Tata Nexon vs Kia Sonet: టాటా నెక్సాన్ వర్సెస్ కియా సోనెట్: ఈ రెండింటిలో ఏది కొనడం మంచిది?-tata nexon vs kia sonet which one should you buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Nexon Vs Kia Sonet: టాటా నెక్సాన్ వర్సెస్ కియా సోనెట్: ఈ రెండింటిలో ఏది కొనడం మంచిది?

Tata Nexon vs Kia Sonet: టాటా నెక్సాన్ వర్సెస్ కియా సోనెట్: ఈ రెండింటిలో ఏది కొనడం మంచిది?

HT Telugu Desk HT Telugu
Jun 28, 2024 04:17 PM IST

సబ్ కంపాక్ట్ ఎస్ యూ వీ కేటగిరీలో మార్కెట్లో అగ్ర స్థానంలో ఉన్నవి కియా సోనెట్, టాటా నెక్సాన్. ఈ రెండు ఎస్ యూవీలు వినియోగదారుల నుంచి మంచి ఆదరణను పొందుతున్నాయి. వీటిలో సోనెట్ ధర (ఎక్స్ షో రూమ్) రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాటా నెక్సాన్ ధర (ఎక్స్ షో రూమ్) రూ. 8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టాటా నెక్సాన్ వర్సెస్ కియా సోనెట్
టాటా నెక్సాన్ వర్సెస్ కియా సోనెట్

భారతదేశంలో సబ్-కాంపాక్ట్ ఎస్ యూవీ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. వీటిలో టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి షో స్టాపర్ మోడళ్లు ఉన్నాయి, ఇవి భారతదేశ యువతలో విస్తృత ప్రజాదరణ పొందాయి. టాటా నెక్సాన్ చాలా కాలంగా సెగ్మెంట్లోనే కాదు, మొత్తం ఎస్ యూవీ విభాగంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్ యూవీగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో కొత్తగా సోనెట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ లాంచ్ అయింది. దీన్ని కొన్ని లేటెస్ట్ ఫీచర్లతో అప్ గ్రేడ్ చేశారు.

ఏడేళ్లలో ఏడు లక్షల కార్ల అమ్మకం

ఏడేళ్ల కాలంలో భారతదేశంలో నెక్సాన్ (Tata Nexon) ఎస్ యూవీ ఏడు లక్షల యూనిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది. అదే సమయంలో, కియా సోనెట్, కియా సెల్టోస్ ఎస్యూవీలు కలిసి 2024 మేలో 3.9 శాతం వార్షిక అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. మే నెలలో కియా లైనప్ నుండి 7,433 యూనిట్లు అమ్ముడుపోగా, అందులో అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా సోనెట్ (Kia Sonet) నిలిచింది. టాటా నెక్సాన్, కియా సొనెట్ ల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఇక్కడ ఉన్నాయి.

కియా సోనెట్ వర్సెస్ టాటా నెక్సాన్

కియా సోనెట్ ఇంజన్ ఆప్షన్స్

కియా సోనెట్ మూడు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. అవి 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లు. 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి 82 బీహెచ్పీ, 115 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ ఐఎమ్ టీ లేదా 7-స్పీడ్ డీసీటీతో జతచేయబడి 118 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 172 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. డీజిల్ యూనిట్ 114 బీహెచ్పీ, 250 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది.

టాటా నెక్సాన్ ఇంజన్ ఆప్షన్స్

టాటా నెక్సాన్ అప్డేటెడ్ పవర్ట్రెయిన్ తో వస్తుంది. ఇందులో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది నాలుగు వేర్వేరు గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి 5-స్పీడ్, లేదా 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎమ్టీ), 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ (DCT). టాటా నెక్సాన్ డీజిల్ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్ టీతో వస్తుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 118 బీహెచ్ పీ పవర్, 170 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 డీజల్ ఇంజన్ 113 బీహెచ్ పీ పవర్, 260 ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.

