తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market : 'ట్రేడింగ్​లో డబ్బులు సంపాదించాలనుకుంటే కష్టమే'

Stock market : 'ట్రేడింగ్​లో డబ్బులు సంపాదించాలనుకుంటే కష్టమే'

Sharath Chitturi HT Telugu

28 June 2022, 7:36 IST

google News
    • Stock market trading : మీరు ట్రేడింగ్​ చేద్దామనుకుంటున్నారా? ట్రేడింగ్​లో డబ్బులు సంపాదించడం సులభం అని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.
ట్రేడింగ్​లో డబ్బులు సంపాదించాలనుకుంటే కష్టమే!
ట్రేడింగ్​లో డబ్బులు సంపాదించాలనుకుంటే కష్టమే! (REUTERS)

ట్రేడింగ్​లో డబ్బులు సంపాదించాలనుకుంటే కష్టమే!

Stock market trading : డబ్బు సంపాదించేందుకు ఉన్న అత్యంత క్లిష్ట మార్గాల్లో 'ట్రేడింగ్​' ఒకటి అని ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థ జెరోధా సీఈఓ, సహ వ్యవస్థాపకుడు నితిన్​ కామత్​ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం స్టాక్​ మార్కెట్లలో ఉన్న అస్థిరత్వం వల్ల డబ్బులు సంపాదించడం మరింత కష్టంగా మారిపోయిందని వెల్లడించారు.

'అంత ఈజీ కాదు..'

ద్రవ్యల్బణం, వడ్డీ రేట్లు వంటి పదాలతో సర్వత్రా భయాలు నెలకొన్న వేళ ట్రేడర్లకు కీలక సూచనలు ఇచ్చారు నితిన్​ కామత్​.

"సోషల్​ మీడియాను చూస్తూ పెరుగుతున్న ట్రేడర్లు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 'నేను తప్ప.. అందరు సక్సెస్​ అవుతున్నారు' అని మీకు అనిపిస్తుంది. కానీ అందులో నిజం లేదు. డబ్బు సంపాదించడంలో ఉన్న అత్యంత క్లిష్ట మార్గాల్లో ట్రేడింగ్​ ఒకటి. బేర్​ మార్కెట్లు చాలా దారుణంగా ఉంటాయి. మార్కెట్లు పెరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కానీ పడటానికి తక్కువ సమయమే పడుతుంది. అందుకే.. స్టాక్​ మార్కెట్​లో 'లాంగ్స్​' కన్నా 'షార్ట్స్​'కే ఎక్కువ డబ్బులు వస్తాయి. అయితే.. బేర్​ మార్కెట్లు ముగిసే సమయాన్ని అంచనా వేయడం కష్టం. బౌన్స్​ బ్యాక్​తో మార్కెట్లు పెరుగుతున్నట్టు, లాభాలు వస్తున్నట్టు, కనిపిస్తుంది. కానీ ఎక్కడ ప్రాఫిట్​ బుకింగ్​ చేసుకోవాలో అర్థంకాదు," అని జెరోధా సీఈఓ నితిన్​ కామత్​ ట్వీట్​ చేశారు.

'ట్రేడింగ్​ అంటే.. సమయం- శ్రమ'

ట్రేడింగ్​ అనేది చాలా మంది డబ్బుతో చూస్తారని.. కానీ తన దృష్టిలో అది సమయం-శ్రమ అని అన్నారు నితిన్​ కామత్​.

Trading tips : "2010 తర్వాత నేను వ్యక్తిగతంగా ట్రేడింగ్​ చేయలేదు. జెరోధా ఫీచర్లను టెస్ట్​ చేసేందుకు అప్పుడప్పుడు ట్రేడ్​ చేస్తాను. కానీ నేను ఒక మంచి ట్రేడర్​ అని నాకు తెలుసు. స్టాక్స్​లో ట్రేడ్​ చేసి డబ్బులు సంపాదించడాన్ని చాలా మంది ట్రేడింగ్​ అనుకుంటారు. కానీ నా దృష్టి అది కాదు. రిస్క్​-రివార్డ్​ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు.. మనం మన సమయాన్ని, శ్రమని ట్రేడ్​ చేస్తుంటాము. నా జీవితంలో నేను తీసుకున్న అతిపెద్ద ట్రేడ్​ 'జెరోధా'. నా సమయం, నా శ్రమ అంత దానికే," అని జెరోధా సీఈఓ నితిన్​ కామత్​ స్పష్టం చేశారు.

తన వ్యక్తిగత పోర్ట్​ఫోలియోను తాను మేనేజ్​ చేసుకోనని, ఆ బాధ్యత తన సోదరుడు- జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్​ కామత్​దేనని నితిన్​ వెల్లడించారు.

స్టాక్​ మార్కెట్​ ట్రేడర్లకు నితిన్​ కామత్​ తరచూ సూచనలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా బిగినర్లకు అవి ఎంతో విలువలను ఇస్తుంటాయి.

టాపిక్

తదుపరి వ్యాసం