Tesla cars : వావ్​.. 6 నెలల్లో 10 లక్షల ఈవీలను తయారు చేసిన టెస్లా!-tesla rolls out 6 millionth ev makes one million cars in just six months ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tesla Cars : వావ్​.. 6 నెలల్లో 10 లక్షల ఈవీలను తయారు చేసిన టెస్లా!

Tesla cars : వావ్​.. 6 నెలల్లో 10 లక్షల ఈవీలను తయారు చేసిన టెస్లా!

Sharath Chitturi HT Telugu

Tesla major milestone : ప్రముఖ ఎలక్ట్రిక్​ కార్ల తయారీ సంస్థ టెస్లా సరికొత్త మైలురాయిని టచ్​ చేసింది. అంతేకాదు.. కేవలం 6 నెలల్లో 10లక్షల యూనిట్​లను తయారు చేసింది!

ఇప్పటివరకు 60లక్షల కార్లను తయారు చేసిన టెస్లా..

Tesla cars milestone : ఎలాన్​ మస్క్​కి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా.. ఓ సరికొత్త, మేజర్​ మైల్​స్టోన్​ని హిట్​ చేసింది! ఇటీవలే.. సంస్థకు చెందిన 60లక్షో యూనిట్​ రోల్​ అయ్యింది. 2008లో తొలి ఈవీ 'రోడ్​స్టర్​'ని లాంచ్​ చేసిన 16ఏళ్ల తర్వాత.. ఈ ఘనత సాధించింది టెస్లా. అంతేకాదు.. కేవలం 6 నెలల్లోనే 10 లక్షల ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ని తయారు చేసింది ఈ సంస్థ! మొదటి 10 లక్షల యూనిట్​లు తయారవ్వడానికి 12ఏళ్ల సమయం పట్టడం గమనార్హం.

సూపర్​ స్పీడ్​లో టెస్లా..!

ప్రపంచ ఈవీ సెగ్మెంట్​లో విప్లవాత్మక మార్పుల కోసం ప్రయత్నిస్తున్న టెస్లా సంస్థకు.. ఇది నిజంగానే ఒక మేజర్​ మైలురాయి. టెస్లా మోడల్​ 3, మోడల్​ ఎస్​, మోడల్​ ఎక్స్​, మోడల్​ వై ఈవీలతో సంస్థ సేల్స్​ దూసుకెళుతున్నప్పటికీ.. ఇటీవలి కాలంలో బీవైడీ వంటి ఇతర ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థల నుంచి గట్టీ పోటీని ఎదుర్కొంటోంది ఈ ఎలాన్​ మస్క్​ సంస్థ. ఈ తరుణంలో.. 60లక్షొ యూనిట్​ బయటకు వచ్చిందన్నది.. టెస్లాకు నిజంగానే ఒక పాజిటివ్​ విషయం. బీవైడీ సంస్థ.. ఇప్పటివరకు 70లక్షలు ప్లగ్​-ఇన్​ హైబ్రీడ్​ కార్స్​ని తయారు చేసినట్టు ఇటీవలే ప్రకటించింది.

Tesla Model Y : ఇక కీలక మైలురాయిని దాటడంతో.. టెస్లా ఉద్యోగులు సెలబ్రేషన్స్​ చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెస్లా వెహికిల్స్​ కొన్న ఓనర్లకు ధ్యనవాదాలు తెలుపుతూ.. ఎలాన్​ మస్క్​కి చెందిన (ఎక్స్​) ట్విట్టర్​లో ఓ పోస్ట్​ పెట్టింది సంస్థ.

తాజాగా బయటకి వచ్చిన కారు టెస్లా మోడల్​ వై అని తెలుస్తోంది. ఈ ఈవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒక బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది. ఇప్పటివరకు.. 12.3 లక్షల మోడల్​ వై యూనిట్​లను విక్రయించింది టెస్లా.

Tesla electric cars : ఇక మైలురాళ్ల విషయానికొస్తే.. టెస్లా సంస్థ.. 40 లక్షల కార్ల తయారీ మైల్​స్టోన్​ని 2023 మార్చ్​లో టచ్​ చేసింది. 50లక్షల యూనిట్​ని మైలురాయిని గతేడాది సెప్టెంబర్​లో అందుకుంది. ఇక ఇప్పుడు..60లక్షల మైలురాయిని అందుకోవడం కేవలం 6నెలల సమయాన్నే తీసుకుంది.

రానున్న రోజుల్లో కూడా.. ఎలక్ట్రిక్​ వాహనాల తయారీలో టెస్లా జోరు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే.. 70లక్షల వాహనాల మైలురాయిని తాకడానికి సంస్థకు 6 నెలల సమయం కూడా పట్టకపోవచ్చని తెలుస్తోంది.

ఇండియాలోకి టెస్లా ఎంట్రీ..!

Tesla in India : ఇక ఇండియాలో కూడా బిజినెస్​ని ఏర్పాటు చేసేందుకు టెస్లా సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ 2024లోనే టెస్లా.. ఇండియాలోకి అడుగుపెట్టొచ్చని సమాచారం. లోకల్​గా కార్లను తయారు చేసి విక్రయించేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోందట. భారత ప్రభుత్వం కూడా.. అందుకు తగ్గట్టుగానే, తన ఈవీ పాలసీకి ఇటీవలే పలు కీలక మార్పులు చేసింది.

ఇండియాలో టెస్లా ఎంట్రీ కోసం చాలా మంది చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. వారందరి నిరీక్షణకు.. 2024తో ముగింపు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సేల్స్​ పరంగా.. ఇండియాలో టెస్లా ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత కథనం