తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Most Unsafe Cars In India : ఈ కార్లు కొంటే.. ప్రాణాలు గాల్లోనే! భద్రతలో ‘0’ రేటింగ్​..

Most unsafe cars in India : ఈ కార్లు కొంటే.. ప్రాణాలు గాల్లోనే! భద్రతలో ‘0’ రేటింగ్​..

Sharath Chitturi HT Telugu

26 March 2024, 13:15 IST

    • Cars with poor safety rating : కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే.. ఇండియాలో సేఫ్టీ పరంగా దారుణంగా విఫలమైన కార్ల లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..
భద్రత విషయంలో ఈ కార్లకు 0 రేటింగ్​..!
భద్రత విషయంలో ఈ కార్లకు 0 రేటింగ్​..!

భద్రత విషయంలో ఈ కార్లకు 0 రేటింగ్​..!

Most unsafe cars in India : ఇండియాలో.. కార్లకు డిమాండ్​ విపరీతంగా పెరుగుతోంది. కొత్త కొత్త ఫీచర్స్​తో మంచి కారు కొనాలని చాలా మంది ప్లాన్​ చేస్తున్నారు. అయితే.. ఇప్పటికీ చాలా మంది ప్రైయారిటీ.. 'సేఫ్టీ'. ఇండియాలో సేఫ్టీ పరంగా బెస్ట్​ కార్లు ఏవి? అంటే టాటా పంచ్​, టాటా నెక్సాన్​, మహీంద్రా వెహికిల్స్​ గుర్తొస్తాయి. మరి.. భద్రత విషయంలో దారుణంగా ఉన్న వెహికిల్స్​ ఏవి? గ్లోబల్ ఎన్​సీఏపీ​ క్రాష్​ టెస్ట్​లో దారుణంగా విఫలమై, ప్రయాణికుల భద్రత పట్ల ఆందోళనకరంగా మారిన వాహనాలు ఏవి? ఇక్కడ తెలుసుకోండి..

సిట్రోయెన్​ ఈసీ3:-

ఫ్రెంచ్​ ఆటో సంస్థ సిట్రోన్​.. ఇండియాలో లాంచ్​ చేసిన మొదటి ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఈ సిట్టోయెన్​ ఈసీ3. కానీ.. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో దీనికి 0 స్టార్​ రేటింగ్​ వచ్చింది. గత వారమే ఈ రిజల్ట్స్​ బయటకి వచ్చాయి. అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​లో సిట్రోయెన్​ ఈసీ3కి జీరో స్టార్​ వచ్చింది. ప్యాసింజర్​ ఛేస్ట్​, డ్రైవర్​ ఛేస్ట్​ భాగాలకు ఇందులో అసలు ప్రొటెక్షనే లేదని గ్లోబల్​ ఎన్​సీఏపీ చెప్పింది. ఇక చైల్డ్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​లో కేవలం ఒక్కటే స్టార్​ దక్కించుంది ఈ ఈవీ. ఈ కారులో ఎక్కడా 3-పాయింట్​ బెల్ట్​లు లేవు. ప్యాసింజర్​ ఎయిర్​బ్యాగ్​ డిస్కనెక్షన్​ స్విచ్​ కూడా లేదు.

మారుతీ వాగన్​ఆర్​:-

Indian cars with poor safety rating : ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ హ్యాచ్​బ్యాక్స్​లో ఒకటైన వాగన్​ఆర్​ కూడా.. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో దారుణంగా విఫలమైంది. ఈ వాగన్​ఆర్​కు చైల్డ్​ ప్రొటెక్షన్​ టెస్ట్​లో జీరో రేటింగ్​ వచ్చింది. మొత్తం మీద దీనికి ఒక్కటంటే.. ఒక్కటే స్టార్​ లభించింది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్​:-

మారుతీ సుజుకీ స్విఫ్ట్​కి.. 2022లో గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ జరిగింది. పలు షాకింగ్​ విషయాలు వెలువడ్డాయి. సేఫ్టీ విషయంలో ఈ స్విఫ్ట్​ హ్యచ్​బ్యాక్​కి కేవలం 1 స్టార్​ రేటింగ్​ దక్కింది. అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​ కేటగిరీ, చైల్డ్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​ కేటగిరీల్లో.. దీనికి ఒక్కటే రేటింగ్​ దక్కింది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్​కి త్వరలోనే అప్డేటెడ్​ వర్షెన్​ రాబోతోంది. మరి దీని సేఫ్టీ రేటింగ్స్​ ఎలా ఉంటాయో చూడాలి.

మారుతీ ఎస్​-ప్రెస్సో:-

Cars with poor safety rating Global NCAP : మారుతీ ఎస్​ ప్రెస్సోకి కూడా 2022లోనే గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ జరిగింది. డ్రైవర్​- ప్యాహింజర్​ తల, మెడ వియంలో ప్రొటెక్షన్​ డీసెంట్​గానే ఉంది. కానీ డ్రైవర్​ ఛేస్ట్​లో 1 స్టార్​ మాత్రమే వచ్చింది. డ్రైవర్​ మోకాళ్ల ప్రొటెక్షన్​ కూడా అంతంత మాత్రంగానే ఉందని తేలింది.

రెనాల్ట్​ క్విడ్​:-

రెనాల్ట్​కి.. ఇండియాలో ఎంట్రీ లెవల్​ హ్యచ్​బ్యాక్​గా ఉంది క్విడ్​. సేల్స్​ పరంగా.. సంస్థకు ఇది మోస్ట్​ సక్సెస్​ఫుల్​ వెహికిల్​ అనే చెప్పుకోవాలి. కానీ.. సేఫ్టీ విషయంలో మాత్రం రెనాల్ట్​ క్విడ్​ డీలా పడింది. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ అడల్ట్​ ప్రొటెక్షన్​, చైల్డ్​ ప్రొటెక్షన్​లో కేవలం 1 స్టార్​ మాత్రే దక్కించుకుంది.

పైన చెప్పిన లిస్ట్​లోని 5 వాహనాల్లో.. 3 మారుతీ సుజుకీ సంస్థవే!

తదుపరి వ్యాసం