తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tesla In Telangana : తెలంగాణలో టెస్లా ప్లాంట్​! ఎలాన్​ మస్క్​ టీమ్​తో ప్రభుత్వం చర్చలు..

Tesla in Telangana : తెలంగాణలో టెస్లా ప్లాంట్​! ఎలాన్​ మస్క్​ టీమ్​తో ప్రభుత్వం చర్చలు..

Sharath Chitturi HT Telugu

05 April 2024, 7:20 IST

    • Tesla India : ఎలాన్​ మస్క్​కి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్​ కార్ల తయారీ సంస్థ టెస్లాతో చర్చలు జరుపుతున్నట్టు తెలంగాణ మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. తెలంగాణలో టెస్ల ప్లాంట్​ ఏర్పాటయ్యే విధంగా కృషి చేస్తున్నట్టు వివరించారు.
టెస్లా టీమ్​తో తెలంగాణ ప్రభుత్వం చర్చలు..
టెస్లా టీమ్​తో తెలంగాణ ప్రభుత్వం చర్చలు.. (HT_PRINT)

టెస్లా టీమ్​తో తెలంగాణ ప్రభుత్వం చర్చలు..

Tesla in India : ఇండియాలోకి ఎలాన్​ మస్క్​ టెస్లా రాక అనివార్యం! ఎలక్ట్రిక్​ వాహనాల మేన్యుఫ్యాక్చరింగ్​ ప్లాంట్​ని ఏర్పాటు చేసేందుకు అణువైన ప్రదేశాల కోసం టెస్లా టీమ్​ అన్వేషణ మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి డీ. శ్రీధర్​ బాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టెస్లా ప్లాంట్​ ఏర్పాటు కోసం ఎలాన్​ మస్క్​ టీమ్​తో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Naga Chaitanya Porsche : రూ. 3.5 కోట్లు పెట్టి పోర్షే కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్​లో ఇదే ఫస్ట్​!

Stocks to buy today : భారీగా పతనమైన టాటా మోటార్స్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ ప్రాఫిట్స్​!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

ఎలాన్​ మస్క్​ టెస్లా టీమ్​తో తెలంగాణ ప్రభుత్వం చర్చలు..

"అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్​ 2023 నుంచి ఈ విషయంపై ఫోకస్​ చేశాము. ఇందులో భాగంగానే.. ఇండియాలో టెస్లా పెట్టుబడులను కూడా ట్రాక్​ చేస్తున్నాము. టెస్లాను తెలంగాణలోకి తీసుకొచ్చేందుకు గత కొంతకాలంగా తీవ్రంగా కృషి చేస్తున్నాము. టెస్లాతో మా టీమ్​ చర్చలు జరుపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా.. తెలంగాణకు టెస్లా వచ్చే విధంగా పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాము," అని ఎక్స్​ (ట్విట్టర్​)లో ట్వీట్​ చేశారు శ్రీధర్​ బాబు.

"తెలంగాణలో పరిశ్రమలకు ఫ్రెండ్లీ పాలసీ ఉంది. వరల్డ్​ క్లాస్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ని రూపొందించి ప్రొగ్రెసివ్​, ఫ్యూచరిస్టిక్​ విజన్​ కోసం కృషి చేస్తున్నాము. టెస్లా వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణలో పని చేసేందుకు అనుగుణంగా పర్మిషన్​ వ్యవస్థ ఉంది," అని శ్రీధర్​ బాబు చెప్పుకొచ్చారు.

Tesla Telangana government : ఎలక్ట్రిక్​ కారు ప్లాంట్​ ఏర్పాటు కోసం టెస్లా టీమ్​ ప్రయత్నాలు చేస్తోందన్న రిపోర్టులపై బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ చేసిన ఓ ట్వీట్​కు బదులుగా.. పైన చెప్పిన వివరాలను వెల్లడించారు శ్రీధర్​ బాబు.

"టెస్లాని తెలంగాణకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయాలని కోరుతున్నాను. టెస్లా టీమ్​ హైదరాబాద్​లోకి వచ్చి, ఇక్కడి ప్రోగ్రెసివ్​ ఇండస్ట్రియల్​ పాలసీలను చూసే విధంగా చేయండి," అని ట్వీట్​ చేశారు కేటీఆర్​.

అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఇండియాలో 2-3 బిలియన్​ డాలర్ల పెట్టుబడి చేయాలని టెస్లా ప్లాన్​ చేస్తోందట!

రేసులో ఇతర రాష్ట్రాలు..

Telangana government talks with Tesla : ఇండియాలోకి టెస్లా ఎంట్రీ ఇవ్వడం అనేది నిజంగానే పెద్ద విషయం. ఎలక్ట్రిక్​ కార్లను తయారు చేసేందుకు టెస్లా ఎక్కడ ప్లాంట్​ని పెడితే.. అక్కడ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అందుకే.. చాలా రాష్ట్రాలు టెస్లాను అట్రాక్ట్​ చేస్తున్నాయి. ఈ రేసులో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్​, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఉన్నట్టు సమాచారం.

మరి ఈ రాష్ట్రాల్లో ఎలాన్​ మస్​క్​ టెస్లా టీమ్​ దేనిని ఎంచుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈవీ సెగ్మెంట్​కి ఇండియాలో ఇప్పటికే సూపర్​ డిమాండ్​ ఉంది. ఇక టెస్లా ఇండియాలోకి వస్తే.. ఈ డిమాండ్​ మరింత పెరిగే అవకాశం ఉంది. అందు తగ్గట్టుగానే కేంద్రం తన పాలసీలను మార్చుకుంటూ వస్తుండటం కూడా ఒక పాజిటివ్​ పాయింట్​. అంతేకాదు.. టెస్లా ఎంట్రీతో ఈ సెగ్మెంట్​లో ఇప్పటికే బీభత్సంగా ఉన్న పోటీ.. మరింత పెరుగుతుంది.

తదుపరి వ్యాసం