Bajaj Chetak 2901: భారత్ లో సరికొత్త బజాజ్ చేతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్; ధర కూడా అందుబాటులోనే..
Bajaj Chetak 2901: ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లోకి కాస్త ఆలస్యంగానే ప్రవేశించిన బజాజ్ చేతక్.. పలు ఎలక్ట్రిక్ మోడల్స్ ను వరుసగా లాంచ్ చేస్తోంది. తాజాగా, బజాజ్ చేతక్ 2901 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. ఈ బైక్ రెడ్, వైట్, బ్లాక్, లైమ్ ఎల్లో, అజూర్ బ్లూ కలర్ లలో లభిస్తుంది.
Bajaj Chetak 2901: బజాజ్ ఆటో తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పోర్ట్ ఫోలియోను విస్తరించింది. లేటెస్ట్ గా చేతక్ 2901 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.95,998గా ఉంది. కొత్త బజాజ్ చేతక్ 2901ను ఇప్పుడు ఆన్ లైన్ లో బజాజ్ ఆటో అధికారిక వెబ్ సైట్లో బుక్ చేసుకోవచ్చు. బైక్ వివరాలు, టెస్ట్ రైడ్స్, బుకింగ్ ల కొరకు కస్టమర్లు సమీప షోరూమ్ ని కూడా సందర్శించవచ్చు.
జూన్ 15 నుంచి డెలివరీలు
బజాజ్ చేతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీలు జూన్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. బజాజ్ చేతక్ 2901 బైక్ రెడ్, వైట్, బ్లాక్, లైమ్ ఎల్లో, అజూర్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏఆర్ఏఐ క్లెయిమ్ చేసిన 123 కిలోమీటర్ల పరిధితో వస్తుంది. చేతక్ 2901 బైక్ లో కలర్ డిజిటల్ కన్సోల్, ట్యూబ్ లెస్ టైర్లతో అల్లాయ్ వీల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కస్టమర్లు టెక్ ప్యాక్ తో ఈ ఫీచర్లను అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. టెక్ ప్యాక్ లో హిల్ హోల్డ్, రివర్స్, స్పోర్ట్ అండ్ ఎకానమీ మోడ్స్, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ లైట్స్, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
బజాజ్ చేతక్ లైనప్
బజాజ్ ఆటో ప్రస్తుతం చేతక్ డీలర్ షిప్ నెట్ వర్క్ ను విస్తరించే పనిలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు భారతదేశం అంతటా 500 కి పైగా డీలర్ షిప్ లలో అందుబాటులో ఉన్నాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇప్పుడు ప్రీమియం, అర్బనే, 2901 అనే మూడు వేరియంట్లలో అందిస్తోంది. ప్రీమియం అత్యంత ఖరీదైనది కాగా, ఈ లైనప్ లో 2901 స్కూటర్ అత్యంత సరసమైనది.
మెటల్ బాడీతో ఆకర్షణీయమైన డిజైన్ తో..
మెటల్ బాడీతో ఆకర్షణీయమైన డిజైన్ తో బజాజ్ చేతక్ 2901 ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకువస్తున్నామని బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ తెలిపారు. పెట్రోల్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారి ఆకాంక్షలకు అనుగుణంగా, పెట్రోల్ స్కూటర్ ఇచ్చే అన్ని సదుపాయాలతో ఈ చేతక్ 2901 ఎలక్ట్రిక స్కూటర్ ను రూపొందించామన్నారు. జూన్ 15 నుంచి వినియోగదారులకు డెలివరీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.