తెలుగు న్యూస్ / ఫోటో /
Paralympics 2024 Gold Medal: పారిస్ పారాలింపిక్స్‌లో ఇండియాకు మరో గోల్డ్ మెడల్.. హైజంప్‌లో చరిత్ర సృష్టించిన ప్రవీణ్
- Paralympics 2024 Gold Medal: పారిస్ పారాలింపిక్స్ 2024లో ఇండియాకు మరో గోల్డ్ మెడల్ వచ్చింది. హైజంప్ లో ప్రవీణ్ కుమార్ స్వర్ణం గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
- Paralympics 2024 Gold Medal: పారిస్ పారాలింపిక్స్ 2024లో ఇండియాకు మరో గోల్డ్ మెడల్ వచ్చింది. హైజంప్ లో ప్రవీణ్ కుమార్ స్వర్ణం గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
(1 / 6)
Paralympics 2024 Gold Medal: పారిస్ పారాలింపిక్స్ లో ఇండియన్ అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 6) మరో గోల్డ్ మెడల్ వచ్చింది. గత పారాలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన ప్రవీణ్ కుమార్.. ఈసారి హైజంప్ టీ-64లో ఏకంగా స్వర్ణం సాధించడం విశేషం. ఈ మెడల్ తో ఇండియా మొత్తం మెడల్స్ సంఖ్య 26కు చేరింది
(2 / 6)
Paralympics 2024 Gold Medal: ప్రవీణ్ కుమార్ తన అత్యుత్తమ ప్రదర్శనతో పాటు ఏరియా రికార్డుతో పారిస్ లో స్వర్ణ పతకం సాధించాడు. అంటే, ఈ ఈవెంట్లో భారత స్టార్ ఆసియా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అతడు గరిష్టంగా 2.08 మీటర్ల ఎత్తు నుంచి దూకి చరిత్ర సృష్టించాడు.
(3 / 6)
Paralympics 2024 Gold Medal: పారిస్ పారాలింపిక్స్ లో టీ-44 విభాగానికి ప్రాతినిధ్యం వహించాడు. పారాలింపిక్స్ లో ఈ హైజంప్ ఈవెంట్ లో టీ-62, టీ-64 విభాగాలకు చెందిన పారా అథ్లెట్లు కూడా పాల్గొనవచ్చు. పారిస్ మీట్ లో అమెరికాకు చెందిన డెరెక్ ఒక్కడే టి-64 హైజంపర్ గా నిలిచాడు. అతడు 2.06 మీటర్ల ఎత్తుతో సిల్వర్ గెలిచాడు.
(4 / 6)
Paralympics 2024 Gold Medal: ఈ ఈవెంట్లో ప్రవీణ్ మొదట 1.89 మీటర్ల ఎత్తు నుంచి జంప్ చేశాడు. తర్వాత వరుసగా 1.93, 1.97, 2.00, 2.03, 2.06, 2.08 మీటర్ల ఎత్తును అధిగమించాడు. అంటే ఈ ఇండియన్ స్టార్ వరుసగా ఏడు జంప్స్ లో సక్సెస్ అయ్యాడు.
(5 / 6)
Paralympics 2024 Gold Medal: ప్రవీణ్ స్వర్ణం సాధించిన తర్వాత మొత్తం పతకాల పట్టికలో భారత్ 14వ స్థానానికి ఎగబాకింది. దీంతో పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కు మొత్తం ఆరు బంగారు పతకాలు లభించాయి. ఇవి కాకుండా మరో 9 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు