Volkswagen Tharu XR : ‘థారు ఎక్స్​ఆర్​’- వోక్స్​వ్యాగన్​ కొత్త ఎస్​యూవీ ఇదే..-volkswagen tharu xr suv revealed for china will it make its way to india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Volkswagen Tharu Xr : ‘థారు ఎక్స్​ఆర్​’- వోక్స్​వ్యాగన్​ కొత్త ఎస్​యూవీ ఇదే..

Volkswagen Tharu XR : ‘థారు ఎక్స్​ఆర్​’- వోక్స్​వ్యాగన్​ కొత్త ఎస్​యూవీ ఇదే..

Sharath Chitturi HT Telugu
Jun 21, 2024 06:10 AM IST

Volkswagen Tharu XR SUV : కొత్త వోక్స్​వ్యాగన్ థారు ఎక్స్​ఆర్​ని చైనాలో ఆవిష్కరించింది సంస్థ. దీని ఫిచర్స్​తో పాటు.. ఈ ఎస్​యూవీ ఇండియాలో లాంచ్​ అవుతుందా? లేదా? అనేది ఇక్కడ తెలుసుకోండి..

వోక్స్​వ్యాగన్​ థారు ఎక్స్​ఆర్​ ఇదే..
వోక్స్​వ్యాగన్​ థారు ఎక్స్​ఆర్​ ఇదే..

Volkswagen Tharu XR price in India : వోక్స్​వ్యాగన్ కొత్త ఎస్​యూవీని చైనాలో మార్కెట్​లో ఆవిష్కరించింది. దాని పేరు​ థారు ఎక్స్​ఆర్. చైనాలో అమ్ముడవుతున్న చిన్న టి-క్రాస్, థారు మధ్యలో ప్లేస్​ అయ్యి ఉంటుంది ఈ కొత్త వోక్స్​వ్యాగన్ థారు ఎక్స్​ఆర్. అయితే ఇది భారత్​ మార్కెట్​లో వోక్స్​వ్యాగన్​ టైగన్​లా అనిపిస్తుంది. కాకపోతే.. ఈ కొత్త ఎస్​యూవీ పొడవు కాస్త ఎక్కువ! థారు ఎక్స్ఆర్ ఎంక్యూబీ ఏ0 ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది. వీడబ్ల్యు టైగన్, విర్టస్​, స్కోడా కుషాక్, స్లావియాతో సహా అనేక వాహనాలను ఇదే ప్లాట్​ఫామ్​పై రూపొందిస్తోంది సంస్థ.

వోక్స్​వ్యాగన్ థారు ఎక్స్​ఆర్: టైగన్​తో దీనికున్న తేడా ఏంటి?

టైగన్​తో పోలిస్తే.. కొత్త వోక్స్​వ్యాగన్ థారు ఎక్స్​ఆర్.. అదే 2,651 ఎంఎం వీల్ బేస్​ను పొందుతుంది. అయితే, చైనా-నిర్దిష్ట మోడల్ 134 ఎంఎం పొడవు ఎక్కువగా ఉంటుంది. దీని మొత్తం పొడవు 4,355ఎంఎం. రేర్​ వీల్​ అనంతరం పెద్ద రేర్​ ఓవర్ హాంగ్, రేర్​ విండ్ స్క్రీన్ టెయిల్ గేట్​తో ఈ అదనపు పొడవు వస్తుంది.

థారు ఎక్స్​ఆర్​..
థారు ఎక్స్​ఆర్​..

Volkswagen Tharu XR price in India on road : వోక్స్​వ్యాగన్ థారు ఎక్స్​ఆర్ మరింత ఫ్యూచరిస్టిక్​గా కనిపిస్తుంది. కొత్త ఎల్ఈడీ హెడ్​ల్యాంప్స్ మరింత స్టైలిష్​గా ఉంటాయి. ఎల్ఈడీ డీఆర్ఎల్ ఫేస్​ వెడల్పుగా ఉంటుంది. ర్యాప్ రౌండ్ టెయిల్ లైట్లు రెండు యూనిట్లకు కనెక్ట్ చేసే లైట్ బార్​తో ట్రాన్సపరెంట్​ లెన్స్​లను పొందుతాయి. బ్రష్డ్ అల్యూమినియంలో ఫినిష్ చేసిన ప్లాస్టిక్స్​తో వెనుక బంపర్ కూడా కాస్త పెద్దగా ఉంటుంది.

వోక్స్​వ్యాగన్ థారు ఎక్స్​ఆర్ స్పెసిఫికేషన్లు..

థారు ఎక్స్​ఆర్ ఎస్​యూవీలో 1.5-లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. టాప్-స్పెక్ వేరియంట్లు 158బీహెచ్​పీ పవర్, 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తాయి. డీఎస్​జీ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ ఆప్షన్​ కూడా ఉంది. మేన్యువల్ గేర్​బాక్స్​ కూడా అందించే అవకాశం ఉంది. వోక్స్​వ్యాగన్ చైనా.. థారు ఎక్స్​ఆర్​లోని కేబిన్​ను ఇంకా వెల్లడించలేదు.  కొన్ని కాస్మొటిక్ డిఫరెన్సెస్​ని మినహాయిస్తే.. ఈ కొత్త ఎస్​యూవీ.. ఇండియా-స్పెక్ టైగన్​తో లేఅవుట్, ఫీచర్లను పంచుకుంటుందని తెలుస్తోంది. అదనపు పొడవును పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఎస్​యూవీ ఇండియా-స్పెక్ టైగన్​లో 385-లీటర్ బూట్ సామర్థ్యం కంటే పెద్ద స్పేస్​ని ఇస్తుంది.

Volkswagen Tharu XR vs Taigun : ఎస్ఏఐసీ-వోక్స్​వ్యాగన్ నిర్మించిన థారు ఎక్స్ఆర్ ప్రస్తుతం చైనాలో మాత్రమే విక్రయించనున్నారు. వోక్స్​వ్యాగన్ ఇండియా ఎక్స్​ఆర్​ను ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం లేదు. కానీ.. ఈ ఎక్స్​ఆర్​తో టైగన్​ అప్డేటెడ్​ వర్షెన్​ ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇది ఇంకొన్నేళ్లల్లో ఇండియాలో లాంచ్​ కావాల్సి ఉంది.

ఈ వోక్స్​వ్యాగన్​ థారు ఎక్స్​ఆర్​ ఎస్​యూవీ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. చైనాలో రిలీజ్​ అయ్యే ఈ మోడల్​ ధర వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం