Toyota C HR SUV : 2024 సీ-హెచ్ఆర్ ఎస్‌యూవీని రివీల్ చేసిన టయోటా..
Toyota C HR SUV : 2024 సీ-హెచ్ఆర్ ఎస్‌యూవీని తాజాగా రివీల్ చేసింది టయోటా సంస్థ. యూరోప్‌లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆ వివరాలు..
Toyota C HR SUV : 2024 సీ- హెచ్ఆర్ ఎస్‌యూవీని తాజాగా ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టయోటా. యూరోప్‌లో ఈ మోడల్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ ఎస్యూవీ ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సీ హెచ్ఆర్ ఎస్యూవీ స్పెసిఫికేషన్స్..
ఈ టయోటా ఎస్‌యూవీకి సూపర్ కూపే ప్రొఫైల్ ఉంటుంది. ఇందులో మస్క్యులర్ హుడ్, సీ షేప్ స్వెప్ట్ బ్యాక్ హెడ్‌లైట్స్, వైడ్ బంపర్, డైమెంట్ కట్ లైన్స్, ఫ్లష్ ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్, 20 ఇంచ్ స్టైలిష్ వీల్స్ వంటివి లభిస్తున్నాయి.
ఇక రేర్‌లో షార్క్ ఫిన్ యాంటీనా, ఫుల్ విడ్త్ టెయిల్‌ల్యాంప్‌లు వస్తున్నాయి.
టయోటా సీ హెచ్ఆర్ ఫీచర్స్ ఇవే..
సెకండ్ జనరేషన్ టయోటా సీ- హెచ్ఆర్ ప్రీమియం కేబిన్‌లో రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన అప్‌హోలిస్ట్రీ, ఇన్ఫ్రారెడ్ రెడ్యూసింగ్ కోటింగ్‌తో కూడిన పానోరమిక్ సన్‌రూఫ్ వంటివి వస్తున్నాయి. ఈ కోటింగ్‌తో వేసవి కాలంలో ఓవర్హింట్ నుంచి శీతాకాలంలో ఓవర్కూలింగ్ నుంచి రక్షణ లభిస్తుందని సంస్థ చెబుతోంది. సర్క్యులర్ ఏసీ వెంట్స్, 3 స్పోక్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటివి లభిస్తున్నాయి.
Toyota C HR SUV hybrid : అంతేకాకుండా ఈ ఎస్‌యూవీలో 64 కలర్ యాంబియెంట్ లైటింగ్, హెడ్-అప్ డిస్ప్లే, జేబీఎల్ సౌండ్ సిస్టెమ్, డిజిటల్ కీ వంటివి కూడా వస్తున్నాయి. 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వంటివి సైతం ఉన్నాయి.
ఇక సేఫ్టీ కోసం లేన్ ఛేంజింగ్ అసిస్ట్, ఫ్రెంట్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ప్రోయాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్ వంటి టయోటా సేఫ్టీ సెన్స్ ఏడీఏఎస్లు లభిస్తున్నాయి.
టయోటా సీ హెచ్ఆర్ ఇంజిన్ వివరాలు..
ఈ కొత్త ఎస్‌యూవీలో 140 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.8 లీటర్ హైబ్రీడ్, 198 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 2.0 లీటర్ హైబ్రీడ్, 223 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే ప్లగ్ ఇన్ హైబ్రీడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.
Toyota C HR SUV price : 2024 టయోటా సీ-హెచ్ఆర్ ఎక్స్‌షోరూం ధర 35,000 పౌండ్లుగా ఉండొచ్చు. అంటే.. సుమారు రూ. 36.5లక్షలు. యూరోప్‌లోనే దీనిని డెవలప్‌చేసి విక్రయిస్తోంది సంస్థ.
టయోటా వెల్ఫైర్..
జపాన్‌కు చెందిన టయోటా సంస్థ మంచి జోరు మీద ఉంది. కొత్త మోడల్స్‌తో పాటు అప్డేటెడ్ వర్షెన్లను లాంచ్ చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. 2024 టయోటా వెల్ఫైర్ ప్రీమియం ఎంపీవీని సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ ఫోర్త్ జనరేషన్ ఎంపీవీకి క్రేజీ అప్డేట్స్ లభించాయి.
ఫోర్త్ జనరేషన్ వెల్ఫైర్ ప్రీమియం ఎంపీవీని లాంచ్ చేసింది టయోటా మోటార్స్. డిజైన్ పరంగా చాలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెంట్ బంపర్ లుక్ చాలా అగ్రెసివ్‌గా ఉంది. గ్రిల్‌పై వర్టికల్ స్లేట్స్ వస్తున్నాయి. 2024 టయోటా వెల్‌ఫైర్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 260 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 2.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఒకటి. 260 హెచ్‌ప పవర్‌ను జనరేట్ చేసే 2.5 లీటర్ పెట్రోల్ హైబ్రీడ్ ఇంజిన్ ఒకటి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం