తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon : బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​ ఎస్​యూవీపై భారీ డిస్కౌంట్.. కొనేందుకు ఇదే రైట్​ టైమ్​!

Tata Nexon : బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​ ఎస్​యూవీపై భారీ డిస్కౌంట్.. కొనేందుకు ఇదే రైట్​ టైమ్​!

Sharath Chitturi HT Telugu

05 July 2024, 11:15 IST

google News
    • Discounts on Tata Nexon : టాటా నెక్సాన్​పై రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్​ ఇస్తోంది టాటా మోటార్స్​ సంస్థ. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్
బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్

బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటిగా ఉంది టాటా నెక్సాన్​. ఈ కారుకు మంచి డిమాండ్​ కనిపిస్తుంది. టాటా నెక్సాన్​కి సంబంధించి ఇప్పటివరకు 7లక్షల యూనిట్​లు అమ్ముడుపోయాయని టాటా మోటార్స్​ సంస్థ ప్రకటించింది. ఇక ఇప్పుడు ఈ మోడల్​పై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది సంస్థ. ఆ వివరాలను ఇక్కడ చూద్దాము..

టాటా నెక్సాన్​ ఎస్​యూవీ..

టాటా నెక్సాన్​పై లక్ష రూపాయల వరకు బెనిఫిట్స్​ అందించనున్నట్లు టాటా మోటార్స్​ ప్రకటించింది. ఇందులో క్యాష్​ బోనస్​, డిస్కౌంట్​, ఎక్స్​ఛేంజ్​ బోనస్​ వంటివి కలిపి ఉండొచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుందని కస్టమర్లు గుర్తుపెట్టుకోవాలి.

పూర్తి వివరాల కోసం మీరు మీ సమీపంలోని డీలర్​షిప్​ షోరూమ్​ని సంప్రదిస్తే మంచిది. మోడల్​ని చెక్​ చేయడంతో పాటు డిస్కౌంట్లు, ఆఫర్స్​పై ఓ క్లారిటీ వస్తుంది.

టాటా నెక్సన్​ వేరియంట్లు- ధర..

టాటా మోటార్స్ నెక్సాన్​ ఎస్​యూవీని నాలుగు వేరియంట్లలో అందిస్తోంది. అవి స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్లెస్. క్రియేటివ్- ఫియర్లెస్ ట్రిమ్​తో లభించే కాంపాక్ట్ ఎస్​యూవీలో డార్క్ ఎడిషన్ కూడా ఉంది.

ఇక టాటా నెక్సాన్​లో రెండు ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. టర్బో పెట్రోల్ ఇంజిన్ 118బీహెచ్​పీ పవర్, 170ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, కొత్త 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్​తో వస్తుంది. డీజిల్ ఇంజిన్ 113బీహెచ్​పీ పవర్, 260ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఏఎమ్​టీ గేర్ బాక్స్​ను పొందుతుంది.

ఇదీ చూడండి:- Best SUVs in India: హ్యాచ్​బ్యాక్​ నుంచి ఎస్​యూవీకి అప్​గ్రేడ్​ అవ్వాలా? రూ. 7లక్షల బడ్జెట్​లో ఇవి బెస్ట్​!

డిస్కౌంట్లను మినహాయిస్తే టాటా నెక్సాన్ ధర రూ .8 లక్షల నుంచి ప్రారంభమై రూ .15.80 లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూమ్.

టాటా నెక్సాన్​ సీఎన్​జీ వచ్చేస్తోంది..!

భారత్ మొబిలిటీ షో 2024లో ఆవిష్కరించిన టాటా నెక్సాన్ ఐసీఎన్​జీ రాబోయే 6 నుంచి 8 నెలల్లో భారత మార్కెట్​లో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ కాంపాక్ట్ ఎస్​యూవీ.. సీఎన్​జీ సెగ్మెంట్​లో గేమ్ ఛేంజర్​గా నిలవనుంది. ఇది భారతదేశంలో టర్బోఛార్జ్​డ్ పెట్రోల్ ఇంజిన్​తో కనెక్ట్​ చేసిన తొలి సీఎన్​జీ వెహికిల్​గా నిలువవనుంది.

ఇండియాలో సీఎన్​జీ వెహికిల్స్​ మార్కెట్​ గణనీయంగా వృద్ధి చెందుతోంది. మారుతీ సుజుకీ ఈ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతోంది. మారుతీ సుజుకీకి పోటీగా పలు మోడల్స్​ని లాంచ్​ చేసేందుకు టాటా మోటార్స్​ రెడీ అవుతోంది. ఇందులో టాటా నెక్సాన్​ ఐసీఎన్​జీ ఒకటి.

ఏదేమైనా, టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్​జీ, టాటా పంచ్ ఐసీఎన్​జీ ఇప్పటికే ఉపయోగించిన 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్​ని ఈ టాటా నెక్సాన్​ ఐసీఎన్​జీలో కూడా వాడే అవకాశం లేకపోలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం