Tata Nexon CNG : టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో తొలి సీఎన్జీ కారు ఇదే- లాంచ్ ఎప్పుడంటే..!
17 June 2024, 14:37 IST
- టాటా నెక్సాన్ ఐసీఎన్జీపై మంచి బజ్ నెలకొంది. ఇంకొన్ని నెలల్లో ఈ మోడల్ లాంచ్కానుంది. పూర్తి వివరాలు..
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ వచ్చేస్తోంది..!
Tata Nexon iCNG launch : భారత్ మొబిలిటీ షో 2024లో ఆవిష్కరించిన టాటా నెక్సాన్ ఐసీఎన్జీ,.. రాబోయే 6 నుంచి 8 నెలల్లో భారత మార్కెట్లో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ.. సీఎన్జీ సెగ్మెంట్లో గేమ్ ఛేంజర్‌గా నిలవనుంది. ఇది భారతదేశంలో టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో కనెక్ట్ చేసిన తొలి సీఎన్జీ వెహికిల్‌గా నిలువవనుంది. ఈ నేపథ్యంలో.. ఈ టాటా నెక్సాన్ ఐసీఎన్జీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ..
ఇండియాలో సీఎన్జీ వెహికిల్స్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. మారుతీ సుజుకీ.. ఈ సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతోంది. మారుతీ సుజుకీకి పోటీగా.. పలు మోడల్స్‌ని లాంచ్ చేసేందుకు టాటా మోటార్స్ రెడీ అవుతోంది. ఇందులో టాటా నెక్సాన్ ఐసీఎన్జీ ఒకటి.
నెక్సాన్ ఐసీఎన్జీ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. సీఎన్జీ మోడ్‌లో జనరేట్ అయ్యే పవర్, టార్క్‌ని సంస్థ ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ ఇంజిన్.. 118 బీహెచ్పీ పవర్, 170 ఎన్ఎమ్ టర్క్ని జనరేట్ చేసే అవకాశం ఉంది. టర్బోఛార్జర్, సీఎన్జీ టెక్నాలజీ కలయిక ప్రస్తుతం భారత మార్కెట్లో లేదు, సాంప్రదాయ నేచురల్లీ ఆస్పిరేటెడ్ సీఎన్జీ ఆప్షన్స్‌తో పోలిస్తే ఇది మెరుగైన పనితీరును అందిస్తుంది.
ఏదేమైనా, టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ, టాటా పంచ్ ఐసీఎన్జీ ఇప్పటికే ఉపయోగించిన 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ని.. ఈ టాటా నెక్సాన్ ఐసీఎన్జీలో కూడా వాడే అవకాశం లేకపోలేదు.
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ.. దాని పెట్రోల్ వేరియంట్లతో పోలిస్తే రూ .80,000 నుంచి రూ .1,00,000 వరకు పెరిగే అవకాశం ఉంది.
Tata Nexon CNG launch in India : టాటా నెక్సాన్ ఐసీఎన్జీలో పలు కీలక సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. సీఎన్జీ ఇంధనం నింపే సమయంలో ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసే మైక్రో స్విచ్, గ్యాస్ ఎస్కేప్లను తగ్గించడానికి సీఎన్జీ కిట్‌లోని లీక్ ప్రూఫ్ మెటీరియల్స్, ఓవర్ హీటింగ్ నుంచి రక్షించడానికి థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ వీటిలో కొన్ని కావచ్చు.
సిస్టెమ్ కంట్రోల్‌ని మెరుగుపరిచేందుకు.. టాటా నెక్సాన్ ఐసీఎన్జీలో సింగిల్, అడ్వాన్స్డ్ ఈసీయూ ఉండనుంది. డైరక్ట్ సీఎన్జీ స్టార్టింగ్, ఆటోమెటిక్ ఫ్యూయెల్ స్విచ్, మాడ్యులర్ ఫ్యూయెల్ ఫిల్టర్ డిజైన్, లీక్ డిటెక్షన్ సిస్టెమ్ వంటివి ఇంకొన్ని ఫీచర్స్‌గా ఉండొచ్చు.
నెక్సాన్ సీఎన్జీ ప్రధాన పోటీదారు మారుతి సుజుకి బ్రెజా సీఎన్జీ, ఫ్యాక్టరీ-అమర్చిన సీఎన్జీ కిట్‌తో 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్ 87బీహెచ్‌పి పవర్, 121ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్సాన్ ఐసీఎన్జీ టర్బోఛార్జ్డ్ ఆప్షన్‌తో పోలిస్తే పవర్ తక్కువే! అదనంగా, నెక్సాన్ సీఎన్జీ ట్విన్-సిలిండర్ సీఎన్జీ సెటప్ స్పేస్ ప్రయోజనాన్ని అందిస్తుంది. బ్రెజ్జా సీఎన్జీతో పోలిస్తే సుమారు 230 లీటర్ల బూట్ స్పేస్ ఇందులో ఉండనుంది.
టాటా నెక్సాన్ సీఎన్జీ వెహికిల్‌కి సంబంధించిన ఇతర వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ ఈ వెహికిల్‌పై మంచి బజ్ నెలకొంది. దీని కోసం అందరు ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు లాంచ్ టైమ్‌కి ముందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.