Tesla launch in India : ఇండియాలోకి టెస్లా.. గుజరాత్లో తొలి ప్లాంట్! త్వరలోనే ప్రకటన?
Tesla in India : ఇండియాలో టెస్లా ఎంట్రీకి సమయం ఆసన్నమైందని తెలుస్తోంది! గుజరాత్లో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
Tesla in India : ఇండియాలో టెస్లా ఎంట్రీపై గత కొన్ని నెలలుగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఓ వార్త బయటకి వచ్చింది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా.. 2024లో ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందని, తొలి ప్లాంట్‌ని గుజరాత్లో ఏర్పాటు చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 2024 జనవరిలో.. జరగనున్న వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో పాల్గొనేందుకు ఎలాన్ మస్క్ ఇండియాకు వస్తున్నారని, ఆ ఈవెంట్లోనే ఈ ప్రకటన చేస్తారని అంటున్నాయి.
ఇండియాలోకి టెస్లా..!
దేశంలోకి టెస్లా కార్లను తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం- ఎలాన్ మస్క్ బృందం మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళ్నాడు వంటి రాష్ట్రాలపై టెస్లా ఫోకస్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు.. గుజరాత్ ఫిక్స్ అయినట్టు నివేదికలు చెబుతునున్నాయి. ఇదే విషయంపై గుజరాత్ ప్రభుత్వ అధికార ప్రతినిధి రుషికేశ్ పటేల్ సైతం స్పందించారు. ఎలాన్ మస్క్.. గుజరాత్లో పెట్టుబడులు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
Tesla launch in India : ఇండియాలో అధిక టారీఫ్‌ల కారణంగా ఇంత కాలం.. ఇక్కడ ఒక్క టెస్లా కారును కూడా విక్రయించలేదు ఎలాన్ మస్క్. ఈ విషయంపై ప్రభుత్వం- మస్క్ మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. టారీఫ్‌లు తగ్గించాలని ఆయన అంటే.. ఇండియాలోనే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం తేల్చిచెప్పేది. ఈ క్రమంలోనే.. కొన్ని నెలల క్రితం అమెరికాకు వెళ్లిన మోదీ.. ఎలాన్ మస్క్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత.. ఇండియాలో ప్లాంట్‌ని ఏర్పాటు చేసేందుకు మస్క్ ఆసక్తి చూపించడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
ఇండియా ప్రభుత్వం కన్సెషనల్ డ్యూటీని 15శాతం తగ్గిస్తే.. రెండేళ్లల్లో 2 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు తాను సిద్ధమని మస్క్ చెబుతున్నారట. టారీఫ్, డ్యూటీ విషయంలో.. ఇప్పటివరకైతే మోదీ ప్రభుత్వం నుంచి టెస్లాకు ఎలాంటి సానూకల స్పందన లభించలేదు.
Tesla India latest news : తొలినాళ్లల్లో 20శాతం మేడ్ ఇన్ ఇండియా వాల్యూతో వాహనాలను విక్రయించాలని టెస్లా ప్లాన్ చేస్తోందట. నాలుగేళ్లల్లో దానిని 40శాతానికి పెంచాలని చూస్తోందట.
Tesla factory in Gujarat : వాస్తవానికి ఇండియాలో టెస్లా ఎంట్రీపై ఒక్కోసారి ఒక్కో వార్త వచ్చింది. మరి ఇప్పుడు.. కచ్చితంగా గుజరాత్లో ప్లాంట్ వస్తుందని సంబంధిత వర్గాలు ధీమాగా చెబుతున్నారు. మరి.. ఈ మాటలు నిజమవుతాయా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే.. వైబ్రెంట్ గుజరాత్ సదస్సు వరకు ఎదురుచూడాల్సిందే.
సంబంధిత కథనం