Volkswagen Electric SUV : వోక్స్వ్యాగన్ నుంచి సరికొత్త ఎంట్రీ లెవల్ ఎస్యూవీ..!
Volkswagen Electric SUV : వోక్స్వ్యాగన్ సంస్థ నుంచి కొత్త ఎంట్రీ లెవల్ ఈవీ సిద్ధమవుతోంది. ఈ మోడల్ రేంజ్, లాంచ్ టైమ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Volkswagen Electric SUV : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ వోక్స్వ్యాగన్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ రాబోతోంది. ఇది.. ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరలను ఇక్కడ తెలుసుకుందము..
వోక్స్వ్యాగన్ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్..
వోక్స్వ్యాగన్ ఎంట్రీ లెవల్ ఈవీకి చెందిన ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. చూస్తుంటే.. ఈ మోడల్ ప్రొడక్షన్‌కి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎంఈబీ ఎంట్రీ ప్లాట్‌ఫామ్‌పై సంస్థ దీనిని రూపొందిస్తోంది. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ పేరును సంస్థ ఇంకా రివీల్ చేయలేదు.
Volkswagen new electric SUV : ఈ ఎస్యూవీ డిజైన్ బోల్డ్‌గా ఉంటుందని తెలుస్తోంది. సేఫ్టీ, బోల్డ్నెస్, సింప్లిసిటీని దృష్టిలో పెట్టుకుని తమ ఈవీలను రూపొందిస్తున్నట్టు వోక్స్వ్యాగన్ డిజైన్ హెడ్ ఆండ్రెస్ మిండ్ట్ ఇటీవలే తెలిపారు.
ఇక కొత్త ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వెహికిల్ పొడవు 4,100ఎంఎం. వీల్ బేస్ 2,600ఎంఎంగా ఉండొచ్చు. 490 లీటర్స్ బూట్ స్పేస్ ఇందులో ఉంటుందట.
ఇక ఇంటీరియర్ విషయానికొస్తే.. ఈ ఎస్‌యూవీలో 12.9 ఇంచ్ భారీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 10.9 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉంటుందని సమాచారం. క్లైమేట్, ఆడియో కంట్రోల్స్ కోసం ఫిజికల్స్ వస్తాయని తెలుస్తోంది.
కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ ఎప్పుడు? రేంజ్ ఎంత?
Volkswagen new Electric vehicle : వోక్స్వ్యాగన్ కొత్త ఈవీలో సింగిల్ మోటర్ ఉంటుంది. ఇది 223 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 38 కేడబ్ల్యూహెచ్, 56 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. పెద్ద బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. వెహికిల్తో 450కి.మీల దూరం ప్రయాణించవచ్చని సమాచారం. అంతేకాకుండా.. 125 కేడ్ల్యూ ఛార్జిర్తో 10-80శాతం ఛార్జింగ్‌ని కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు.
వోక్స్వ్యాగన్ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2024 సంస్థ రివీల్ చేయనుంది. కారు ప్రొడక్షన్ 2025లో మొదలవ్వొచ్చు. 2026లో ఈ మోడల్ లాంచ్ అవుతుందని టాక్ నడుస్తోంది. తొలుత.. యూరోపియన్ మార్కెట్లోకి ఈ వెహికిల్ ఎంట్రీ ఇస్తుంది.
అయితే.. దీని కన్నా ముందే.. ఓ ఎంట్రీ లెవల్ ఈవీ హ్యాచ్‌బ్యాక్‌ని సంస్థ లాంచ్ చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
సంబంధిత కథనం