తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Scooter : రెంట్​కి ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లు! ఇక ఎక్కడైనా తిరగొచ్చు..

Ola electric scooter : రెంట్​కి ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లు! ఇక ఎక్కడైనా తిరగొచ్చు..

Sharath Chitturi HT Telugu

01 January 2024, 11:30 IST

    • Ola electric scooter rent : ఎస్​1 రేంజ్​ ఈ-స్కూటర్ల రెంటల్​ సేవల్​ను ప్రారంభించే యోచనలో ఓలా ఎలక్ట్రిక్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సంస్థ సీఈఓ ఓ ట్వీట్​ చేశారు.
రెంట్​కి ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లు..!
రెంట్​కి ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లు..!

రెంట్​కి ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లు..!

Ola electric scooter rent : ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ మరో కొత్త ఐడియాతో భారతీయుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది! ఓలా ఈ-స్కూటర్​ రెంటల్​ సర్వీస త్వరలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ మేరకు.. ఓలా ఎలక్ట్రిక్​ సీఈఓ భవిష్​ అగర్వాల్​ చేసిన ఓ ట్వీట్​ ఇప్పుడు వైరల్​గా మారింది.

రెంట్​కి ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​..!

"పర్యాటక ప్రాంతాల్లో ఓలా ఎస్​1 ప్రాడక్ట్స్​ రెంటల్​ సర్వీస్​ మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నాము. దీనిపైన మీ స్పందనేంటి? ఏవైనా సూచలు ఇస్తారా? దేశంలోని ఏ ప్రాంతాల్లో ఈ సేవలు వినియోగించుకోవాలని మీరు అనుకుంటున్నారు?" అని ట్వీట్​ చేశారు భవిష్​ అగర్వాల్​. అంతేకాకుండా.. బెస్ట్​ కామెంట్​, సూచన చేసిన ఒకరికి ఓల్​ ఎస్​ఎక్స్​+ ఇస్తామని అన్నారు.

Ola electric rental service : ఈ ట్వీట్​ని చూస్తుంటే.. ఈ ఓలా ఎలక్ట్రిక్​ రెంటల్​ సర్వీస్​ ఐడియా ప్రస్తుతం ఎర్లీ స్టేజ్​లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ.. ఈ ఐడియా కార్యరూపం దాల్చితే మాత్రం చాలా ప్రయోజనాలు ఉంటాయని మార్కెట్​ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్​ స్కూటర్ల యాక్సెసబులిటీ, అఫార్డెబులిటీ పెరుగుతుందని అంటున్నాయి.

ఊపందుకుంటున్న రెంటల్​ బిజినెస్​..

ఇండియాలో ఈ తరహా రెంటల్​ బిజినెస్​ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. 2 వీలర్​ రెంటల్​ బిజినెస్​లోకి 2023లో ఎంట్రీ ఇచ్చింది రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ. 25 నగరాల్లో ఈ సేవలను తీసుకొచ్చింది. 300కుపైగా బైక్స్​ని అందుబాటులో ఉంచింది. ఇందుకోసం 40కిపైగా మోటర్​సైకిల్​ రెంటల్​ ఆపరేటర్స్​తో డీల్​ కుదుర్చుకుంది.

Ola electric scooters price : ఇక రాయల్​ ఎన్​ఫీల్డ్​ రెంటల్​ సర్వీస్​ బిజినెస్​ నుంచి ఓలా ఎలక్ట్రిక్​ నేర్చుకునేందుకు అవకాశం ఉంది. ఫ్లెక్సిబులిటీ, ఛార్జీలు వంటి వాటిపై ఒక క్లారిటీ రావొచ్చు.

ఇక ఈ రెంటల్​ ఐడియా అమల్లోకి వస్తే.. ఇప్పటికే అందుబాటులో ఉన్న తమ మొబైల్​ యాప్​లో ఈ సేవలను కూడా పొందుపరిచే యోచనలో ఓలా ఎలక్ట్రిక్​ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి రెంటల్​ సర్వీసులు ఊపందుకున్నాయి. చాలా మంది.. సొంతంగా ఒక బైక్స్​, స్కూటర్​​ని తీసుకుని టూర్​ని ఎంజాయ్​ చేసేందుకు ఇష్టపడుతున్నారు. గోవా, మనాలీ, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో మంచి బిజినెస్​ జరుగుతోంది.

అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఈ 2024 తొలినాళ్లల్లో ఓలా ఎలక్ట్రిక్​ నుంచి రెంటల్​ సేవలు లాంచ్​ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే సూచనలు కనిపిస్తున్నాయి.

తదుపరి వ్యాసం