car sales : దూసుకెళుతున్న ఎంజీ మోటార్​, టయోటా.. అదిరిన కార్​ సేల్స్​..!-mg motor india retail sales up 14 percent at 5 125 units in june ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Car Sales : దూసుకెళుతున్న ఎంజీ మోటార్​, టయోటా.. అదిరిన కార్​ సేల్స్​..!

car sales : దూసుకెళుతున్న ఎంజీ మోటార్​, టయోటా.. అదిరిన కార్​ సేల్స్​..!

Sharath Chitturi HT Telugu
Jul 01, 2023 01:39 PM IST

MG Motor sales : జూన్​ నెలకు సంబంధించిన కార్​ సేల్స్​ డేటాను విడుదల చేశాయి ఎంజీ మోటార్​ ఇండియా, టయోటా సంస్థలు. ఆ వివరాలు..

భారీగా వృద్ధి చెందిన ఎంజీ మోటార్​, టయోటా కార్​ సేల్స్​..!
భారీగా వృద్ధి చెందిన ఎంజీ మోటార్​, టయోటా కార్​ సేల్స్​..!

MG Motor june car sales data : ఎంజీ మోటార్​ ఇండియా సేల్స్​ వేగంగా వృద్ధిచెందుతున్నాయి. తాజాగా.. జూన్​లో 5,125 యూనిట్ల సేల్స్​తో 14శాతం వృద్ధిని సాధించింది ఆ సంస్థ. 2022 జూన్​లో 4,504 వాహనాలను మాత్రమే విక్రయించింది.

"బిపర్జాయ్​ తుపాను కారణంగా సప్లై దెబ్బతింది. అయినప్పటికీ డిమాండ్​ మెరుగ్గానే ఉంది. ఇండియాలో పండుగ సీజన్​ మొదలవ్వనుంది. అది సానుకూల విషయం," అని ఎంజీ మోటార్​ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్​-జూన్​)లో మొత్తం మీద 14,682 యూనిట్​లను విక్రయించింది ఎంజీ మోటార్​. గతేడాది ఇదే త్రైమాసికంతో (10,519) పోల్చుకుంటే అది 40శాతం ఎక్కువగా ఉండటం విశేషం.

ఎంజీ మోటార్​కు హెక్టార్​ ఎస్​యూవీ బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది. తాజాగా ఈ మోడల్​కు సంబంధించిన నెక్స్ట్​ జనరేషన్​ను లాంచ్​ చేసింది. ఈ న్యూ జనరేషన్​ హెక్టార్​ ఎస్​యూవీకి మంచి డిమాండే కనిపిస్తోంది.

ఇదీ చూడండి:- Toyota C HR SUV : 2024 సీ-హెచ్​ఆర్​ ఎస్​యూవీని రివీల్​ చేసిన టయోటా..

టయోటా కార్​ సేల్స్​ డేటా..

Toyota car sales data June 2023 : టయోటా కిర్లోస్కర్​ మోటార్​ కూడా.. జూన్​ నెలకు సంబంధించిన కార్​ సేల్స్​ డేటాను విడుదల చేసింది. జూన్​లో ఎగుమతులతో కలుపుకుని మొత్తం మీద 19,608 వాహనాలను విక్రయించింది. గతేడాది జూన్​ (16,512)తో పోల్చుకుంటే ఇది 19శాతం వృద్ధిగా ఉంది. అయితే.. మే నెలతో పోల్చుకుంటే మాత్రం జూన్​లో సంస్థ సేల్స్​ స్వల్పంగా తగ్గాయి. మే నెలలో 20వేల వాహనాలను సేల్​ చేసింది టయోటా సంస్థ.

ఇండియాలో జూన్​ నెలలో 18,237 యూనిట్​లను విక్రయించింది టయోటా. 1,371 వాహనాలను ఎగుమతి చేసింది. అర్బన్​ క్రూజర్​ హైరైడర్​ ఎస్​యూవీ, హైక్రాస్​ ఎంపీవీకి మంచి డిమాండ్​ కనిపిస్తున్నట్టు సంస్థ చెబుతోంది. ఈ రెండింటితో పాటు ఫార్చ్యునర్​ కూడా సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది. కామ్రీ హైబ్రిడ్​ సెడాన్​, వెల్​ఫైర్​ ప్రీమియం ఎస్​యూవీ, గ్లాంజా హ్యాచ్​బ్యాక్​, హీలక్స్​ వంటి మోడల్స్​ను కూడా విక్రయిస్తోంది టయోటా.

ఎస్​యూవీ, ఎంపీవీ, హైబ్రిడ్​ మోడల్స్​పై టయోటా సంస్థ ఎక్కువ ఫోకస్​ పెట్టినట్టు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ సెగ్మెంట్స్​లో పలు మోడల్స్​ లాంచ్​కు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Whats_app_banner

సంబంధిత కథనం