Top performing mutual funds : 2023లో అత్యధిక రిటర్నులు ఇచ్చిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
23 December 2023, 11:55 IST
Top performing mutual funds 2023 : ఈ ఏడాది మ్యూచువల్ ఫండ్స్ ప్రదర్శన ఎలా ఉంది? లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఏది ఎక్కువ రిటర్నులు ఇచ్చింది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
2023లో అత్యధిక రిటర్నులు ఇచ్చిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
Top performing mutual funds 2023 : 2023 ముగింపు దశకు చేరుకుంటోంది. మ్యూచువల్ ఫండ్స్‌పై భారతీయుల ఫోకస్ ఈ ఏడాది మరింత పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే.. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీల్లో.. ఏ మ్యూచువల్ ఫండ్స్ అత్యధిక రిటర్నులు ఇచ్చాయి? అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాము..
2023 టాప్ మ్యూచువల్ ఫండ్స్..
లార్జ్ క్యాప్ ఫండ్స్ అత్యంత సురక్షితమైనవి. అందుకు తగ్గట్టుగానే ఇందులో రిటర్నులు ఉంటాయి. ఆ తర్వాతి స్థానంలో మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. వీటిల్లో రిస్క్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది. రిటర్నులు కూడా ఎక్కువే! ఇక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. రిటర్నులు కూడా అదే విధంగా ఉంటాయి.
ఈ 2023లో లార్జ్ క్యాప్ ఫండ్స్ సగటున 16.15 శాతం వార్షిక రిటర్నులు అందించాయి. మిడ్ క్యాప్ ఫండ్స్.. 30.77 శాతం రిటర్నులు తెచ్చిపెట్టాయి. అయితే.. స్మాల్ క్యాప్స్ గరిష్ట సగటు రిటర్నులు 34.29 శాతంగా ఉంది.
మరోవైపు.. లార్జ్ క్యాప్ ఫండ్స్, తక్కువ రాబడులను అందించినప్పటికీ, మొత్తం ఏయుఎంలు (అసెట్ అండర్ మేనేజ్మెంట్) రూ .2,76,639 కోట్లతో గరిష్ట పెట్టుబడిని ఆకర్షించాయి.
ఏ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్..?
మార్కెట్ క్యాపిటలైజేషన్ని పరిగణలోకి తీసుకుని, మూడు కేటగిరీల్లో 5-టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఇది..
లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
Large cap mutual funds returns 2023 : లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్.. తమ ఏయూఎంలలో కనీసం 80 శాతం లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే టాప్ 100 కంపెనీల స్టాక్స్, వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ర్యాంకింగ్స్ ఉంటాయి.
2023 డిసెంబర్ 21 నాటికి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే సగటు ఏడాది రాబడి 16.15శాతంగా ఉందని మార్నింగ్‌స్టార్ డేటా సూచిస్తోంది.
(సోర్స్: ఏయంఎప్ఐ; డిసెంబర్ 21, 2023 నాటికి డేటా)
మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
MIid cap mutual funds returns 2023 : మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్.. తమ ఏయూఎంలో కనీసం 65 శాతం మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం 101 నుంచి 250 మధ్య ర్యాంకుల్లో ఉన్న కంపెనీల షేర్లను మిడ్ క్యాప్ స్టాక్స్ అని అంటారు.
మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సగటు ఏడాది రాబడి 30.77 శాతంగా ఉంది.
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
Small cap mutual funds returns 2023 : స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తమ ఏయూఎంలలో కనీసం 65 శాతం స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 250 కంపెనీల కంటే తక్కువ ర్యాంకుల్లో ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడమే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉద్దేశం.
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ల సగటు ఏడాది రాబడి 34.29 శాతంగా ఉంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిత్యం స్టాక్ మార్కెట్లకు ట్రాక్ చేయలేని వారు.. ప్రశాంతంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.