కియా సోనెట్ సేఫ్టీ ఫీచర్స్

కియా సోనెట్ కారులో ఆరు ఎయిర్ బ్యాగులతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్ సిస్టమ్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా వంటి ఇతర స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందించారు. కియా సోనెట్ 2024 అప్డేటెడ్ వర్షన్ లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ను పొందుపర్చారు. ఇది లేన్ డ్రైవింగ్ అసిస్టెన్స్, ఫ్రంటల్ కొలిషన్ అవాయిడెన్స్, లీడ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

టాటా నెక్సాన్ సేఫ్టీ ఫీచర్స్

టాటా నెక్సాన్ లో ఆరు ఎయిర్ బ్యాగులు, బ్లైండ్ స్పాట్ మానిటర్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, చైల్డ్ సీట్ల కోసం ఐసోఫిక్స్ యాంకర్లు, యాంటీ థెఫ్ట్ ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. టాటా నెక్సాన్ కు గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది.

కియా సోనెట్ ఇతర ఫీచర్లు

కియా సోనెట్ (Kia Sonet) వెనుక సీట్లు కొంత పరిమితంగా ఉంటాయి. అందువల్ల కొత్త తరం సోనెట్ లో ముందు సీట్లను రెండవ వరుసకు ఎక్కువ లెగ్ రూమ్ అందించడానికి వీలుగా సర్దుబాటు చేశారు. అయినప్పటికీ, ఇది కొంత ఇరుకైన ఫీలింగ్ నే కలిగిస్తుంది. ఎంపిక చేసిన వేరియంట్లలో వెంటిలేటెడ్ సీట్లు ఉండే ప్రీమియం ఇంటీరియర్ ఆప్షన్ లభిస్తుంది.

టాటా నెక్సాన్ ఇతర ఫీచర్స్

టాటా నెక్సాన్ (Tata Nexon) లో సీటింగ్ దాని మునుపటి తరం కంటే మెరుగుపడింది. ఫ్రంట్ సీట్లకు మెరుగైన కుషన్ లభిస్తుంది. వెనుక సీట్లు కూడా కంఫర్టబుల్ గానే ఉంటాయి. మధ్య సీట్లకు కూడా మూడు పాయింట్ల సీట్ బెల్ట్ లభిస్తుంది. అయితే వెనుక సీట్లలో లెగ్ రూమ్ తగినంత విశాలంగా లేకపోవడంతో పొడవైన వారు కూర్చుంటే కొంత ఇబ్బంది పడుతారు. టాటా నెక్సాన్ లో కూడా ఎంపిక చేసిన మోడళ్లలో వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి.

కియా సోనెట్ ఇన్ఫోటైన్ మెంట్

కియా సోనెట్ లో ఫోర్ వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్లు, ముందు వరుసలో ప్రత్యేకంగా వెంటిలేటెడ్ సీట్లు లభిస్తాయి. క్యాబిన్ లో ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ తో పాటు బోస్ నుంచి ఏడు స్పీకర్ల సెటప్ ను అందించారు. ఇంటీరియర్ ఎల్ఈడీ యాంబియంట్ లైట్లతో ఉంది. ముందు భాగంలో రెండు 10.25 అంగుళాల డిజిటల్ డిస్ప్లేలు ఉన్నాయి. ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా డ్రైవర్ 360 డిగ్రీల, బ్లైండ్ స్పాట్ కెమెరాలను పర్యవేక్షించగలడు. ఈ కారులో వైర్ లెస్ ఛార్జింగ్ స్లాట్, రియర్ ఏసీ వెంట్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఇన్ఫోటైన్ మెంట్

టాటా నెక్సాన్ లో కంఫర్ట్ తో పాటు డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ స్థాయిని పెంచే అనేక ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే రెండింటికీ వైర్లెస్ కనెక్టివిటీతో పాటు వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ ఉంది. ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ ప్రొఫైల్స్ అందించే జేబీఎల్ సౌండ్ సిస్టమ్, వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్ కూడా ఇందులో ఉన్నాయి. డ్యాష్ బోర్డులో రెండు 10.25 అంగుళాల డిస్ప్లే యూనిట్లు ఉన్నాయి, ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో నావిగేషన్ మ్యాప్ ను ఉపయోగించుకోవచ్చు. టాటా మోటార్స్ క్యాబిన్ లో కూల్డ్ గ్లోవ్ కంపార్ట్ మెంట్ తో పాటు రియర్ ఏసీ వెంట్ లను కూడా అందిస్తుంది.

Whats_app_banner