తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch Ev : ఇదిగో టాటా పంచ్​ ఈవీ.. సూపర్​ స్టైలిష్​- 300 కి.మీ రేంజ్​!

Tata Punch EV : ఇదిగో టాటా పంచ్​ ఈవీ.. సూపర్​ స్టైలిష్​- 300 కి.మీ రేంజ్​!

Sharath Chitturi HT Telugu

05 January 2024, 13:37 IST

google News
    • Tata Punch EV first look : టాటా పంచ్​ ఈవీ ఫస్ట్​ లుక్​ని టాటా మోటార్స్​ రివీల్​ చేసింది. స్టైలిష్​ లుక్స్​తో ఈ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ అదరగొట్టిందనే చెప్పుకోవాలి.
ఇదిగో టాటా పంచ్​ ఈవీ..
ఇదిగో టాటా పంచ్​ ఈవీ..

ఇదిగో టాటా పంచ్​ ఈవీ..

Tata Punch EV first look : ఆటోమొబైల్​ లవర్స్​ ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న టాటా పంచ్​ ఈవీపై కీలక్​ అప్డేట్! ఈ కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీకి సంబంధించిన ఫస్ట్​ లుక్​ని అఫీషియల్​గా విడుదల చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. డిజైన్​ సూపర్​ స్టైలిష్​గా, మైండ్​ బ్లోయింగ్​గా ఉందనే చెప్పుకోవాలి! ఈ నేపథ్యంలో ఈ టాటా పంచ్​ ఈవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా పంచ్​ ఈవీ వచ్చేస్తోంది..

ఎలక్ట్రిక్​ మోటార్​ కలిగిన అతి చిన్న ఎస్​యూవీగా గుర్తింపు తెచ్చుకోనుంది ఈ టాటా పంచ్​ ఈవీ. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ కోసం.. సంస్థకు చెందిన సరికొత్త జెన్​-2 ప్యూర్​ ఈవీ ప్లాట్​ఫామ్​ని ఉపయోగించే యోచనలో ఉన్నట్టు టాటా మోటార్స్​ చెప్పింది. ఒక వెహికిల్​కి భారీ మార్పులు చేసి.. ఐసీఈ నుంచి ఈవీకి మార్చడానికి వీలుగా ఈ జెన్​-2 ప్యూర్​ ఈవీ ప్లాట్​ఫామ్​ని తయారు చేసింది సంస్థ.

అంతేకాకుండా.. ఈ జెన్​-2 ప్యూర్​ ఈవీ ప్లాట్​ఫామ్​లో రూపొందించే వెహికిల్స్​ రేంజ్​ కనిష్ఠంగా 300 కి.మీలు- గరిష్ఠంగా 600 కి.మీల వరకు ఉంటుంది. అంటే.. తక్కువలో తక్కువ వేసుకున్నా.. టాటా పంచ్​ ఈవీ రేంజ్​ కనీసం 300కి.మీలైనా ఉంటుంది. ఇక కొత్త ఈవీ ప్లాట్​ఫామ్​లో సెక్యురిటీ ఆర్కిటెక్చర్​ మరింత మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా.. టాటా పంచ్​ ఐసీఈ ఇంజిన్​లానే.. టాటా పంచ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​కి కూడా క్రాష్​ టెస్ట్​లలో 5 స్టార్​ రేటింగ్​ వచ్చే అవకాశం ఉంది.

Tata Punch EV launch in India : టాటా పంచ్​ ఇప్పిటికే ఐసీఈ వర్షెన్​లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈవీ వర్షెన్​ కూడా లాంచ్​ అయితే.. రెండు వర్షెన్​లు కలిగిన రెండో టాటా వెహికల్​గా గుర్తింపు పొందుతుంది ఈ టాటా పంచ్​ ఎస్​యూవీ. నెక్సాన్​కు ఇప్పటికే ఐసీఈ, ఎలక్ట్రిక్​ వర్షెన్​లు ఉన్నాయి. ఇక టాటా టిగోర్​లో ఐసీఈ, సీఎన్​జీ, ఈవీ వర్షెన్​లు ఉన్నాయి. టాటా పంచ్​ ఈవీ లాంచ్​తో మూడు వర్షెన్​లు కలిగిన రెండో టాటా వెహికల్​గా నిలుస్తుంది.

టాటా నెక్సాన్​ ఈవీ అప్డేటెడ్​ వర్షెన్​ని గతేడాది లాంచ్​ చేసింది టాటా మోటార్స్​. దాని స్ఫూర్తితోనే.. టాటా పంచ్​ ఈవీని డిజైన్​ చేసినట్టు కనిపిస్తోంది. టాటా మోటార్స్​ షేర్​ చేసిన ఫస్ట్​ లుక్​లో.. టాటా పంచ్​ ఈవీకి కనెక్టెడ్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, స్లిమ్​ హెడ్​లైట్స్​, క్లోజ్​డ్​ గ్రిల్​, సరికొత్త అలాయ్​ డిజైన్స్​ వంటివి ఫ్రెంట్​లో వస్తున్నాయి. రేర్​లో.. కనెక్టెడ్​ ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​తో పాటు మరిన్ని స్టైలిష్​ డిజైన్స్​ కనిపిస్తున్నాయి.

Tata Punch EV price in India : టాటా పంచ్​ ఈవీలో 5 వేరియంట్లు, 2 బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్లు ఉంటాయని టాక్​ నడుస్తోంది. ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, 10.25 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 360 డిగ్రీ కెమెరా వంటివి ఉంటాయట.

లాంచ్​ ఎప్పుడు..?

వాస్తవానికి ఈ టాటా పంచ్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని గతేడాదే లాంచ్​ చేయాల్సి ఉంది. కానీ ఆలస్యమైంది. ఇక ఇప్పుడు ఫస్ట్​ లుక్​ని సంస్థ అధికారికంగా రివీల్​ చేసింది. కానీ లాంచ్​ డేట్​ని ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ఓ అప్డేట్​ వస్తుందని తెలుస్తోంది.

Tata Punch EV launch date : లాంచ్​ తర్వాత.. ఈ టాటా పంచ్​ ఈవీ.. సిట్రోయెన్​ ఈసీ3 వంటి ఎస్​యూవీలకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

తదుపరి వ్యాసం