తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Today Gold Rate September 12th : మళ్లీ పెరిగిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ధరలు ఇవే

Today Gold Rate September 12th : మళ్లీ పెరిగిన పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ధరలు ఇవే

Anand Sai HT Telugu

12 September 2024, 5:31 IST

google News
    • Today Gold and Silver Price : దేశంలో బంగారం ధరలు కాస్త పెరిగాయి. వెండి ధరలు సైతం పైకి వెళ్లాయి. తెలుగు రాష్ట్రాలతోపాటుగా దేశంలోని ఇతర నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
నేటి బంగారం, వెండి ధరలు
నేటి బంగారం, వెండి ధరలు

నేటి బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి రూ. 67,160కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 67,150గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 6,71,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,716గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 పెరిగి రూ. 73,260గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 73,250గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి రూ. 7,32,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,326గా ఉంది.

దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,310గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,410గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,160 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,260గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,160గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,260గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,160గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,260గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,160గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,260గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.67,210గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,310గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,160గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,260గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు

దేశంలో వెండి ధరలు గురువారం మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 8,660గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 86,600గా కొనసాగుతోంది. బుధవారం ఈ ధర రూ. 86,500గా ఉండేది.

హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 91,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 86,600.. బెంగళూరులో రూ. 83,900గా ఉంది.

ప్లాటీనం ధరలు

దేశంలో ప్లాటీనం రేట్లు గురువారం కాస్త పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 60 పెరిగి రూ. 25,430కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 25,370గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,430గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

తదుపరి వ్యాసం