MG Cloud EV : ఎంజీ క్లౌడ్​ ఈవీ.. ఇండియాలో లాంచ్​కు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ రెడీ!-mg cloud ev likely to hit market by september 2024 see full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Cloud Ev : ఎంజీ క్లౌడ్​ ఈవీ.. ఇండియాలో లాంచ్​కు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ రెడీ!

MG Cloud EV : ఎంజీ క్లౌడ్​ ఈవీ.. ఇండియాలో లాంచ్​కు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ రెడీ!

Sharath Chitturi HT Telugu
Jun 18, 2024 01:45 PM IST

MG Cloud EV launch : అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఎంజీ క్లౌడ్​ ఈవీ.. ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇదిగో ఎంజీ క్లౌడ్​ ఈవీ..
ఇదిగో ఎంజీ క్లౌడ్​ ఈవీ..

MG Cloud EV India : ఇండియాలో ఈవీ సెగ్మెంట్​కి ఉన్న భారీ డిమాండ్​ని క్యాష్​ చేసుకునేందుకు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ఎంజీ మోటార్​ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. ప్రతి 3-6 నెలలకు ఒక కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ మోడల్​ని లాంచ్​ చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఈ నేపథ్యంలో.. ఈ సెప్టెంబర్​ నాటికి ఇండియాలో ఒక ఎంజీ మోటార్​ ఈవీ లాంచ్​ అవుతుందని సమాచారం. దాని పేరు ఎంజీ క్లౌడ్​ ఈవీ! ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎంజీ కామెట్​, ఎంజీ జెడ్​ఎస్​ ఈవీల సరసన ఈ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఎంజీ క్లౌడ్​ ఈవీ..

ఈ ఎంజీ క్లౌడ్​ ఈవీ ఎక్స్​షోరూం ధర రూ. 20లక్షల కన్నా తక్కువగానే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. బ్యాటరీ ప్యాక్​తో సహా ఈవీకి కావాల్సిన పరికరాలను చాలా వరకు స్థానికంగానే తయారు చేయాలని సంస్థ ప్లాన్​ చేస్తోందట. ఇలా చేస్తే.. ధర గణనీయంగా దిగొస్తుంది. ఫలితంగా.. టాటా నెక్సాన్​ ఈవీ, బీవైడీ ఈ6, మహీంద్రా ఎక్స్​యూవీ 400 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలకు పోటీగా వచ్చే ఈ ఎంజీ క్లౌడ్​ ఈవీ ధర కాస్త తక్కువగానే ఉండొచ్చు.

ఈ ఎంజీ క్లౌడ్​ ఈవీ టెస్ట్​ డ్రైవ్స్​ ఇటీవలే జరిగాయి. ఇందుకు సంబంధించిన స్పై షాట్స్​ కూడా లీక్​ అయ్యాయి. ఫలితంగా.. రేపే, మాపో ఈ ఈవీ లాంచ్​ అవ్వడం ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి.

MG Cloud EV interior : ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో కాంప్యాక్ట్​ డిజైన్​ ఉండనుంది. పొడవు 4,300ఎంఎంగా ఉండొచ్చు. కియా క్యారెన్స్​, మారుతీ సుజుకీ ఎర్టిగాల కన్నా కాస్త చిన్నది అవుతుంది. వీల్​బేస్​ 2,700ఎంఎం ఉండొచ్చు.

ఎంజీ క్లౌడ్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో మాడెర్న్​ డిజైన్​ ఉండనుంది. ఫ్రెంట్​లో ఫుల్​ ఎల్​ఈడీ లైట్​ బార్​, క్లోజ్​డ్​ గ్రిల్​ ఉండనున్నాయి. ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్​, వైడ్​ ఎయిర్​ డ్యామ్​ ఉంటాయి.

మరోవపు ఈ ఈవీ ఇంటీరియర్​లో మినిమలిస్ట్​ డిజైన్​ కనిపించొచ్చు. డాష్​బార్డ్​, డోర్​ ట్రిమ్స్​ మీద హారిజాంటల్​ లైన్స్​ వస్తాయి. డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ కోసం భారీ డ్యూయెల్​ స్క్రీన్​ సెటప్​ ఉండొచ్చు.

MG Cloud EV launch in India : వీటితో పాటు.. ఈ ఎంజీ క్లౌడ్​ ఈవీలో హారిజాంటల్లీ పొజీషన్డ్​ ఏసీ వెంట్స్​, కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీ, పానారోమిక్​ సన్​రూఫ్​, క్లైమేట్​ కంట్రల్​, పవర్డ్​ సీట్స్​, 360 డిగ్రీ కెమెరా, అడాస్​ సేఫ్టీ ఫీచర్స్​ ఉంటాయి.

అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఎంజీ క్లౌడ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో రెండు బ్యాటరీ ప్యాక్స్​ ఉంటాయి. అవి.. 37.9 కేడబ్ల్యూహెచ్​, 50.6 కేడబ్ల్యూహెచ్​. ఇవి 360 కి.మీలు, 460 కి.మీల రేంజ్​ని ఇస్తాయి. ఫ్రెంట్​ మౌంటెడ్​ పర్మనెంట్​ మ్యాగ్నెట్​ సిక్రోనియస్​ మోటార్​కి బ్యాటరీ కనెక్ట్​ అయ్యి ఉంటుంది. ఇది.. 132 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది.

MG Cloud EV : మరి ఈ రెండు బ్యాటరీల్లో రెండూ ఇండియాలో అందుబాటులో ఉంటాయా? లేక ఒకటి వస్తుందా? లేక కొత్త ఆప్షన్​ ఏదైనా ఉంటుందా? అన్నది చూడాలి.

ఈ ఎంజీ క్లౌడ్​ ఈవీపై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే ఓ అప్డేట్​ వచ్చే అవకాశం ఉందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం