎంపీవీ.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే!

Sharath Chitturi HT Telugu

08 July 2023, 6:49 IST

    • Toyota Rumion launch date in India : టయోటా రూమియన్​ ఎంపీవీని ఇండియాలో లాంచ్​ చేయనుంది ఆ సంస్థ. సెప్టెంబర్​లో ఇండియాలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. పూర్తి విశేషాలు..
టయోటా రూమియన్​ ఎంపీవీ.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే!
టయోటా రూమియన్​ ఎంపీవీ.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే! (Toyota)

టయోటా రూమియన్​ ఎంపీవీ.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే!

Toyota Rumion launch date in India : రూమియన్​ ఎంపీవీని ఇండియాలో లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది టయోటా మోటార్స్​. మారుతీ సుజుకీ ఎర్టిగా ఆధారంగా తయారు చేసిన ఈ మోడల్​.. ఈ ఏడాది సెప్టెంబర్​లో ఇండియాలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ ఎంపీవీ గతేడాది సౌత్​ ఆఫ్రికా మార్కెట్​లో లాంచ్​ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ టయోటా రూమియన్​ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..

టయోటా రూమియన్​ ఎంపీవీ- లుక్స్​..

కారులో స్కల్ప్​టెడ్​ హుడ్​, స్వెప్ట్​ బ్యాక్​ ప్రాజెక్టర్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, భారీ క్రోమ్​ సరౌండెడ్​ గ్రిల్​, వైడ్​ ఎయిర్​ డ్యామ్​, ఇండికేటర్​ మౌంటెడ్​ ఓఆర్​వీఎంలు, బ్లాక్​డ్​ ఔట్​ బీ పిల్లర్స్​, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, డిజైనర్​ డ్యూయెల్​ టోన్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. ఇక రేర్​లో ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్స్​, రూఫ్​ మౌంటెడ్​ స్పాయిలర్​లు లభిస్తున్నాయి.

టయోటా రూమియన్​ ఎంపీవీ- ఫీచర్స్​..

ఇండియాలో లాంచ్​కు సిద్ధమవుతున్న టయోటా రూమియన్​ ఇంటీరియర్​ ఫీచర్స్​పై ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే ఈ 7 సీటర్​ కేబిన్​లో డ్యూయెల్​ టోన్​ డాష్​బోర్డ్​, ఫౌక్స్​ వుడ్​ ట్రిమ్స్​, ఫాబ్రిక్​ అప్​హోలిస్ట్రీ, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, రూఫ్​ మౌంటెడ్​ వెంట్స్​, మల్టిపుల్​ స్టీరింగ్​ వీల్​, సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​లు వస్తున్నాయి.

ఇదీ చూడండి:- Maruti Suzuki launches Invicto: మార్కెట్లోకి మారుతి సుజుకీ ఇన్విక్టో.. ప్రీమియం ఎంపీవీ సెగ్మెంట్లోకి గ్రాండ్ ఎంట్రీ

ప్యాసింజర్​ సేఫ్టీ కోసం ఈ రూమియన్​ ఎంపీవీలో మల్టిపుల్​ ఎయిర్​బ్యాగ్స్​తో పాటు ఇతర ఫీచర్స్​ రానున్నాయి.

టయోటా రూమియన్​ ఎంపీవీ- ఇంజిన్​..

Toyota Rumion price in India : ఈ మోడల్​లో 1.5 లీటర్​, డ్యూయెల్​ జెట్​ మైల్డ్​ హైబ్రీడ్​ ఇంజిన్​ ఉండొచ్చు. మారుతీ సుజుకీ ఎర్టిగాలోనూ ఇదే ఉంది. ఇది 103 హెచ్​పీ పవర్​ను, 136.8 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ మేన్యువల్​, 6 స్పీడ్​ ఏఎంటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉంటాయి.

ఇక దక్షిణాఫ్రికాలో ఈ టయోటా రూమియన్​ ధర 296900 రాండ్లుగా ఉంది. అంటే సుమారూ రూ. 12.84లక్షలు. ఇండియాలో మారుతీ సుజుకీ ఎక్స్​షోరూం ధర ప్రస్తుతం రూ. 8.64లక్షలు- రూ. 13.08లక్షల మధ్యలో ఉంది. కాగా.. త్వరలో లాంచ్​ అవుతున్న టయోటా వెహికిల్​ ధర దీని కన్నా ఎక్కువగా ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ మోడల్​కు సంబంధించిన ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

2024 సీ-హెచ్​ఆర్​ ఎస్​యూవీ..

2024 సీ- హెచ్​ఆర్​ ఎస్​యూవీని తాజాగా ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టయోటా. యూరోప్​లో ఈ మోడల్​ బుకింగ్స్​ మొదలయ్యాయి.

ఈ టయోటా ఎస్​యూవీకి సూపర్​ కూపే ప్రొఫైల్​ ఉంటుంది. ఇందులో మస్క్యులర్​ హుడ్​, సీ షేప్​ స్వెప్ట్​ బ్యాక్​ హెడ్​లైట్స్​, వైడ్​ బంపర్​, డైమెంట్​ కట్​ లైన్స్​, ఫ్లష్​ ఫిట్టెడ్​ డోర్​ హ్యాండిల్స్​, 20 ఇంచ్​ స్టైలిష్​ వీల్స్​ వంటివి లభిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం