Mahindra cars : మహీంద్రా క్రేజీ లైనప్.. త్వరలో లాంచ్‌కానున్న ఎస్‌యూవీలు ఇవే!
New Mahindra cars : 2024లో.. మహీంద్రా సంస్థ నుంచి కొన్ని వాహనాలు లాంచ్కానున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
New Mahindra cars : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో మహీంద్రా అండ్ మహీంద్రాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు! స్టైలిష్ డిజైన్, సూపర్ ఫీచర్స్‌తో వచ్చే ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇక ఈ క్రేజ్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేందుకు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో 2024లో కొన్ని వెహికిల్స్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మహీంద్రా 5- డోర్ థార్..
ఇండియా ఆఫ్ రోడ్ వెహికల్స్‌లో మహీంద్రా థార్‌కు క్రేజీ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు 5 డోర్ థార్‌ని సిద్ధం చేస్తోంది. ఇది స్పేషియస్గా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ వెహికిల్‌కి సంబంధించి.. ఇప్పటికే అనేకమార్లు టెస్ట్ డ్రైవ్ కూడా జరిగింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్స్‌లో ఈ ఎస్యూవీ అందుబాటులోకి వస్తుందని సమచారం. లాంచ్ తర్వాత ఈ వెహికిల్.. మారుతీ సుజుకీ జిమ్నీకి గట్టిపోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్..
Mahindra Xuv300 facelift : ప్రస్తుతం ఉన్న ఎస్‌యూవీలకు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని తీసుకొచ్చేందుకు మహీంద్రా సంస్థ ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా.. తొలుత.. ఎక్స్‌యూవీ300కి ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూకి గట్టిపోటీనిచ్చే ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ300లో డిజైన్ పరంగా భారీ మార్పులే జరిగే అవకాశం ఉంది. ఇంజిన్‌లో ఎలాంటి మార్పు జరగకపోవచ్చు. ఈ మోడల్ ప్రస్తుతం టెస్ట్ రన్ దశలో ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఫేస్‌లిఫ్ట్..
Mahindra XUV400 faceilift : ఇండియా ఆటోమొబైల్ రంగంలోని ఈవీ సెగ్మెంట్లో మహీంద్రా అండ్ మహీంద్రాకు ఉన్న ఏకైక మోడల్ ఎక్స్‌యూవీ400. ఇక ఇప్పుడు దీనికి కూడా ఒక ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రాబోతోందని సమచారం. టాటా నెక్సాన్ ఈవీతో ఇప్పటికే ఉన్న పోటీని మరింత పెంచే విధంగా ఈ ఫేస్‌లిఫ్ట్ ఉండబోతోందని తెలుస్తోంది. బ్యాటరీ పరంగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కానీ.. డిజైన్‌లో మాత్రం పలు ఆసక్తికర మార్పులు ఉండొచ్చు.
మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ8 ఈవీ..
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ.. ఈవీలపై గట్టిగానే ఫోకస్ చేసింది. ఇప్పటికే.. ఐదు ఈవీలకు సంబంధించిన కాన్సెప్ట్ మోడల్స్‌ని రిలీజ్ చేసింది. వీటి లాంచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీటిల్లో.. తొలుత ఎక్స్‌యూవీ.ఈ8 బయటకు వస్తుందని సమాచారం. 2024లోనే ఇది లాంచ్ అవుతుందని టాక్ నడుస్తోంది. ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీకి ఎలక్ట్రిక్ వర్షెన్లా ఉండే ఈ ఈవీలో 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండొచ్చు!
ఈ వాహనాలకు సంబంధించిన ఫీచర్స్, లాంచ్ డేట్‌పై స్పష్టత రావాల్సి ఉంది.
సంబంధిత కథనం