Small cap stocks : ‘స్మాల్​ క్యాప్​’ స్టాక్స్​కు టైమ్​ వచ్చిందా? భారీ లాభాలు పక్కా?-should you buy small cap stocks on dips in this market correction ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Small Cap Stocks : ‘స్మాల్​ క్యాప్​’ స్టాక్స్​కు టైమ్​ వచ్చిందా? భారీ లాభాలు పక్కా?

Small cap stocks : ‘స్మాల్​ క్యాప్​’ స్టాక్స్​కు టైమ్​ వచ్చిందా? భారీ లాభాలు పక్కా?

Sharath Chitturi HT Telugu
Jun 29, 2022 11:58 AM IST

Small cap stocks : స్టాక్​ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. మరి ఈ సమయంలో స్మాల్​ క్యాప్​ స్టాక్స్​లో పెట్టుబడి పెట్టవచ్చా?

<p>జపాన్​ స్టాక్​ మార్కెట్​ చిత్రం</p>
జపాన్​ స్టాక్​ మార్కెట్​ చిత్రం (AP)

Small cap stocks : అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇండియా స్టాక్​ మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాదిలో సెన్సెక్స్​, నిఫ్టీ ఇప్పటివరకు 10శాతం మేర పతనమయ్యాయి. స్మాల్​ క్యాప్​ ఇండెక్స్​ 16శాతం పడిపోయింది. సహజంగా మార్కెట్లు పెరుగుతుంటే.. స్మాల్​ క్యాప్​ స్టాక్స్​ విపరీతంగా పెరుగుతాయి. పడుతున్నా అదే జరుగుతుంది. మరి ఇప్పుడు స్మాల్​ క్యాప్​ స్టాక్స్​ పడ్డాయి. ఇప్పుడు వీటిల్లో కొనుగోళ్లు చేయవచ్చా?

ఆచితూచి..

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. వ్యాపారం, ఫండమెంటల్స్​ మంచిగా ఉండే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాంటి కంపెనీ షేర్లు.. స్టాక్​ మార్కెట్ల ఒత్తడితో పతనమైనప్పటికీ.. ఒక లిమిట్​ తర్వాత పెరుగుతాయి. ఆ సమయంలో కొనుగోలు చేస్తే మదుపర్లకు అల్ఫా రిటర్నులు తెచ్చిపెడతాయి.

Small cap stocks to buy : స్మాల్​ క్యాప్​, మిడ్​ క్యాప్​ స్టాక్స్​లో పెట్టుబడులు పెట్టే విషయంలో 'రిస్క్​' కీలకంగా ఉంటుంది. బేర్​ మార్కెట్​ ప్రభావం.. లార్జ్​ క్యాప్​ కన్నా.. ఈ స్మాల్​ క్యాప్​ స్టాక్స్​, మిడ్​ క్యాప్​ స్టాక్స్​పైనే ఎక్కువగా ఉంటుంది. చూస్తూ, చూస్తూనే సంపద ఆవిరి అయిపోతుంది.

అందువల్ల మదుపర్లు తమ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం లార్జ్​ క్యాప్​ స్టాక్స్​కు వెచ్చించాలని, ఆ తర్వాత స్మాల్​ క్యాప్-, మిడ్​ క్యాప్​ స్టాక్స్​వైపు చూడాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అది కూడా.. మార్కెట్లు బౌన్స్​బ్యాక్​ అయిన తర్వాతే స్మాల్​ క్యాప్​లో పెట్టాలని సూచిస్తుంటారు.

"2008 పరిస్థితులను గమనిస్తే.. అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉండేది. లార్జ్​ క్యాప్​ స్టాక్స్​ 45శాతం మేర పడ్డాయి. స్మాల్​ క్యాప్​ స్టాక్స్​ ఏకంగా 70శాతం మేర నష్టపోయాయి. అంటే.. మార్కెట్లు పడుతుంటే స్మాల్​ క్యాప్​ ఇన్వెస్టర్లపైనా చాలా ఒత్తిడి ఉంటుంది. అందువల్ల.. స్టాక్​ మార్కెట్లు పడినా, ధైర్యంగా ఉంటామని అనుకునే వాళ్లే స్మాల్​ క్యాప్​ స్టాక్స్​పై దృష్టిపెట్టాలి," అని వాల్యూ రీసెర్చ్​ సీఈఓ ధర్మేంద్ర కుమార్​ వెల్లడించారు.

stock market tips : "గత వారం.. లార్జ్​ క్యాప్​ స్టాక్స్​ కన్నా స్మాల్​ క్యాప్​ స్టాక్స్​లో రికవరీ మెరుగ్గా కనిపించింది. కానీ మార్కెట్లు కోలుకున్నాయి అని చెప్పేందుకు సంకేతాలు కనిపించడం లేదు. అనిశ్చితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల స్మాల్​ క్యాప్​ స్టాక్స్​లో పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో.. లార్జ్​ క్యాప్​ స్టాక్స్​ కన్నా స్మాల్​ క్యాప్​ స్టాక్స్​ ఎక్కువ రాణిస్తాయి. కానీ ఆ స్మాల్​ క్యాప్​ స్టాక్స్​లో కూడా మంచి కంపెనీలను ఎంచుకోవాలి. లేకపోతే భారీ నష్టాలు తప్పవు," అని వ్రైట్​ రీసెర్చ్​కు చెందిన సోనమ్​ శ్రీవాస్తవ తెలిపారు.

"మీరు ఎక్కువ రిస్క్​ తీసుకుందామని అనుకున్నా.. అనవసరమైన రిస్క్​లు తీసుకోకూడదు. బేర్​ మార్కెట్​ పరిస్థితుల్లో లార్జ్​ క్యాప్​ స్టాక్స్​ కొనుక్కోవాలి. పెట్టుబడుల కోసం డబ్బులు సమకూర్చుకోవాలి. ఇలా చేస్తేనే లాభాలు వస్తాయి," అని ప్రాఫిట్​మార్ట్ సెక్యూరిటీస్​ హెడ్​ ఆఫ్​ రీసెర్చ్​ అవినాష్​ గోరక్ష్​కర్​ అభిప్రాయపడ్డారు.

ఏది ఏమైనా స్మాల్​ క్యాప్​ స్టాక్స్​తో మదుపర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బిగినర్లు వాటివైపు చూడకపోవడం ఉత్తమం. స్మాల్​ క్యాప్​ స్టాక్​ భారీగా పెరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తుంటాయి. ఒక్కోసారి ఫండమెంటల్స్​తో సంబంధం లేకుండా అవి పెరిగిపోతూ ఉంటాయి. ఆపరేటర్లు వాటిని కంట్రోల్​ చేస్తూ ఉంటారు. సరైన సమయం చూసి, మొత్తం అమ్మేసి భారీ లాభాలు పొందుతారు. రిటైలర్లు మాత్రం ట్రాప్​ అయ్యి భారీ నష్టాలను చూస్తుంటారు.​

(గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం రూపొందించినది మాత్రమే. నిపుణుల అభిప్రాయలతో హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం