Price diesel price : త్వరలోనే పెట్రోల్- డీజిల్ ధరలు పెంపు!
Petrol price hike : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
Petrol Diesel price hike : 2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఎన్నిల ఫలితాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత ప్రజలపై భారీ పిడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి! ఎన్నికల కారణంగా గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న నిత్యావసర ధరలు రానున్న రోజుల్లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. పెట్రోల్- డీజిల్ విషయంలో ప్రజలు షాక్ తగలొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
పెట్రోల్- డీజిల్ ధరలు పెరుగుతాయా?
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఈ ఏడాది మార్చ్‌లో తగ్గించింది ప్రభుత్వం. లీటరుకు రూ. 2 తగ్గింపు ఇచ్చింది. సవరించిన ధరలు మార్చ్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నారని, మోదీ ప్రభుత్వంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనా.. ప్రజలపై కాస్త భారం తగ్గినట్టు అయ్యింది.
Petrol price hike : కానీ మంగళవారంతో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి అవ్వనుండటంతో.. ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఇప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవచ్చని, కానీ నిదానంగా ఎప్పుడైనా పెరుగుతాయని సమాచారం. పెంపు మాత్రం కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా అంతర్జాతీయ ముడిచెమరు ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పైగా.. 2025లో కూడా చమురు ఔట్‌పుట్‌ని కట్ చేయాలని ఒపెక్+ దేశాలు నిర్ణయించాయి. ఫలితంగా.. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఇక ఇండియా విషయానికొస్తే.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రభావం పంప్ ఓనర్స్‌పై భారీగా పడినట్టు తెలుస్తోంది. పాత సరకును తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చింది. అందుకే.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తమకు మంచి పరిణామం అని అంటున్నారు.
Diesel price hike : పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా పలు ఇతర విషయాల్లో కూడా వినియోగదారులపై భారం పెరిగే అవకాశం ఉంది. టారీఫ్ హైక్ కోసం టెలికాం సంస్థలు రెడీ అవుతున్నాయి. అమూల్ సంస్థ.. తమ పాల ప్యాకెట్ ధరలను తాజాగా పెంచింది.
టోల్ ఛార్జీలు కూడా పెరిగాయి..!
Toll charges hike : ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని టోల్ ఛార్జీల పెంపు వాయిదా వేసిన కేంద్రం... జూన్ 3 నుంచి ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు పెరిగాయి. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు...నిర్వహణ సంస్థ ఐఆర్బీ ప్రకటించింది.
జూన్ 3 నుంచి ఓఆర్ఆర్ పై టోల్ రుసుములు 2024-25 టోల్ నిబంధనల ప్రకారం పెంచుతున్నట్లు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుములు మార్పులు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఎన్నికల కోడ్ కారణంగా టోల్ పెంపు వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం